New Hampshire : అమెరికాలో మరోసారి గర్జించిన తుపాకులు .. న్యూహాంప్‌షైర్‌ ఆస్పత్రి వద్ద కాల్పులు

అమెరికాలో మరోసారి తుపాకీ గర్జించింది. న్యూహాంప్‌షైర్ లోని ఓ హాస్పిటల్ వద్ద ఓ దుండుగుడు కాల్పులకు తెగబడ్డాడు.

New Hampshire : అమెరికాలో మరోసారి గర్జించిన తుపాకులు .. న్యూహాంప్‌షైర్‌ ఆస్పత్రి వద్ద కాల్పులు

New Hampshire hospital

Updated On : November 18, 2023 / 11:03 AM IST

US New Hampshire : అమెరికాలో మరోసారి తుపాకీ గర్జించింది. అమెరికాలోని న్యూహాంప్‌షైర్ లోని ఓ హాస్పిటల్ వద్ద దుండుగులు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. శుక్రవారం మధ్యాహ్నాం 3.30గంటల సమయంలో కాంకర్డ్‌ నగరంలోని సైకియాట్రిక్ ఫెసిలిటీ ‘న్యూహాంప్‌షైర్ హాస్పిటల్’ వద్ద గుర్తుతెలియని ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఒకరు వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

కాల్పుల ఘటనపై సమచారం అందుకున్న పోలీసులు వెంటనే అలెర్ట్ అయ్యారు. హాస్పిటల్ లాబీలో దుండగుడు దాక్కున్నాడని తెలుసుకుని ఆ దిశగా కాల్పులు జరపగా పోలీసుల కాల్పుల్లో సదరు దుండగుడు హతమయ్యాడు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. తాము జరిపిన కాల్పుల్లో దుండగుడు చనిపోయాడని వెల్లడించారు.

దీనిపై పోలీసు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతు..ప్రస్తుతం పరిస్థితి సాధారంగానే ఉందని ఎవ్వరు ఎటువంటి ఆందోళన చెందవద్దని సూచించారు. కాగా పోలీసుల కాల్పుల్లో చనిపోయిన సదరు దుండగుడు ఎవరు అనేది వివరించలేదు.

యెమెన్‌లో కేరళ నర్సుకు మరణశిక్ష .. బాధితురాలి అప్పీల్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

సైకియాట్రిక్ ఫెసిలిటీ ‘న్యూహాంప్‌షైర్ హాస్పిటల్’కు వచ్చేవారంతా మెటల్ డిటెక్టర్ల ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. దీంతో అక్కడ కచ్చితంగా ఓ పోలీసు డ్యూటీలో ఉంటారు. ఈక్రమంలో దుండుగుడు కాల్పులు జరుపగా వెంటనే అలెర్ట్ అయిన పోలీసు ఎదురు కాల్పులు జరిపి పోలీసు సిబ్బందికి సమాచారం అందించటం..వారు వెంటనే రావటంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ ఘటన గురించి న్యూ హాంప్‌షైర్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ కమిషనర్ లోరీ వీవర్ మాట్లాడుతూ, ఆస్పత్రిలో రోగులు, సిబ్బంది అందరు సురక్షితంగానే ఉన్నారని తెలిపారు.