Motorola Edge 60 Pro : మతిపోగొట్టే ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 60ప్రో వచ్చేసింది.. ఈ ఫోన్ ఎందుకు కొనాలంటే? ఫుల్ డిటెయిల్స్

Motorola Edge 60 Pro : కొత్త మోటోరోలా ఫోన్ కావాలా? అద్భుతమైన ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో లాంచ్ అయింది. ఈ నెల 30న భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

Motorola Edge 60 Pro : మతిపోగొట్టే ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 60ప్రో వచ్చేసింది.. ఈ ఫోన్ ఎందుకు కొనాలంటే? ఫుల్ డిటెయిల్స్

Motorola Edge 60 Pro

Updated On : April 25, 2025 / 4:52 PM IST

Motorola Edge 60 Pro : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? గ్లోబల్ మార్కెట్లోకి మోటోరోలా నుంచి సరికొత్త మోటోరోలా ఎడ్జ్ 60ప్రో వచ్చేసింది. అతి త్వరలో భారత మార్కెట్లోకి కూడా రానుంది. మోటోరోలా ఎడ్జ్ 60 సిరీస్‌లో ఇప్పటికే భారత్‌లో ఎడ్జ్ 60 ఫ్యూజన్, మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ ఉన్నాయి.

Read Also : Samsung Galaxy S25 Ultra : భలే డిస్కౌంట్ భయ్యా.. అమెజాన్‌లో ఈ శాంసంగ్ అల్ట్రా ఫోన్‌పై భారీ తగ్గింపు.. ఇంకా తక్కువ ధరకే కావాలంటే?

రాబోయే స్మార్ట్‌ఫోన్‌లు ప్రపంచ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. నివేదికల ప్రకారం.. ఏప్రిల్ 30న భారత్‌లో లాంచ్ అవుతాయని భావిస్తున్నారు. ఈ మోడల్‌లో 1.5K pOLED డిస్‌ప్లేలు, 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్స్, దుమ్ము, నీటి నిరోధకతకు IP68 + IP69 రేటింగ్ ఉన్నాయి. మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది.

మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ధర :
యూకేలో మోటోరోలా ఎడ్జ్ 60ప్రో ఫోన్ 12GB + 256GB వేరియంట్ ధర GBP 599 (సుమారు రూ. 68వేలు), ప్యాంటోన్ డాజ్జిలింగ్ బ్లూ, ప్యాంటోన్ షాడో, ప్యాంటోన్ స్పార్క్లింగ్ గ్రేప్ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే యూకేలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఏప్రిల్ 30న భారత మార్కెట్లో అందుబాటులోకి రానుంది.

మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో స్పెసిఫికేషన్లు :
మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో ఫోన్ 6.67-అంగుళాల 1.5K (1,220 x 2,712 పిక్సెల్స్) 10-బిట్ pOLED డిస్‌ప్లే కలిగి ఉంది. 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ గరిష్ట ప్రకాశంతో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i నుంచి ప్రొటెక్షన్ అందిస్తుంది.

మోటోరోలా ఆండ్రాయిడ్ 15-ఆధారిత హలో యూఐపై రన్ అవుతుంది. మోటోరోలా ఎడ్జ్ 60 ప్రోలో మీడియాటెక్ డైమన్షిటీ 8350 ఎక్స్‌ట్రీమ్ SoC, 12GB వరకు LPDDR4X ర్యామ్, 512GB వరకు యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్‌తో వస్తుంది. మాలి-G615 MC6 జీపీయూ ఉన్నాయి.

ఈ మోటోరోలా మోడల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో సోనీ LYTIA 700C సెన్సార్, f/1.8 అపెర్చర్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP ప్రైమరీ కెమెరా, f/2.0 అపెర్చర్, మాక్రో 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్, 73mm ఫోకల్ లెంగ్త్, f/2.0 అపెర్చర్‌ను అందించే 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం f/2.0 అపెర్చర్‌తో 50MP ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంది.

Read Also : Realme 14T Launch : కొత్త రియల్‌మి 5G ఫోన్ ఆగయా.. ఏఐ ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర కూడా మీ బడ్జెట్‌లోనే.. డోంట్ మిస్..!

ఈ మోటోరోలా మోడల్ దుమ్ము, నీటి నిరోధకతకు IP68 + IP69 రేటింగ్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G SA/NSA, Wi-Fi 6E, బ్లూటూత్ 5.4, NFC, USB టైప్-Cతో పాటు డాల్బీ అట్మాస్ సపోర్టు అందిస్తుంది. స్టీరియో స్పీకర్లకు సపోర్టు ఇస్తుంది. ఎడ్జ్ 60 ప్రో 90W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,000mAh బ్యాటరీని అందిస్తుంది. 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.