Maharashtra: మహారాష్ట్రలో ఎక్సాన్ మొబిల్ రూ.900 కోట్ల పెట్టుబడులు.. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‭తో ఒప్పందం

మా తొలి గ్రీన్ ఫీల్డ్ పెట్టుబడితో భారతదేశం పట్ల మా దీర్ఘకాలిక నిబద్ధతను మరింత బలోపేతం చేయడం పట్ల మేం గర్విస్తున్నాం. మహారాష్ట్రలోని ప్లాంట్ అతిపెద్ద తయారీ కేంద్రాల్లో ఒకటి. ఆకర్షణీయమైన పెట్టుబడి వాతావరణం కారణంగా మా లూబ్రికెంట్ ప్లాంట్‌‌కు ఇది ఉత్తమమైన ఎంపికగా భావిస్తున్నాం

Maharashtra: మహారాష్ట్రలో ఎక్సాన్ మొబిల్ రూ.900 కోట్ల పెట్టుబడులు.. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‭తో ఒప్పందం

ExxonMobil invests 900 crores in Maharashtra

Updated On : April 10, 2023 / 8:08 PM IST

Maharashtra: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో ఉన్న మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు చెందిన ఇసాంబే ఇండస్ట్రియల్ ఏరియాలో లూబ్రికెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌ను నిర్మించడానికి ఎక్సాన్ మొబిల్ (ExxonMobil) దాదాపు 900 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సామంత్, మహారాష్ట్రకు చెందిన సీనియర్ అధికారులతో సమావేశమైన అనంతరం ఎక్సాస్ మొబైల్ ఈ ప్రకటన చేసింది.

IPL 2023, RCB vs LSG: దూకుడుగా ఆడుతున్న కోహ్లి.. అర్ధ‌శ‌త‌కానికి చేరువ‌గా..Live Updates

ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తే తయారీ, ఉక్కు, విద్యుత్, మైనింగ్, నిర్మాణం వంటి పారిశ్రామిక రంగాలతో పాటు ప్యాసింజర్, కమర్షియల్ వెహికిల్ సెగ్మెంట్‌ల నుంచి పెరుగుతున్న దేశీయ డిమాండ్‌ను తీర్చడానికి ఏటా 1,59,000 కిలోలీటర్ల ఫినిష్డ్ లూబ్రికెంట్‌ తయారు చేసే సామర్థ్యం ఉంటుంది. ఇది 2025 చివరి నాటికి తన కార్యకలాపాలను ప్రారంభిస్తుందని కంపెనీ పేర్కొంది.

Best Laptops in April : కొత్త ల్యాప్‌టాప్ కావాలా? ఈ నెలలో రూ. 50వేల లోపు 5 బెస్ట్ ల్యాప్‌టాప్‌లు.. మీకు నచ్చిన మోడల్ కొనేసుకోండి..!

ఈ విషయమై ExxonMobil అఫిలియేట్‌ల లీడ్ ఇండియా మేనేజర్ మాట్లాడుతూ “మా తొలి గ్రీన్ ఫీల్డ్ పెట్టుబడితో భారతదేశం పట్ల మా దీర్ఘకాలిక నిబద్ధతను మరింత బలోపేతం చేయడం పట్ల మేం గర్విస్తున్నాం. మహారాష్ట్రలోని ప్లాంట్ అతిపెద్ద తయారీ కేంద్రాల్లో ఒకటి. ఆకర్షణీయమైన పెట్టుబడి వాతావరణం కారణంగా మా లూబ్రికెంట్ ప్లాంట్‌‌కు ఇది ఉత్తమమైన ఎంపికగా భావిస్తున్నాం” అని అన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవకు గణనీయంగా ప్రోత్సాహం అందించడంతో పాటుగా, ప్లాంట్ బేస్ స్టాక్స్, ఎడిటివ్‌లతో పాటు అన్ని ప్యాకేజింగ్‌ల్లో ఎక్కువ భాగాన్ని స్థానికంగా సేకరించనుంది. నిర్మాణ దశలో దాదాపు 1,200 మందికి ఉపాధి కల్పిస్తుందని భావిస్తున్నారు.