Most Expensive Cities : 2023 ఏడాదిలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలు ఏంటో తెలుసా?

Most Expensive Cities : 2023 ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన నగరాలకు సంబంధించి జాబితాను ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈయూ) నివేదిక రివీల్ చేసింది. ఇందులో ఏయే నగరాలు టాప్ లిస్టులో ఉన్నాయో ఓసారి చూద్దాం..

Most Expensive Cities : 2023 ఏడాదిలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలు ఏంటో తెలుసా?

These 2 Cities Are Most Expensive In The World This Year

Most Expensive Cities : ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన నగరాల జాబితాను ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈయూ) నివేదిక వెల్లడించింది. 2023 సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలుగా సింగపూర్, జ్యూరిచ్‌ నిలిచాయి. ఆ తర్వాతి స్థానాల్లో జెనీవా, న్యూయార్క్, హాంకాంగ్‌లు ఉన్నాయి. ప్రపంచ జీవన వ్యయ సంక్షోభం ఇంకా ముగియలేదని ఈయూ హెచ్చరించింది. నివేదిక ప్రకారం.. జెనీవా, న్యూయార్క్ మూడో స్థానంలో నిలవగా, హాంకాంగ్ ఐదో స్థానంలో నిలిచింది. చివరిగా లాస్ ఏంజెల్స్ ఆరో స్థానంలో నిలిచింది.

Read Also : IndiGo ChatGPT AI : ఇండిగో నుంచి కొత్త ఏఐ చాట్‌జీపీటీ.. పది భాషల్లో మాట్లాడగలదు.. ఈజీగా టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు!

గత సంవత్సరంలో సింగపూర్ సహా మొదటి స్థానంలో నిలిచిన న్యూయార్క్ నగరం మూడో స్థానానికి దిగజారింది. ఆరవ స్థానంలో ఉన్న జూరిచ్ నగరం తాజాగా మొదటి స్థానంలోకి ఎగబాకింది. సగటున, 200 కన్నా ఎక్కువగా సాధారణంగా ఉపయోగించే నిత్యావసర వస్తువులు, ఇతర సేవలతో స్థానిక కరెన్సీ పరంగా సంవత్సరానికి 7.4శాతం మేర ధరలు పెరిగాయి. గత ఏడాదిలో రికార్డు 8.1శాతం పెరుగదల నుంచి భారీగా తగ్గింది. కానీ, ఇప్పటికీ 2017-2021లో ట్రెండ్ కన్నా గణనీయంగా ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది.

11 ఏళ్లలో 9వసారి సింగపూర్ అగ్రస్థానంలోకి :
అనేక వర్గాలలో అధిక ధరల స్థాయిల కారణంగా సింగపూర్ గత పదకొండు సంవత్సరాల్లో 9వసారి ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని తిరిగి పొందింది. కార్ నంబర్‌లపై కఠినమైన ప్రభుత్వ నియంత్రణల కారణంగా ఈ నగరం ప్రపంచంలోనే అత్యధిక రవాణా ధరలను కలిగి ఉంది.

These 2 Cities Are Most Expensive In The World This Year

Most Expensive Cities In The World  

ఇందులో దుస్తులు, కిరాణా, మద్యంతో అత్యంత ఖరీదైన వాటిలో ఒకటిగా చెప్పవచ్చు. జ్యూరిచ్ నగరం కూడా స్విస్ ఫ్రాంక్, కిరాణా, గృహోపకరణాలు, వినోదం వంటి అధిక ధరలను కలిగి ఉందని నివేదిక తెలిపింది. జెనీవా, న్యూయార్క్‌లు మూడో స్థానంలో ఉండగా, హాంకాంగ్ ఐదో స్థానంలో, లాస్ ఏంజెల్స్ ఆరో స్థానంలో నిలిచాయి.

దిగజారిన స్థానాల్లో చైనాకు చెందిన నాలుగు నగరాలు : 

ఇతర ప్రాంతాలతో పోలిస్తే.. ఆసియా సగటున తక్కువ ధరల పెరుగుదలను కొనసాగిస్తోంది. జపాన్‌లోని ఒసాకా, టోక్యోతో పాటుగా ఈ ఏడాదిలో ర్యాంకింగ్స్‌ తగ్గిన అతిపెద్ద నగరాల్లో చైనాకు చెందిన నాన్జింగ్, వుక్సీ, డాలియన్, బీజింగ్ నాలుగు నగరాల ర్యాంకు భారీగా పడిపోయాయి. రష్యాలో మాస్కో నగరం, సెయింట్ పీటర్స్‌బర్గ్‌ నగర స్థానాలు కూడా దిగజారాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 173 నగరాల్లో ఈయూ ఈ సర్వేను నిర్వహించింది. అయితే, ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధానికి ముందుగానే ఈ సర్వేను నిర్వహించినట్టు ఈఐయూ వెల్లడించింది.

Read Also : United States : 2 గంటలపాటు 20 టన్నుల చెత్తలో వెతుకులాట..దేనికోసమో తెలుసా?