IndiGo ChatGPT AI : ఇండిగో నుంచి కొత్త ఏఐ చాట్‌జీపీటీ.. పది భాషల్లో మాట్లాడగలదు.. ఈజీగా టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు!

IndiGo ChatGPT AI : ఇండిగో అధునాతన GPT-4 టెక్నాలజీ ఉపయోగించి 6Eskai అనే కొత్త ఏఐ చాట్‌బాట్‌ను ప్రవేశపెట్టింది. ఈ చాట్‌బాట్ పది భాషల్లో టికెట్ బుకింగ్ చేయడంతో పాటు ప్రయాణికుల ప్రశ్నలకు సమాధానమివ్వగలదు.

IndiGo ChatGPT AI : ఇండిగో నుంచి కొత్త ఏఐ చాట్‌జీపీటీ.. పది భాషల్లో మాట్లాడగలదు.. ఈజీగా టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు!

IndiGo introduces ChatGPT-based AI chatbot for queries, ticket booking

IndiGo ChatGPT AI : ప్రముఖ భారతీయ విమానయాన సంస్థ, పెద్ద ఎయిర్‌లైన్స్‌లో ఒకటైన ఇండిగో విమాన ప్రయాణికుల కోసం (6Eskai) పేరుతో కొత్త ఏఐ చాట్‌బాట్‌ను ప్రవేశపెట్టింది. ఈ చాట్‌బాట్ సూపర్-స్మార్ట్ (GPT-4) టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఇండిగో ప్రధాన లక్ష్యం ఏమిటంటే.. ఈ చాట్‌బాట్ సాయంతో విమాన ప్రయాణికుల ప్రశ్నలకు పది వేర్వేరు భాషల్లో సమాధానాలు ఇవ్వగలదు. అంతేకాదు.. ఎయిర్‌లైన్ నెట్‌వర్క్ అంతటా విమానాల్లో టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి ప్రయాణికులను అనుమతిస్తుంది.

మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో చాట్‌బాట్ తయారీ :
ఈ కొత్త చాట్‌బాట్‌ను ఇండిగో డిజిటల్ టీమ్ పూర్తిగా అంతర్గతంగా తయారు చేసిందని ఎయిర్‌లైన్ ప్రతినిధి తెలిపారు. ఈ కూల్ టెక్ ఏఐ చాట్‌బాట్‌ను రూపొందించేందుకు ఇండిగో మైక్రోసాఫ్ట్‌తో కలిసి పనిచేసిందని ఆయన తెలిపారు. దీని ప్రకారం.. ఈ ఏఐ చాట్‌బాట్ కోసం ఎయిర్‌లైన్‌కు భారీ ఒప్పందం కుదుర్చుకుంది.

Read Also : Bard AI chatbot : ప్రపంచవ్యాప్తంగా యువత కోసం బార్డ్ ఏఐ చాట్‌బాట్ అందుబాటులోకి.. గూగుల్ సడెన్ యూటర్న్ ఎందుకంటే?

ఈ కొత్త ఏఐ టెక్నాలజీతో ఇండిగో ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు గగన ప్రయాణాన్ని సులభతరం చేస్తోంది. టాప్ రేంజ్ ఏఐని ఉపయోగించే ఎయిర్‌లైన్స్‌లో ఇండిగో మొదటిదిగా చెప్పవచ్చు. ఏఐ చాట్‌బాట్ సాఫ్ట్ లాంచ్ తర్వాత.. కస్టమర్ సర్వీస్ ఏజెంట్ల పనిలో 75శాతం తగ్గుదల కనిపించిందని ప్రతినిధి పేర్కొన్నారు. ఈ ఏఐ చాట్‌బాట్ సూపర్ ఎఫెక్టివ్‌గా పనిచేస్తోందని అన్నారు.

ఏఐ బోట్ ప్రయాణికులను సైతం ఆకట్టుకుంటుంది. 1.7 ట్రిలియన్ భారీ పారామితులను కలిగి ఉంది. ప్రయాణికులు సాధారణంగా అడిగే అనేక ప్రశ్నలకు సులభంగా సమాధానం ఇవ్వగలదు. ఇండిగో బ్రైనరీ డేటా శాస్త్రవేత్తల బృందం జెనరేటివ్ ప్రీట్రైన్డ్ ట్రాన్స్‌ఫార్మర్స్ (GPT) అనే విషయాన్ని అధ్యయనం చేసింది. ఆ తర్వాత ఈ చాట్‌బాట్‌కు మనుషుల్లా వ్యవహరించేలా ట్రైనింగ్ ఇచ్చింది. అంతేకాదు.. మనుషుల భావోద్వేగాలను కూడా ఇది అర్థం చేసుకోగలదు. ప్రయాణికుల మూడ్ బట్టి వారు అడిగిన ప్రశ్నలకు చాట్ ఆధారంగా సమాధానాలను ఇవ్వగలదు.

IndiGo introduces ChatGPT-based AI chatbot for queries, ticket booking

IndiGo ChatGPT-based AI chatbot

చాట్‌బాట్ ఎలా పనిచేస్తుందంటే? :
ఇండిగో (6Eskai) చాట్‌బాట్ అనేక పనులను వేగవంతంగా పూర్తిచేయగలదని ప్రతినిధి చెప్పారు. ముఖ్యంగా విమాన టిక్కెట్లను బుక్ చేయడం, డిస్కౌంట్లను ఉపయోగించడం, బుకింగ్‌లకు అదనపు టికెట్లను యాడ్ చేయడం, వెబ్ చెక్-ఇన్‌లు చేయడం, సీట్లను ఎంచుకోవడంలో సహాయం చేయడం, ప్రయాణాలను ప్లాన్ చేయడం, సాధారణ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, ప్రయాణీకులకు అవసరమైనప్పుడు కస్టమర్ హెల్ప్ సెంటర్‌కు కనెక్ట్ చేయడం, చాట్‌లో టైప్ చేసిన మెసేజ్‌లను చదవడం మాత్రమే కాదు.. మాట్లాడే పదాలను కూడా ఈజీగా అర్థం చేసుకోగలదు.

ఇండిగోలో (ifly), కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అయిన సుమ్మీ శర్మ మాట్లాడుతూ.. 6ఈఎస్‌కెఏఐ చాట్‌జీపీటీ విషయంలో చాలా ఉత్సాహంగా ఉన్నట్టు చెప్పారు. ఈ స్మార్ట్ చాట్ అసిస్టెంట్ ప్రయాణికులకు అవసరమైన సాయం చేస్తుందని, వారికి అవసరమైనప్పుడు వేగవంతమైన పనులను చేయగలదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ ప్రయాణాన్ని సులభతరం చేయడమే లక్ష్యంగా ఇండిగో ఈ కొత్త టెక్నాలజీని తీసుకువచ్చిందని శర్మ పేర్కొన్నారు.

Read Also : WhatsApp AI chatbot : వాట్సాప్ యూజర్ల కోసం కొత్త ఏఐ చాట్‌బాట్.. ఇదేలా పనిచేస్తుందంటే?