Most Used Passwords : భారత్‌లో అత్యధికంగా వాడే టాప్ 20 పాస్‌వర్డులు ఇవే.. ఎంత సమయంలో క్రాక్ చేయొచ్చుంటే?
Most Used Passwords : మీ పాస్‌వర్డ్ ఇదేనా? భారతీయ యూజర్లు చాలామంది ఎక్కువగా ఎలాంటి పాస్‌వర్డులను వాడుతున్నారో తెలుసా? అత్యధికంగా వాడే టాప్ 20 పాస్‌వర్డులను ఎంత సమయంలో క్రాక్ చేయొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Top 20 most used passwords in India
Most Used Passwords : ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీకి తగినట్టుగా సైబర్ మోసాలు భారీగా పెరిగిపోతున్నాయి. సైబర్ క్రైమ్‌లకు ఎక్కువగా అవకాశం ఉన్న సమయంలో మీ వ్యక్తిగత అకౌంట్లను ప్రొటెక్ట్ చేసుకోవడానికి సరైన పాస్‌వర్డ్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. కానీ, చాలామంది తమ ఆన్‌లైన్ అకౌంట్ల పాస్‌వర్డ్‌లను సులభంగా గుర్తుండేలా సెట్ చేసుకుంటారు.
అదే సైబర్ మోసగాళ్లకు వరంగా మారింది. ఎందుకంటే.. సైబర్ నేరగాళ్లు సులభంగా ఆయా పాస్‌వర్డ్‌లను హ్యాక్ చేయగలరు. (NordPass) రిపోర్టు ప్రకారం.. భారతీయ యూజర్లు ఎక్కువగా ఉపయోగించే 20 పాస్‌వర్డ్‌ల జాబితాను వెల్లడించింది. అయితే, ఈ పాస్‌వర్డులను హ్యాకర్లు ఛేదించే సమయాన్ని కూడా నివేదిక సూచించింది. 20 పాస్‌వర్డ్‌ల జాబితాలో మీ పాస్‌వర్డ్‌లు ఉంటే.. వెంటనే మార్చుకోవాలని సూచిస్తోంది. అవేంటో ఓసారి లుక్కేయండి..
123456 :
సాధారణంగా ఎక్కువమంది ఈ పాస్‌వర్డ్ వాడుతుంటారు. ఇలాంటి పాస్‌వర్డులను హ్యాకర్లు క్రాక్ చేయడానికి తక్కువ సమయమే పడుతుంది. ఒక సెకను కంటే తక్కువ సమయంలోనే ఈ పాస్‌వర్డ్ క్రాక్ చేయగలరు.
admin :
చాలామంది వినియోగదారులు తమ పాస్‌వర్డ్ ‘అడ్మిన్’ అని పెట్టుకుంటున్నారు. ఇలాంటి పాస్‌వర్డ్ క్రాక్ చేయడానికి హ్యాకర్లకు ఒక సెకను కన్నా తక్కువ సమయమే పడుతుంది. మీ పాస్‌వర్డ్ కూడా ఇదే ఉంటే వెంటనే మార్చుకోండి.
12345678 :
మీ పాస్‌వర్డ్ కూడా ఇదేనా? ఓసారి చెక్ చేసుకోండి. ఈజీగా గుర్తుండేలా ఇలాంటి పాస్‌వర్డ్ వాడుతుంటారు. ఈ పాస్‌వర్డ్‌ను సైబర్ మోసగాళ్లు క్రాక్ చేయడానికి ఒక సెకను కన్నా తక్కువ సమయం పడుతుంది.
12345 :
ఎక్కువ సంఖ్యలో అకౌంట్లు కలిగిన యూజర్లు ఒకే పాస్‌వర్డులను అన్నింటికి వాడుతుంటారు. ఎప్పుడూ కూడా ఇలా చేయొద్దు. ఇలాంటి పాస్‌వర్డులను క్రాక్ చేయడానికి ఒక సెకను కన్నా తక్కువ సమయం పడుతుంది.

most used passwords in India
password :
మరికొంతమంది తమ అకౌంట్లకు పాస్‌వర్డును ‘పాస్‌వర్డ్’ అని వాడుతుంటారు. ఈ తరహా పాస్‌వర్డులను హ్యాకర్లు చాలా ఈజీగా క్రాక్ చేయగలరు. ఒక సెకను కన్నా తక్కువ సమయంలోనే మీ పాస్‌వర్డ్ గుర్తించగలరు. అందుకే మీ పాస్‌వర్డ్ ఎప్పుడూ కూడా ఇలా ఉండకూడదు.
Pass@123 :
మీ అకౌంట్లకు పాస్‌వర్డ్ ఇలానే పెట్టారా? అయితే, వెంటనే మార్చుకోండి.. ఇలాంటి పాస్‌వర్డులను క్రాక్ చేయడానికి హ్యాకర్లకు కేవలం 5 నిమిషాలు మాత్రమే సమయం పడుతుంది.
123456789 :
మీ అకౌంట్లలో వాడే పాస్‌వర్డులలో ఇదే పాస్‌వర్డు ఉందా? అయితే, ఇప్పుడే మార్చుకోండి. ఇలాంటి పాస్‌వర్డును సైబర్ నేరగాళ్లు సెకను కన్నా తక్కువ వ్యవధిలోనే క్రాక్ చేయగలరు.
Admin@123 :
ఈ పాస్‌వర్డును హ్యాకర్లు క్రాక్ చేయడానికి కనీసం ఒక ఏడాది సమయం పట్టవచ్చు. మిగతా పాస్ వర్డులతో పోలిస్తే ఈ పాస్‌వర్డుకు ఎక్కువ సమయం పడుతుంది. అయినా ఈ పాస్‌వర్డు అసలు సేఫ్ కాదని గమనించాలి.
India@123 :
మీరు కూడా ఇదే పాస్‌వర్డ్ వాడుతుంటే వెంటనే మార్చుకోండి. ఈ పాస్‌వర్డ్ క్రాక్ చేయడానికి కేవలం 3 గంటలు సమయం పడుతుంది.
admin@123 :
మీరు కూడా ఇలాంటి పాస్‌వర్డు వాడితే వెంటనే మార్చకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధమైన పాస్‌వర్డ్ క్రాక్ చేయడానికి 34 నిమిషాల సమయం పడుతుంది.
Pass@1234
మీ పాస్‌వర్డ్ క్యాపిటల్ లేదా స్మాల్ లెటర్ ఏదైనా కావచ్చు.. ఈ రకమైన పాస్ట్‌వర్డ్ వాడితే తొందరగా హ్యాకర్లు క్రాక్ చేసే రిస్క్ ఉంది. సాధారణంగా ఇలాంటి పాస్‌వర్డ్ క్రాక్ చేయడానికి 17 నిమిషాలు సమయం పడుతుంది.
1234567890 :
మీరు వాడే పాస్‌వర్డులలో ఇది ఉంటే తక్షణమే మార్చేసుకోండి. మీ పాస్‌వర్డును క్రాక్ చేయడానికి 1 సెకను కంటే తక్కువ సమయమే పడుతుంది.
Abcd@1234 :
ఈ జాబితాలో మీ పాస్‌వర్డు కూడా ఉంటే.. తొందరగా మార్చేసుకోండి. ఏదైనా కొత్త యూనిక్‌గా ఉండే పాస్‌వర్డ్ ఎంచుకోండి. ఈ పాస్‌వర్డ్ క్రాక్ చేయడానికి 17 నిమిషాల సమయం పడుతుంది.
Welcome@123 :
మీరు పాస్‌వర్డ్ ఇదే అయితే వెంటనే మార్చుకోవడం మంచిది. దీన్ని క్రాక్ చేయడానికి 10 నిమిషాల సమయం పడుతుంది.

most used passwords
Abcd@123 :
ఆల్ఫాన్యూమరిక్ పాస్‌వర్డ్ ఏదైనా ఇలా పెడితే హ్యాకర్లకు తొందరగా తెలిసిపోతుంది. ఇలాంటి పాస్‌వర్డులను కేవలం 17 నిమిషాల సమయంలోనే హ్యాకర్లు క్రాక్ చేయగలరని గమనించాలి.
admin123 :
అడ్మిన్ అనే పాస్‌వర్డ్ వాడుతుంటే వెంటనే మార్చుకోవడం చాలా మంచిది. లేదంటే మీ పాస్‌వర్డును సైబర్ నేరగాళ్లు క్రాక్ చేసేందుకు కేవలం 11 సెకన్లు మాత్రమే పడుతుంది.
administrator :
చాలామంది వాడే పాస్‌వర్డులలో ఇదొకటి.. అడ్మినిస్ట్రేటర్ అనే పాస్‌వర్డు మీరు వాడుతుంటే ఇప్పుడే మార్చుకోవడం బెటర్.. లేదంటే దీన్ని క్రాక్ చేయడానికి ఒక సెకను చాలు..
Password@123 :
అకౌంట్ ఏదైనా ఒకటే.. పాస్‌వర్డ్ మాత్రం ఇలా అసలు ఉండకూడదు. మీకు గుర్తుండేలా ఇతరులకు సులభంగా తెలిసేలా ఉండకూడదు. అదే హ్యాకర్లు అయితే దీన్ని క్రాక్ చేయడానికి 2 నిమిషాల సమయం మాత్రమే తీసుకుంటారు.
Password :
మీరు కూడా ఇదే పాస్‌వర్డ్ వాడుతుంటే ఇప్పుడే మార్చేసుకోండి. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండి మిగతావన్నీ నార్మల్ లెటర్స్ వాడినసరే హ్యాకర్లు ఒక సెకను కన్నా తక్కువ సమయంలోనే క్రాక్ చేయగలరు.
UNKNOWN :
మీ అకౌంట్లలో ఏదైనా ఇలాంటి పాస్‌వర్డ్ సెట్ చేసుకుంటే వెంటనే మార్చుకోవడం బెటర్.. ఇలాంటి పాస్‌వర్డ్ క్రాక్ చేయడానికి కేవలం 17 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది.
Read Also : Honor 100 Series Launch : ఈ నెల 23న హానర్ 100 సిరీస్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?