Tech Tips in Telugu
Tech Tips in Telugu : కొత్త స్మార్ట్ ఫోన్ కొంటున్నారా? మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే.. సాధారణంగా ఈరోజుల్లో చాలామంది కొత్త స్మార్ట్‌ఫోన్ కొన్నప్పుడు తమ పాత ఫోన్‌ను వెంటనే ఎక్స్ఛేంజ్ చేసుకునేందుకు ఇష్టపడతారు. ఇందుకోసం తమ పాత ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేస్తుంటారు. ఆ తర్వాత ఇతరులకు అమ్మేస్తారు. ఫోటోలు, వీడియోలతో సహా అన్ని పర్సనల్ డేటా వారి పాత ఫోన్ నుంచి డిలీట్ అయిందని అనుకుంటారు. ఫోన్ విక్రయించే సమయంలో కూడా ఇలానే భావిస్తుంటారు.
మీరు కూడా అదే అనుకుంటే.. భారీగా నష్టపోతారు జాగ్రత్త.. మీ ఫోన్‌ను విక్రయించేటప్పుడు లేదా ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ఫ్యాక్టరీ రీసెట్ చేయడం ఒక్కటే సరిపోదు. అలా చేశాక కూడా మీ ఫొటోలు, వీడియోలు, ఇతర డేటాను మీ ఫోన్ నుంచి ఈజీగా తిరిగి పొందవచ్చు.మీ ఫోన్‌ను రీసెట్ చేసేందుకు మరో సరైన పద్ధతి ఏంటి మీ ఫోన్‌ను అమ్మడం లేదా ఎక్స్చేంజ్ చేసేటప్పుడు, వ్యక్తిగత డేటా తప్పుడు చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మీ ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయడం వల్ల అందులోని మొత్తం డేటా డిలీట్ అయిపోతుంది. మీ ఫోన్ రీసెట్ చేశాం కదా అమ్మేయడం పూర్తిగా సేఫ్ అనుకోవద్దు. వాస్తవానికి, మీ ఫోన్‌ను రీసెట్ చేసిన తర్వాత కూడా అందులోని ఫొటోలు, వీడియోలు వంటి డేటాను సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి సులభంగా రికవరీ చేయొచ్చు.
ఫోన్ రీసెట్‌కు సరైన మార్గం ఏంటి? :
మీ ఫోన్‌ను రీసెట్ చేసిన తర్వాత మీరు మళ్ళీ సెటప్ చేయాలని గుర్తుంచుకోవడం ముఖ్యం. మీ ఫోన్‌ను రీసెట్ చేస్తున్నప్పుడు మీ ఇమెయిల్ అడ్రస్ లాగిన్ అయ్యే ఆప్షన్ స్కిప్ చేయొచ్చు. మీ ఫోన్‌ను రీసెట్ చేసిన తర్వాత కొన్ని ఫొటోలు లేదా వీడియోలను క్యాప్చర్ చేయండి. తద్వారా మీ ఫోన్ గత మెమరీని పూర్తిగా క్లియర్ చేస్తుంది. ఆ తర్వాత మీ ఫోన్‌ను మళ్లీ ఫ్యాక్టరీ రీసెట్ చేయండి. ఇప్పుడు, ఎవరైనా మీ ఫోన్ నుంచి పాత డేటాను తిరిగి పొందడానికి ట్రై చేస్తే.. మీ వ్యక్తిగత డేటాకు బదులుగా అప్పటికప్పుడు క్లిక్ చేసిన ఫొటోలు, వీడియోలు మాత్రమే పొందగలరు.
అన్ని అకౌంట్ల నుంచి లాగ్ అవుట్ అవ్వండి :
స్మార్ట్‌ఫోన్ వాడే యూజర్లు తరచుగా మల్టీ అకౌంట్లలో లాగిన్ అవుతారు. ఆపై ఫోన్‌ను విక్రయించే ముందు ఆయా అకౌంట్ల నుంచి లాగ్ అవుట్ చేయకుండా ఫ్యాక్టరీ రీసెట్ చేస్తారు. మీ ఫోన్‌ను ఇలా రీసెట్ చేయడం అనేది సరైన మార్గం కాదు. వాస్తవానికి, మీ ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేసే ముందు లాగిన్ అయిన అన్ని జీమెయిల్ అకౌంట్ల నుంచి లాగ్ అవుట్ చేయాలి. మీరు సెట్టింగ్‌లకు వెళ్లి, ఆపై అకౌంట్లకు వెళ్లి లాగౌట్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల రీసెట్ తర్వాత మీ అకౌంట్లు ఫోన్ నుంచి పూర్తిగా డిలీట్ అవుతాయి.
ఐఫోన్‌లు, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు కూడా తరచుగా తమ డేటాను మాన్యువల్‌గా బ్యాకప్ చేస్తాయి. ఇది డేటా సేఫ్టీకి బెస్ట్. కానీ, సేల్ లేదా ఎక్స్చేంజ్ కోసం మీ ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేసే ముందు మీరు బ్యాకప్ సెట్టింగ్‌లను ఆఫ్ చేయాలి. అప్పుడు మాత్రమే మీరు మీ ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి.
ముఖ్యమైన యాప్స్ లాగ్ అవుట్ చేయండి :
ప్రస్తుత రోజుల్లో మన స్మార్ట్‌ఫోన్‌లలో కేవలం ఫోన్‌లు మాత్రమే కాదు. అందులో మనకు అత్యంత ముఖ్యమైన సమాచారం, మరెన్నో యాప్‌లు కూడా ఉన్నాయి. అందుకే మీ ఫోన్‌ను విక్రయించడం లేదా ఎక్స్చేంజ్ చేయాలనే భావిస్తే.. ఫ్యాక్టరీ రీసెట్ చేసే ముందు అన్ని లేదా కనీసం అత్యంత ముఖ్యమైన యాప్స్ నుంచి లాగ్ అవుట్ చేయడం చాలా ముఖ్యం. ఈ యాప్‌లలో వాట్సాప్, బ్యాంకింగ్ పేమెంట్ యాప్‌లు ఉండవచ్చు. అలా చేయడం వల్ల మీ వ్యక్తిగత చాట్స్, యాప్‌లు తప్పుడు చేతుల్లోకి వెళ్లకుండా ఉంటుంది.
eSIM బయోమెట్రిక్ డేటాను డిలీట్ చేయండి :
చాలామంది చాలాసార్లు తమ ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయాలనే తొందరలో ఫోన్ నుంచి e-SIMని రిమూవ్ చేయడం లేదా ట్రాన్స్‌ఫర్ చేయడం మర్చిపోతారు. ఇలాంటి పరిస్థితిలో మీ ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేసే ముందు e-SIMని కొత్త ఫోన్‌కి ట్రాన్స్‌ఫర్ చేయండి లేదా డిలీట్ చేయండి. అలా చేయకపోవడం వల్ల మీకు ఆర్థికంగా నష్టాన్ని కలిగించవచ్చు. మీ ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేసే ముందు మీ ఫింగర్ ఫ్రింట్, ఫేస్ వంటి మీ బయోమెట్రిక్ డేటాను కూడా తప్పనిసరిగా డిలీట్ చేయాలని గుర్తుంచుకోండి.