Bard AI chatbot : ప్రపంచవ్యాప్తంగా యువత కోసం బార్డ్ ఏఐ చాట్‌బాట్ అందుబాటులోకి.. గూగుల్ సడెన్ యూటర్న్ ఎందుకంటే?

Bard AI chatbot : గూగుల్ ఏఐ లాంగ్వేజ్ మోడల్ బార్డ్‌ను ప్రపంచవ్యాప్తంగా యువకులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. బాధ్యతాయుతమైన ఏఐ వినియోగానికి ప్రాధాన్యతనిస్తూ నేర్చుకోవడంతో పాటు సమస్య పరిష్కారానికి శక్తివంతమైన టూల్ అందిస్తుంది.

Bard AI chatbot : ప్రపంచవ్యాప్తంగా యువత కోసం బార్డ్ ఏఐ చాట్‌బాట్ అందుబాటులోకి.. గూగుల్ సడెన్ యూటర్న్ ఎందుకంటే?

Bard AI chatbot is now available for teenagers

Bard AI chatbot : ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఏఐ లాంగ్వేజ్ మోడల్ బార్డ్‌ని ప్రపంచవ్యాప్తంగా యువకులకు కోసం విస్తరిస్తోంది. నవంబర్ 17 (ఈరోజు) నుంచి సంబంధిత దేశాల్లో గూగుల్ అకౌంట్లలో కనీస వయస్సు ఆవశ్యకతను కలిగిన యుక్తవయస్కులు వారికి బార్డ్ ఏఐ యాక్సస్ అందిస్తోంది. తద్వారా ప్రాజెక్ట్‌లు, ఇతర పనుల కోసం బార్డ్ ఏఐ టెక్నాలజీని యాక్సస్ పొందవచ్చు. బాధ్యతాయుతమైన ఏఐ కోసం గూగుల్ ప్రొడక్ట్ హెడ్ తులసీ దోషి మాట్లాడుతూ.. కంపెనీ ఏఐ చాట్‌బాట్ బార్డ్‌ను యువకులకు అందుబాటులోకి తీసుకురావడంలో బాధ్యత వహించడంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు.

ముఖ్యంగా యువకుల కోసం తమ కంటెంట్ విధానాలను రూపొందించడంలో భద్రతకు ప్రాధాన్యతనిచ్చేలా పిల్లల భద్రతపై డెవలప్‌మెంట్ ఎక్స్‌పర్ట్స్‌ను సంప్రదించినట్లు కంపెనీ పేర్కొంది. యుక్తవయస్కులకు బార్డ్ యాక్సెస్‌ని విస్తరించడానికి గూగుల్ ఆలోచనాత్మకమైన విధానాన్ని అందించనున్నట్టు తెలిపారు. యువకులకు భద్రతతో కూడిన ఈ టెక్నాలజీని అందించడంలో ముఖ్యమైన దశను సూచిస్తుందని ఫ్యామిలీ ఆన్‌లైన్ సేఫ్టీ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకుడు అండ్ సీఈఓ స్టీఫెన్ బల్కం పేర్కొన్నారు.

యువకులు బార్డ్‌ని ఎలా ఉపయోగించాలంటే? :

యువకులు ప్రసంగం రాయడం లేదా గణిత సమస్యలను పరిష్కరించేందుకు బార్డ్ ఏఐ నుంచి సాయం తీసుకోవచ్చని గూగుల్ చెబుతోంది. యువత వారి అవగాహనను మెరుగుపరచుకోవడానికి కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి బార్డ్‌ను ఉపయోగించవచ్చు. అంతేకాదు.. వ్యక్తిగత విషయాలపై మార్గదర్శకత్వంతో పాటు సంక్లిష్టమైన అంశాల్లోకి ప్రవేశించవచ్చు. మరింత బార్డ్ ఇంటరాక్టివ్ మ్యాథ్ లెర్నింగ్ టూల్స్, డేటా విజువలైజేషన్ సామర్థ్యాలు టీనేజ్‌లకు అవగాహన కల్పించేందుకు సమాచారాన్ని సమర్థవంతంగా విశ్లేషించడానికి దోహదపడతాయి.

Read Also : Honor 100 Series Launch : ఈ నెల 23న హానర్ 100 సిరీస్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

అన్వేషణ, నేర్చుకోవడం, సమస్య పరిష్కారానికి బార్డ్ మల్టీ టూల్ అని గూగుల్ చెబుతోంది. యుక్తవయస్కులను వారి జీవితంలోని వివిధ కోణాలను నావిగేట్ చేయడానికి సాయపడుతుందని అంటోంది. అయితే, గూగుల్ బార్డ్ అందించే ఈ ఫీచర్‌లు ఇంగ్లీషులో అందుబాటులోకి రానున్నాయని, భవిష్యత్తులో టీనేజర్‌ల కోసం మరిన్ని ఫీచర్లు చేర్చనున్నట్టు గూగుల్ పేర్కొంది.

Bard AI chatbot is now available for teenagers

Bard AI chatbot for teenagers

ముఖ్యంగా, గూగుల్ బార్డ్ ఏఐ ల్యాండ్‌స్కేప్‌లో (OpenAI) చాట్‌జీపీటీ (ChatGPT)తో పోటీపడుతోంది. గత ఏడాదిలో ప్రారంభమైన చాట్ జీపీటీ.. ప్రస్తుతం భారీ యూజర్ బేస్‌తో అత్యంత విస్తృతంగా ఉపయోగించే ఏఐ చాట్‌బాట్‌గా అవతరించింది. ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించడానికి గూగుల్ ఇప్పుడు బార్డ్ చాట్‌బాట్‌ను 18 ఏళ్లలోపు యువకులకు ఉపయోగించడానికి అనుమతిస్తుంది. అది కూడా మెరుగైన భద్రతా చర్యలతో యువతకు అందుబాటులోకి తీసుకొస్తోంది.

యువకుల భద్రతకు బార్డ్‌కి శిక్షణ :
యుక్తవయస్కులకు బార్డ్ ఏఐ సురక్షితమేనని నిర్ధారించుకోవడానికి కంపెనీ అనేక చర్యలు తీసుకుందని గూగుల్ తెలిపింది. యువతకు తగని కంటెంట్‌ను గుర్తించడంతో పాటు నివారించడానికి బార్డ్‌కి ట్రైనింగ్ ఇచ్చినట్టు తెలిపింది. టీనేజ్‌లకు బార్డ్ ప్రతిస్పందనలలో అసురక్షిత కంటెంట్ కనిపించకుండా నిరోధించడానికి భద్రతా ఫీచర్లను అమల్లోకి తీసుకొచ్చింది.

అదనంగా, (LLM) కొన్నిసార్లు భ్రాంతులు లేదా ఫేక్ డీటిల్స్‌ను క్రియేట్ చేయగలవని గూగుల్ అంగీకరిస్తుంది. అదేవిధంగా బార్డ్ ఏఐ స్పందనలో కచ్చితత్వాన్ని ధృవీకరించేందుకు ‘డబుల్-చెక్’ అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. టీనేజ్ వారి మొదటి వాస్తవ-ఆధారిత ప్రశ్నను అడిగినప్పుడు ఈ ఫీచర్ ఆటోమాటిక్‌గా ఎనేబుల్ అవుతుంది. సమాచార అక్షరాస్యత, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్‌ను అభివృద్ధి చేయడంలో ఈ ఫీచర్‌ని ఉపయోగించమని గూగుల్ టీనేజ్‌లను ప్రోత్సహిస్తుంది.

Bard AI chatbot is now available for teenagers

Bard AI chatbot 

ఏఐని సురక్షితంగా ఎలా ఉపయోగించాలంటే? :
జనరేటివ్ ఏఐని బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించాలనే దానిపై టీనేజర్‌లకు అనేక ప్రశ్నలు ఉన్నాయని గూగుల్ చెబుతోంది. ఈ ఆందోళనలను పరిష్కరించడానికి, యుక్తవయస్కుల కోసం గూగుల్ బార్డ్‌లో తగిన ఆన్‌బోర్డింగ్ ఎక్స్‌పీరియన్స్ అభివృద్ధి చేసింది. ఈ ఆన్‌బోర్డింగ్ ఎక్స్‌పీరియన్స్ ఏఐ అక్షరాస్యత గైడ్, జనరేటివ్ ఏఐని బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించాలనే దానిపై టిప్స్‌తో కూడిన వీడియోలను అందిస్తోంది. అదనంగా, ఆన్‌బోర్డింగ్ బార్డ్ యాక్టివిటీ ఎలా పనిచేస్తుంది అనేదానిపై కూడా అవగాహన కల్పిస్తుంది. టీనేజ్‌లకు ఈ ఫీచర్ ఆన్ లేదా ఆఫ్ చేసే ఆప్షన్ కూడా అందిస్తుంది.

Read Also : Most Used Passwords : భారత్‌లో అత్యధికంగా వాడే టాప్ 20 పాస్‌వర్డులు ఇవే.. ఎంత సమయంలో క్రాక్ చేయొచ్చుంటే?