Rajasthan : 350 ఏళ్లుగా దోపిడీకి గురవుతున్న ఆ దేవుడి ప్రసాదం .. దీని వెనుక ఆసక్తికర కారణం..

ప్రఖ్యాతిగాంచిన ఈ దేవాలయంలో దేవుడి ప్రసాదం 350 ఏళ్లుగా దోపిడీకి గురవుతోంది. కానీ దోపిడీ చేసేవారిని ఎవ్వరు అడ్డుకోరు.. దీని వెనుక ఎంత కథ ఉందో తెలుసా..?

Rajasthan : 350 ఏళ్లుగా దోపిడీకి గురవుతున్న ఆ దేవుడి ప్రసాదం .. దీని వెనుక ఆసక్తికర కారణం..

Rajasthan Shrinathji temple Annakoot festival

Shrinathji Temple Annakoot Festival : భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఎన్నో ఆలయాలున్నాయి. కొన్ని ఆలయాల్లో ఆచారాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అటువంటి ఓ ఆచారం గురించి వింటే చాలా ఆశ్చర్యం కలుగుతంది. రాజస్థాన్ లోని రాజసమంద్ లో ఉన్న ఓ ఆలయంలో 350గా కొనసాగుతున్న ఆచారం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ ఆలయంలో ప్రసాదాన్ని లూటీ చేయటమే ఆ వింత ఆచారం. ఈ ఆలయంలో దేవుడికి సమర్పించే అన్నకూట్ గా పిలిచే ఈ ప్రసాదాన్ని గిరిజనులు లూటీ చేయటం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఆచారం 350ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ అన్నకూట్ ను లూటీ చేయటానికి దేశం నలుమూలల నుంచి భక్తులు ఈ ఆలయానికి చేరుకుంటారు.

ఉత్సవాలు,బ్రహ్మోత్సవాలు, జాతరలు, సంబరాలు ఇలా ఏదేవుడికైనా ఏ దేవతకైనా ప్రసాదాలు నైవేద్యంగా పెట్టాక దాన్ని భక్తులకు పంచటం ఎక్కడైనా జరుగుతుంటుంది. కానీ రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్‌లో ఉన్న శ్రీనాథ్‌జీ ఆలయంలో జరిగే అన్నకూట్‌ పండుగలో 350 ఏళ్లుగా ప్రసాదాన్ని లూటీ చేయటం ఆచారంగా వస్తోంది. శ్రీనాథ్ జీకి భక్తులు ప్రసాదాలు పెట్టడం.. గిరిజనులు గుంపులు గుంపులుగా వచ్చి లూటీ చేయటం జరుగుతుంటుంది.

Diwali 2023 : దీపావళి రోజు చేపల కూర నైవేద్యంగా పెట్టే వింత ఆచారం

ప్రసాదాన్ని లూటీ చేసే ఈ పండుగను రాజ్‌సమంద్‌ ప్రజలు దీపావళి తరవాత రోజు ఘనంగా నిర్వహించుకుంటారు. శ్రీనాథ్‌జీ, విఠల్‌నాథ్‌జీ, లాలన్‌కు భక్తులు వివిధ రకాల నైవేద్యాలను పెడతారు. ఆ ప్రసాదాలను రాత్రి 11 గంటల సమయంలో గిరిజనులు వచ్చి దోచుకుంటారు. ఈ నైవేద్యాలను లూటీ చసి పట్టుకెళితే వారికి సమస్త రోగాలు నయమవుతాయని గిరిజనులు నమ్ముతారు. అందుకే ఇలా తండోప తండాలుగా వచ్చి ప్రసాదాలను ఎవరికి అందింది వారు దోచుకుపోతుంటారు. ఈ లూటీని ఎవ్వరు అడ్డుకోరు.

కాగా ఏడాది అన్నకూట్ అన్నకూట ఉత్సవాల్లో ప్రభు శ్రీనాథ్‌జీ, విఠల్‌నాథ్‌జీ, లాలన్‌లకు 56 రకాల నైవేద్యాలు సమర్పించగా..గిరిజనలు భారీ సంఖ్యలో గుంపులుగా వచ్చి దేవుడికి సమర్పించిన ప్రసాదాలను దోచుకెళ్లారు. రాత్రి పదకొండు గంటలకు ప్రసాదం కొల్లగొట్టే సంప్రదాయం ఉండగా ఆ సమయంలో వచ్చి ప్రసాదాలను దోచుకెళ్లారు. ప్రసాదంతో పాటు ప్రసాదం బియ్యాన్ని నాథనగర్ ప్రాంతానికి చెందిన స్థానికులు దోచుకున్నారు.

ఈ లూటీలో దోచుకున్న బియ్యాన్ని ఇంటిలో ఉంచుకుంటారు. వాటిని ఔషధంగా ఉపయోగించుకుంటుంటారు. ఆలయంలో కొల్లగొట్టిన ప్రసాదాన్ని ఇంట్లో ఉంచితే ఎలాంటి ప్రమాదం జరగదని గిరిజనులు నమ్ముతారు. అందుకే ఈ దోపిడీలు చేస్తుంటారు. అలాగే ప్రసాదం సేవించిన తర్వాత ఇంట్లో ఎవరికీ రోగాలు రావని ధీమాగా ఉంటారు. ఈ ప్రసాదాల వల్ల తమ ఇళ్లల్లో ఆనందంగా కలుగుతుందని ఆదివాసీలు నమ్ముతారు.

అన్నకూట సంప్రదాయం – నాలుగు వర్ణాల ప్రజలకు ప్రసాదం అందే వరకు శ్రీజీ అన్నకూట్ మహోత్సవం పూర్తికాదని ఆలయ పూజారి విశాల్ బావ తెలిపారు. చాలా ఏళ్లుగా గిరిజనులు ఆలయం నుంచి ప్రసాదం లూటీ చేసి తీసుకెళతారని అది భగవంతుడిపై ఉన్న నమ్మకమన్నారు. ఈ ప్రసాదం దోపిడీలో స్థానిక ప్రజలు, గిరిజన సంఘం పురుషులు, మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు.

Karthika Masam 2023 : కార్తీక మాసంలో ఉసిరి దీపం .. నవగ్రహ దోషాల హరణం

ఈ ఏడాది కూడా అలాగే జరిగింది. దీని కోసం రాత్రి 9 గంటలకు ఆలయ తలుపులు దర్శనం కోసం తెరిచి ఉంచగా.. అన్నకూటాన్ని కొల్లగొట్టే సంప్రదాయాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. విదేశాల నుంచి వచ్చిన భక్తులు కూడా దీంట్లో చేరటం మరో విశేషమని ఆలయ పూజారి తెలిపారు.

కాగా..శ్రీనాథ్‌జీ ఆలయంలోని శ్రీకృష్ణుడి విగ్రహం స్వయంభూగా వెలిసింది. పురాణాల ప్రకారం, గోవర్ధన్ పర్వతం నుండి శ్రీకృష్ణుడి విగ్రహం కనిపించిందని చెబుతారు. శ్రీనాథ్‌జీని మొదట మధుర సమీపంలోని గోవర్ధన్ పర్వతం వద్ద పూజించగా..మొఘల్ దండయాత్ర నుండి రక్షించడానికి శ్రీనాథ్‌జీ విగ్రహాన్ని కొంతకాలం దాచి ఉంచారని ఆ తరువాత ఈ విగ్రహాన్ని వెలుగులోకి తీసుకొచ్చారట..