WhatsApp AI chatbot : వాట్సాప్ యూజర్ల కోసం కొత్త ఏఐ చాట్‌బాట్.. ఇదేలా పనిచేస్తుందంటే?

WhatsApp AI chatbot : మెటా ఏఐ చాట్‌బాట్ ఎట్టకేలకు వాట్సాప్‌లోకి వచ్చేసింది. కస్టమర్ సపోర్టు నుంచి అపాయింట్‌మెంట్ షెడ్యూలింగ్ వరకు అనేక రకాల సర్వీసులను అందిస్తోంది.

WhatsApp AI chatbot : వాట్సాప్ యూజర్ల కోసం కొత్త ఏఐ చాట్‌బాట్.. ఇదేలా పనిచేస్తుందంటే?

Meta AI chatbot now available to some WhatsApp users, here is how it works

WhatsApp AI chatbot : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా కంపెనీ ఏఐ మోడల్‌‌పై కొంతకాలంగా పనిచేస్తోంది. ఏఐ రేసులో ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐ వంటి ఏఐ చాట్‌బాట్‌ వంటి కొత్త ఫీచర్‌లను ప్రవేశపెట్టాయి. టెక్ దిగ్గజాలకు పోటీగా మెటా కూడా ఏఐతో కూడిన సర్వీసులను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌కు ఇంటిగ్రేట్ చేసింది. అంతేకాదు.. ఇతర సర్వీసులతో సహా పలు ప్రొడక్టుల్లో ఏఐ టెక్నాలజీని ఉపయోగించాలని మెటా నిర్ణయించుకుంది. అందులో ప్రధానంగా వాట్సాప్‌లోనూ ఏఐ అసిస్టెంట్ ఫీచర్ తీసుకొచ్చింది.

ఆండ్రాయిడ్ బీటాలో ఏఐ చాట్ బటన్ :

మెటా కనెక్ట్ (Meta Connect 2023) ఈవెంట్ సందర్భంగా, మెటా వాట్సాప్‌లో ఏఐ చాట్‌బాట్‌ ఫీచర్ యాడ్ చేయనన్నట్టు ప్రకటించింది. ఏఐ చాట్‌బాట్ ఫీచర్ యునైటెడ్ స్టేట్స్‌లో పరిమిత సంఖ్యలో వాట్సాప్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇప్పుడు, (WABetaInfo) నివేదిక ప్రకారం.. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం లేటెస్ట్ వాట్సాప్ బీటా కొత్త షార్ట్‌కట్ బటన్‌ను కూడా కలిగి ఉంది. వినియోగదారులు వారి సంభాషణ జాబితా ద్వారా సెర్చ్ చేయకుండానే ఏఐ చాట్‌బాట్‌ను త్వరగా యాక్సెస్ చేసేందుకు అనుమతిస్తుంది.

Read Also : WhatsApp Voice Chat : వాట్సాప్‌లో గ్రూపు కాల్స్ కోసం వాయిస్ చాట్ ఫీచర్.. ఇదేలా పనిచేస్తుందంటే?

నివేదిక ప్రకారం.. కొత్త ఏఐ చాట్‌బాట్ బటన్ వాట్సాప్ ‘చాట్స్’ సెక్షన్‌లో ఉంది. ‘న్యూ చాట్’ బటన్‌పై కనిపిస్తుంది. ఈ కొత్త ఫీచర్ సాయంతో వాట్సాప్ యూజర్లు ఏఐ చాట్‌బాట్‌ను యాక్సెస్ చేయొచ్చు. తమకు అవసరమైన సహాయాన్ని పొందవచ్చు. ఏఐ చాట్‌బాట్ వాట్సాప్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదు. కస్టమర్ సపోర్టును అందించడంతో పాటు అపాయింట్‌మెంట్‌లను షెడ్యూల్ చేయడం లేదా రిజర్వేషన్‌లు చేయడం వంటి పనులలో యూజర్లకు మరింత సాయంగా పనిచేస్తుంది.

వాట్సాప్ ఏఐ అసిస్టెంట్ ఆవిష్కరించిన జుకర్‌బర్గ్ :
మెటా కనెక్ట్ ఈవెంట్ సందర్భంగా.. కంపెనీ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మెటా లేటెస్ట్ ఏఐ చాట్‌బాట్‌ను ఆవిష్కరించారు. ఈ ఫీచర్ లేటెస్ట్ లాంగ్వేజీ మోడల్ రీసెర్చ్, శక్తివంతమైన లామా 2 మోడల్‌ను ప్రభావితం చేస్తుంది. ఈ చాట్‌బాట్ సాయంతో ట్రావెల్ ట్రిప్‌లను ప్లాన్ చేసుకోవచ్చు లేదా సిఫార్సులను చేయొచ్చు.. జోకులు, గ్రూపు చాట్ డిబేట్‌లు, చాట్ జీపీటీ, బార్డ్ లేదా బింగ్ వంటి సమాచారాన్ని అందించడం వంటి వివిధ పనులను చేసేందుకు వీలుగా రూపొందించింది.

Meta AI chatbot now available to some WhatsApp users, here is how it works

Meta AI chatbot WhatsApp users

మైక్రోసాఫ్ట్ బింగ్ చాట్‌తో సహకరించినట్లు మెటా పేర్కొంది. రియల్ టైమ్ వెబ్ సెర్చ్ అందించడానికి చాట్‌బాట్ సామర్థ్యాలను అందిస్తుంది. మిడ్‌జర్నీ, బింగ్ ఇమేజ్ క్రియేటర్ వంటి టెక్స్ట్-టు-ఇమేజ్ జనరేటర్‌ల మాదిరిగానే మెటా ఏఐ అసిస్టెంట్ కూడా సాధారణ /ఇమాజిన్’ కమాండ్స్ ఉపయోగించి మొదటి నుంచి వాస్తవికంగా కనిపించే ఏఐ ఫొటోలను రూపొందించడానికి యూజర్లను అనుమతిస్తుంది. ఇవన్నీ యూజర్లు ఉచితంగా పొందవచ్చు.

వాట్సాప్‌లో స్టేటస్ అప్‌డేట్ ఫిల్టర్ ఫీచర్లు :

ఇంతలో, వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను కూడా ప్రవేశపెడుతోంది. యూజర్ల వర్టికల్ లిస్టులో ఫిల్టర్ చేయడం స్టేటస్ అప్‌డేట్స్ చూసేందుకు అనుమతిస్తుంది. ఏ ఛానెల్‌లను ఫాలో చేయని యూజర్ల కోసం మ్యూట్ చేసిన స్టేటస్ అప్‌డేట్స్ యాక్సస్ చేసుకోనే వీలుంటుంది. త్రి-డాట్ మెను ద్వారా ప్రత్యేక విభాగానికి నావిగేట్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఈ ఫీచర్ లేటెస్ట్ వెర్షన్ 2.23.24.11ని ఇన్‌స్టాల్ చేసిన ఆండ్రాయిడ్ బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది.

కొంతమంది బీటా టెస్టర్‌లు వారి స్టేటస్ అప్‌డేట్స్ వర్టికల్ లిస్టును చూసేందుకు కొత్త ‘All See’ బటన్‌ను కూడా యాక్సస్ చేయొచ్చు. ఈ సెక్షన్‌లో కొంతమంది బీటా టెస్టర్లు తమ స్టేటస్ అప్‌డేట్స్ క్రమపద్ధతిలో వర్గీకరించడంలో సాయపడే నాలుగు ఫిల్టర్‌లకు యాక్సెస్‌ను పొందవచ్చు. ఈ ఫిల్టర్‌లతో యూజర్లు తమ కాంటాక్టుల నుంచి అన్ని స్టేటస్ అప్‌డేట్‌లను పొందవచ్చు. వినియోగదారులకు వారి కాంటాక్టులకు షేర్ చేసిన ప్రతి ఒక్క అప్‌డేట్‌ను కూడా మిస్ కాకుండా చూసుకోవచ్చు.

Read Also : WhatsApp Channels : వాట్సాప్ ఛానల్ అడ్మిన్ల కోసం కొత్త బీటా అప్‌డేట్.. ఈజీగా స్టిక్కర్లను షేర్ చేసుకోవచ్చు..!