Fall Of Byjus : బైజూస్‌కు షాకిచ్చిన ప్రోసస్.. ఈ దెబ్బతో భారీగా పతనం.. 3 బిలియన్ డాలర్లకు తగ్గిన కంపెనీ విలువ..!

Fall Of Byjus : బైజూస్ కంపెనీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. టెక్ ఇన్వెస్టర్ ప్రోసస్.. ఎడ్‌టెక్ స్టార్టప్ కంపెనీ విలువలో భారీగా కోత విధించింది. బైజూస్ భారీగా పతనమై ఏడాదిలో 22 బిలియన్ డాలర్ల నుంచి 3 బిలియన్ డాలర్లకు తగ్గింది.

Fall Of Byjus : ప్రముఖ ఎడ్‌టెక్ స్టార్టప్ కంపెనీ బైజూస్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పటికే ఫెమా కేసు, బీసీసీఐ వ్యవహరంలో ఈడీ నోటీసులతో చిక్కుల్లో పడిన బైజూస్‌కు ఊహించని షాక్ తగిలింది. ఎడ్టెక్ స్టార్టప్ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టిన టెక్ ఇన్వెస్టర్ ప్రోసెస్ దాని కంపెనీ విలువలో కోత విధించింది. ఈ దెబ్బతో బైజూస్‌ కంపెనీ విలువను ఏడాదిలో 3 బిలియన్ల డాలర్ల కన్నా తక్కువకు పడిపోయింది. గత ఏడాదిలో గరిష్టంగా 22 బిలియన్ డాలర్ల కన్నా 86శాతం తక్కువగా ఉంది. కోవిడ్ మహమ్మారి సమయంలో వేగవంతంగా విస్తరించిన బైజూస్ బకాయిల చెల్లింపునకు సంబంధించిన సమస్యలతో పోరాడుతోంది.

Read Also : IndiGo ChatGPT AI : ఇండిగో నుంచి కొత్త ఏఐ చాట్‌జీపీటీ.. పది భాషల్లో మాట్లాడగలదు.. ఈజీగా టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు!

గతంలో 1.2 బిలియన్ డాలర్ల రుణంపై రుణదాతలతో వివాదంలో చిక్కుకుంది. గత ఏడాదిలో ప్రొసెస్, బ్లాక్‌రాక్‌తో సహా వాటాదారులు వరుసగా మార్చిలో 11 బిలియన్ డాలర్లకు, మేలో 8 బిలియన్ డాలర్లకు, జూన్ నెలలో 5 బిలియన్ డాలర్లకు బైజూ విలువను తగ్గించారు. అయితే, స్టార్టప్ రూ. 2,250 కోట్ల నష్టాన్ని ప్రకటించిన కొద్ది రోజులకే ప్రోసస్ ఆదాయాల కాల్ సందర్భంగా తాత్కాలిక సీఈఓ ఎర్విన్ టు నిర్ణయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

బైజూస్‌పై దావా వేసిన రుణదాతలు :
బైజూస్ 2021/22 ఆర్థిక ఫలితాలను దాఖలు చేయడంలో దాదాపు ఒక సంవత్సరం ఆలస్యం చేసింది. దాంతో ఆడిటర్ డెలాయిట్, ముగ్గురు బోర్డు సభ్యులు నిష్క్రమించారు. ఈ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కూడా గత వారమే బోర్డు నుంచి నిష్క్రమించారు. భారత మార్కెట్లో అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ ఎకానమీకి ఒకప్పుడు పోస్టర్ చైల్డ్ అయిన బైజూస్.. కోవిడ్ అనంతరం ఎదురైన సవాళ్ల నుంచి తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

Fall Of Byjus

1.2 బిలియన్ డాలర్ల రుణంపై ఒప్పందాన్ని ఉల్లంఘించిన తర్వాత రుణదాతలు ఈ ఏడాదిలో బైజూస్‌పై దావా వేశారు. ఈ ప్రతిష్టంభన వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్‌పై దృష్టి సారించింది. ఒక ట్యూటర్ నుంచి దేశంలోని అత్యంత విలువైన టెక్ స్టార్టప్ అధిపతిగా రవీంద్రన్ ఎదగడం పెట్టుబడిదారులను ఆశ్చర్యపరిచింది. ఫెమా ఉల్లంఘన కేసులో రవీంద్రన్‌కు ఈడీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది కూడా. ఆ తర్వాతే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

కోవిడ్ అనంతరం భారీగా మందగించిన బైజూస్ వృద్ధి :
కోవిడ్ మహమ్మారి సమయంలో పాఠశాలలు, యూనివర్శిటీలు మూసివేసిన తర్వాత కంపెనీ భారీగా ఖర్చు చేసింది. ఇది వేగంగా విస్తరించడానికి ప్రయత్నించినందున భారత్‌లోనే కాకుండా అమెరికాలో కూడా అనేక ఎడ్‌టెక్ స్టార్టప్‌లను కొనుగోలు చేసింది. కానీ, తరగతులు పునఃప్రారంభమైనప్పటి నుంచి దీని వృద్ధి మందగించింది.

కంపెనీ సవాళ్లను ఎదుర్కొంటున్న క్రమంలోనే చట్టపరమైన వివాదంతో మరింత తీవ్రమయ్యాయి. ఇదిలా ఉండగా, టెక్ ఇన్వెస్టర్ ప్రాసస్ వాల్యుయేషన్ కోతకు కారణాన్ని చెప్పలేదు. అయితే, జూలైలో డచ్-లిస్టెడ్ టెక్ ఫర్మ్ మాజీ డైరెక్టర్ స్టార్టప్ పాలనా పరంగా మార్పులు చేసేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కంపెనీ మేనేజ్‌మెంట్ సలహాలను విస్మరించిందని ప్రోసెస్ విమర్శలు చేసింది.

Read Also : Most Expensive Cities : 2023 ఏడాదిలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలు ఏంటో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు