iPhone 16 Pro Max : ఐఫోన్ క్రేజే వేరబ్బా.. అమెజాన్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16ప్రో మ్యాక్స్.. తక్కువ ధరకే ఈ డీల్ ఎలా పొందాలంటే?
iPhone 16 Pro Max : ఆపిల్ కొత్త ఐఫోన్ కొంటున్నారా? అమెజాన్‌లో ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ ధర భారీగా తగ్గింది. ఈ డీల్ అతి తక్కువ ధరకే ఎలా పొందాలంటే?

iPhone 16 Pro Max
iPhone 16 Pro Max : మీరు ఆపిల్ అభిమాని అయితే.. మీకో గుడ్ న్యూస్.. ప్రస్తుతం అమెజాన్‌లో ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఆసక్తిగల కస్టమర్లు ఈ ఐఫోన్ కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్లతో సహా రూ.12వేల వరకు తగ్గింపు చేసుకోవచ్చు.
భారత మార్కెట్లో రూ.1,44,900 ధరకు లభించే ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్, టైటానియం ఫ్రేమ్, ప్రీమియం ఇన్-హ్యాండ్ ఫీల్, సూపర్ రెటినా డిస్‌ప్లే, ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు వంటి మరెన్నో ఉన్నాయి. మీరు కొత్త ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ కొనేందుకు చూస్తుంటే ఇదే సరైన సమయం. అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర ఎంత? ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
అమెజాన్‌లో ఐఫోన్ 16 ప్రో మాక్స్ ధర :
అమెజాన్‌లో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర రూ.1,35,900కు లిస్ట్ అయింది. ఈ ఐఫోన్ 16ప్రో ధర రూ.9వేలు తగ్గింది. యాక్సిస్, ఐసీఐసీఐ, కోటక్, ఇతర బ్యాంకులతో సహా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై అమెజాన్ రూ.3వేలు బ్యాంక్ ఆఫర్ కూడా అందిస్తుంది.
కొనుగోలుదారులు నెలకు రూ.6,589 నుంచి EMI ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా రూ.74,300 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. మీ ఫోన్ మోడల్, వేరియంట్, వర్కింగ్ కండిషన్ ఆధారంగా డబ్బు ఆదా చేయొచ్చు. కస్టమర్లు అదనంగా చెల్లిస్తే.. ఆపిల్ కేర్ సర్వీసులతో ప్రొటెక్ట్ ప్లస్ కూడా కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 16 ప్రో మాక్స్ స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ 6.9-అంగుళాల LTPO సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ ప్యానెల్‌తో వస్తుంది. ఈ ఐఫోన్ A18 ప్రో చిప్‌సెట్‌తో వస్తుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు సపోర్టు అందిస్తుంది. 8GB ర్యామ్, 1TB వరకు స్టోరేజీతో వస్తుంది.
ఈ ఐఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4685mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా విషయానికొస్తే.. ఈ ఐఫోన్ 48MP ప్రైమరీ షూటర్, 5x ఆప్టికల్ జూమ్‌తో 12MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 48MP అల్ట్రావైడ్ లెన్స్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఈ ఐఫోన్ 12MP సెల్ఫీ షూటర్‌తో వస్తుంది.