Kelsey Hatcher : రెండు గర్భాశయాలతో జన్మించిన మహిళకు ఒకే సమయంలో రెండింటిలోను గర్భం
రెండు గర్భాశయాలతో జన్మించిన మహిళకు ఒకే సమయంలో రెండింటిలోను గర్భం దాల్చింది. రెండు గర్భాశయాలతో జన్మించటమే వింత అనుకుంటే ఒకేసారి రెండు గర్భాలు ధరించటం మరో వింత అంటున్నారు డాక్టర్లు.

two uterus Woman Kelsey Hatcher two uterus pregnant : కవలలు పుడితేనే ఓ అద్భుతంగా భావించే రోజులు పోయాయి..ఒకే కాన్పులో ఏకంగా నలుగురు..ఐదుగురే కాదు ఏకంగా తొమ్మిదిమంది పిల్లలు పుట్టారనే వింత గురించి విని షాక్ అయ్యాం. అంతేకాదు ఓ మహిళ ఏకంగా రెండు గర్బాశయాలతో జన్మించింది అనే వింత కూడా విని ఆశ్చర్యపోయాం. ఆమే ఓ వింత అనుకుంటే ఆమె విషయంలో మరో వింత జరిగింది. రెండు గర్భాశయాలతో జన్మించిన ఆమె ఏకంగా ఒకేసారి రెండు గర్భాశయాల్లోను గర్భం దాల్చి మరో షాకుకు గురి చేసింది. ఇటువంటి ఘటన చాలా చాలా అరుదు అని మిలియన్లలో ఈమె ఒకే ఒక్కరు అంటూ డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు.
దక్షిణ అమెరికాలోని అలాబామాకు చెందిన కెల్సీ హాట్చర్ అనే మహిళ రెండు గర్భాశయాలతో జన్మించింది. ఆమె పుట్టినప్పుడే ఓ మిరాకిల్ గా భావించారు వైద్య నిపుణులు. ఆమెకు ఇప్పుడు 32 ఏళ్లు. ఇప్పటికే కెల్సీకి ముగ్గురు పిల్లలున్నారు. ఇప్పుడు మరోసారి గర్భం దాల్చింది. అది వింత కాదు. కానీ ఈసారి మాత్రం ఆమె ఒకే సమయంలో రెండు గర్భాశయాల్లోను ఒకేసారి గర్భం దాల్చింది.
350 ఏళ్లుగా దోపిడీకి గురవుతున్న ఆ దేవుడి ప్రసాదం .. దీని వెనుక ఆసక్తికర కారణం..
రెండు గర్భాశయాల్లో దేనికది వేరుగా పిండాన్ని అభివృద్ధి చేయటంతో ఇదొక అరుదైన కేసుగా భావిస్తున్న నిపుణులు ఆమెను అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. ఇలాంటి అరుదైన గర్భం విషయంలో ఎంతో అనుభవం ఉన్న ఆ డాక్టర్లు సైతం ఆ ఇద్దరు ఉంటే కవలలు అని అంటాం. మరీ ఇలా ఉంటే ఏమానాలి? కవలలే అని అనాలా? లేక కొత్త పదం ఏదైనా కనిపెట్టాలా? అని తికమకపడుతున్నారు.
కెల్సీ హాట్చర్ కేసు అత్యంత అరుదైనది అని అందుకే తనను అత్యంత జాగ్రత్తగా చూసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతానికి ఆమె రెండు గర్భాల్లోను శిశువులు ఆరోగ్యంగానే ఉన్నారని..తెలిపారు. కానీ రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు.
కెల్సీకి ఇప్పటికే రెండు, నాలుగు, ఏడేళ్ల వయస్సున్న ముగ్గురు పిల్లలున్నారు. ఈక్రమంలో ఆమె మరోసారి గర్బాలు దాల్చింది. ప్రస్తుతం ఆమె గర్భాల వయస్సు 34 వారాలు. కెల్సీ, ఆమె భర్త కాలేబ్ మాత్రం తమ పిల్లల కోసం ఆశగా ఎదురు చూస్తున్నామని తెలిపారు.