Samsung Galaxy S24 Price : భలే ఆఫర్ బాస్.. ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S24పై కిర్రాక్ డిస్కౌంట్.. కొంటే ఇప్పుడే కొనేసుకోండి!
Samsung Galaxy S24 Price : ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 ధర భారీగా తగ్గింది. ఆసక్తిగల కొనుగోలుదారులు శాంసంగ్ ఫోన్ అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Samsung Galaxy S24 Price
Samsung Galaxy S24 Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అతి తక్కువ ధరకే లభిస్తోంది. కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తుంటే మీకు ఇదే బెస్ట్ టైమ్..ఈ పాపులర్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.12వేల కన్నా ఎక్కువ తగ్గింపుతో లభిస్తుంది.
గెలాక్సీ S24 గతంలో కన్నా చాలా సరసమైన ధరకే కొనుగోలు చేయొచ్చు. కొనుగోలుదారులు మీ బడ్జెట్ ధరలోనే ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవని గమనించాలి. ఈ ఆఫర్ ముగిసేలోగా వెంటనే కొనేసుకోండి.
శాంసంగ్ గెలాక్సీ S24 ఫ్లిప్‌కార్ట్ డీల్ :
ప్రస్తుతం శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో గెలాక్సీ S24 ధర రూ.64,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ రూ.52,840కి అందుబాటులో ఉంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ శాంసంగ్ గెలాక్సీ S24పై రూ.12,159 ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇంకా ఎక్కువ ఆదా చేయాలంటే.. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా మరింత తగ్గింపు పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S24 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇచ్చే 6.2-అంగుళాల LTPO అమోల్డ్‌తో వస్తుంది. హుడ్ కింద ఈ హ్యాండ్‌సెట్ ఎక్సినోస్ 2400 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. గరిష్టంగా 8GB ర్యామ్, 512GB స్టోరేజీతో వస్తుంది.
ఆప్టిక్స్ పరంగా చూస్తే.. శాంసంగ్ గెలాక్సీ S24 హ్యాండ్‌సెట్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 10MP టెలిఫోటో లెన్స్, 12MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లో ఫ్రంట్ సైడ్ 12MP సెల్ఫీ షూటర్ ఉంది. ఇంకా, శాంసంగ్ గెలాక్సీ S24 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. మీరు ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు.