kerala Nurse Nimisha Priya : యెమెన్‌లో కేరళ నర్సుకు మరణశిక్ష .. బాధితురాలి అప్పీల్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

కేరళకు చెందిన నర్సుకు యెమెన్ సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. ఉపాధి కోసం యెమన్ వెళ్లి అక్కడే క్లినిక్ ఏర్పాటు చేసుకున్న కేరళకు చెందిన నిమిష ప్రియ అనే నర్సుకు యెమన్ కోర్టు మరణశిక్ష విధించింది

kerala Nurse Nimisha Priya : యెమెన్‌లో కేరళ నర్సుకు మరణశిక్ష .. బాధితురాలి అప్పీల్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

kerala Nurse Nimisha Priya..yemen supreme court

kerala Nurse Nimisha Priya..yemen supreme court : కేరళకు చెందిన నర్సుకు యెమెన్ సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. ఉపాధి కోసం యెమన్ వెళ్లి అక్కడే క్లినిక్ ఏర్పాటు చేసుకున్న కేరళకు చెందిన నిమిష ప్రియ అనే నర్సుకు యెమన్ కోర్టు మరణశిక్ష విధించింది. నిమిషప్రియ ఇచ్చిన మత్తు ఇంజెక్షన్ వల్ల యెమన్ పౌరుడు మృతి చెందటంతో ఈ శిక్షను విధించింది. ఈ తీర్పుపై నిమిష ప్రియ అప్పీల్ ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది.

కాగా..కేరళలోని పాలక్కడ్ కు చెందిన నిమిష ప్రియ ఉపాధి కోసం యోమెన్ వెళ్లింది. అక్కడే కుటుంబంతో కలిసి నివసిస్తోంది. 2014లో ఆమె భర్తా, పిల్లలు భారత్ కు తిరిగి వచ్చేశారు. ఆమె మాత్రం అక్కడే ఉండిపోయింది. 2015లో ఆమె స్థానికంగా ఉండే యెమన్ జాతీయుడైన తలాల్ అబ్డో మహ్దీ అనే ఓ వ్యక్తి సహాయంతో ఓ క్లినిక్ ప్రారంభించింది. దీనికి కారణం విదేశీయులు యెమెన్ లో ఏదైనా సంస్థ నిర్వహించుకోవాలంటే ఆదేశ పౌరుల భాగస్వామ్యం తప్పనిసరి. దీంతో ఆమె స్థానికంగా ఉండే మహ్దీ అనే వ్యక్తి సహాయంతో క్లినిక్ ఏర్పాటు చేసుకుంది. అలా ఆమె క్లినిక్ బాగానే నడిచేది.

ఈక్రమంలో నిమిష ప్రియ, మహ్దీ మధ్య అభిప్రాయబేధాలొచ్చాయి. అవికాస్తా గొడవలకు దారి తీశాయి. మహ్దీ నిమిష ప్రియను వేధించటం మొదలుపెట్టాడు. ఇబ్బందులకు గురి చేసేవాడు. ఆమె పాస్ పోర్టు తీసేసుకున్నాడు. అతనుంచి వేధింపులు ఎక్కువయ్యేసరికి ఆమె సహనం నశించింది. తన పాస్ పోర్టు దక్కించుకుని అక్కడి నుంచి పారిపోయేందుకు మహ్దీకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. ఆ మందు మోతాదు మించడంతో మహ్దీ చనిపోయాడు.

సితార్ వాయించిన ఆ దేశ ఉప ప్రధానిపై నరేంద్ర మోదీ ప్రశంసలు

దీంతో భయపడిపోయిన ఆమె మరో వ్యక్తితో కలిసి మహ్దీ మృతదేహాన్ని రహస్యంగా తరలించింది. కానీ కొన్ని రోజులకే ఆమె చేసింది బయటపడింది.ఆమెను, ఆమెకు సహకరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ జరిపిన ట్రయల్ కోర్టు నిమిషప్రియకు మరణశిక్ష విధించింది. ఈ తీర్పును నిమిష ప్రియ యెమెన్ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా..ఆమె పిటిషన్ ను కొట్టివేసింది.

నిమిష ప్రియకు మరణశిక్ష పడడంతో భారత్ లో ఉన్న ఆమె తల్లి మేరీ ఆందోళన వ్యక్తం చేస్తు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. యెమెన్ లో పరిస్థితుల రీత్యా భారత్ ఆ దేశానికి రాకపోకలను నిలిపివేసింది. దీంతో నిమిష ప్రియ తల్లి యెమన్ వెళ్లలేకపోయింది. యెమన్ వెళ్లేందుకు ఆమె అనుమతి ఇవ్వాలని కోరుతు ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. నిమిష ప్రియ అప్పీల్ ను సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయాన్ని కేంద్రం తరఫు న్యాయవాది ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. నిమిష ప్రియ తల్లిని యెమెన్ పంపే విషయం సాధ్యమవుతుందా..? లేదా..? అనే విషయాలపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి సూచించింది.

రెండు గర్భాశయాలతో జన్మించిన మహిళకు ఒకే సమయంలో రెండింటిలోను గర్భం

దీనిపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్చి స్పందిస్తు..ఈ అంశాన్ని భారత కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని..దౌత్య పరమైన సాయం తీసుకుంటామని వెల్లడించారు.

కాగా..ప్రియ విడుదల కోసం వాదిస్తున్న ‘సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్’ అనే బృందం 2022లో హైకోర్టును ఆశ్రయించింది. నిమిషా ప్రియను రక్షించేందుకు బాధితురాలి కుటుంబంతో దౌత్యపరమైన జోక్యాలు, దానికి సంబంధించి చర్చలు జరిపేందుకు వీలు కల్పించాలని కేంద్రాన్ని కోరింది.