United States : 2 గంటలపాటు 20 టన్నుల చెత్తలో వెతుకులాట..దేనికోసమో తెలుసా?

న్యూ హ్యాంప్ షైర్ లో శానిటరీ కార్మికులు 2 గంటలపాటు 20 టన్నుల చెత్తను తవ్వడం మొదలుపెట్టారు. ఇంతకీ వారి వెతుకులాట దేనికోసం.. అంటే..

United States : 2 గంటలపాటు 20 టన్నుల చెత్తలో వెతుకులాట..దేనికోసమో తెలుసా?

United States

United States : 2 గంటలపాటు 20 టన్నుల చెత్తలో శానిటరీ వర్కర్లు వెతుకులాట మొదలుపెట్టారు. ఇంతకీ దేనికోసం వెతికారు? వాళ్లు వెతుకుతున్నది దొరికిందా.. చదవండి.

New Hampshire : అమెరికాలో మరోసారి గర్జించిన తుపాకులు .. న్యూహాంప్‌షైర్‌ ఆస్పత్రి వద్ద కాల్పులు

న్యూ హ్యాంప్‌షైర్‌కి చెందిన ఓ మహిళ తన పెళ్లినాటి డైమండ్ ఉంగరాన్ని పొరపాటున డస్ట్‌బిన్‌లో పడేసింది. అది కాస్తా చెత్తతో బయటకు వెళ్లిపోయింది.  తన డైమండ్ ఉంగరం పోయిన విషయాన్ని గుర్తించిన ఆమె వెంటనే విండ్‌హామ్ జనరల్ సర్వీసెస్ డైరెక్టర్ సెనిబాల్డికి ఫోన్ చేసి విషయాన్ని చెప్పింది. అది వెతికి పెట్టమని సాయం కోరింది.  తన భర్త ఏ సమయంలో చెత్తను విసిరాడు.. ఆ బ్యాగ్ డీటెయిల్స్ ఇచ్చింది. ఇక శానిటరీ వర్కర్లు సుమారు 20 టన్నుల చెత్తను జల్లెడ పట్టడం మొదలుపెట్టారు. 12 అడుగుల చెత్త సంచుల్ని తవ్విన తర్వాత ఆ మహిళ పోగొట్టుకున్న డైమండ్ రింగ్ దొరికింది.

Bengaluru : చెత్తకుప్పలో బయటపడ్డ అమెరికా డాలర్ల నోట్ల కట్టలు .. తీసుకెళ్లి యజమానికి అప్పగించిన వ్యక్తి

వెంటనే ఆ ఉంగరాన్ని ఆ మహిళను పిలిచి తిరిగి ఇచ్చారు. సెంటిమెంట్‌గా భావించిన తన ఉంగరం దొరకడంతో ఆ మహిళ సంబరపడిపోయిందని సెండి బాల్డి చెప్పారు. ఇక ఇలాంటి ఆభరణాలు పోగొట్టుకుని ఫోన్లు చేసేవారు తమకు కొత్తకాదని ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయని సెండి బాల్డి పేర్కొన్నారు. బంగారం, డబ్బు, ఖరీదైన సెల్ ఫోన్లు పోగొట్టుకుంటే తిరిగి దొరకడం కష్టమే. అలాంటిది ఆ మహిళ పోగొట్టుకున్న డైమండ్ ఉంగరాన్ని తిరిగి ఆమెకు అందించడంలో న్యూ హ్యాంప్‌షైర్ శానిటరి కార్మికులు చేసిన సాయం నిజంగా అభినందనీయమని చెప్పాలి.