High Court : వీధి కుక్కలు కాటేస్తే, ఒక్కో పంటి గాటుకు రూ.10వేలు పరిహారం ఇవ్వాల్సిందే : హైకోర్టు ఆదేశం

వీధి కుక్కలు కాటేస్తే, ఒక్కో పంటి గాటుకు రూ.10వేలు పరిహారం ప్రభుత్వం ఇవ్వాల్సిందే అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

High Court : వీధి కుక్కలు కాటేస్తే, ఒక్కో పంటి గాటుకు రూ.10వేలు పరిహారం ఇవ్వాల్సిందే :  హైకోర్టు ఆదేశం

Punjab..haryana High Court

Punjab..haryana High Court stray dogs : వీధికుక్కలను చూస్తే ఎంతటివాళ్లైన బాబోయ్ అనాల్సిందే. వీధికుక్కేలే కదాని అనుకోవటానికి వీల్లేదు.వాటికి తిక్కరేగితే కాట్లతో పీకి పాకం పెడుతుంది. వీధి కుక్కల దాడులు అనేది దాదాపు ప్రతీ నగరంలోనే పెద్ద సమస్యగా మారింది. హైదరాబాద్ నగరంలో వీధికుక్కల దాడుల్లో చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు జరిగాయి. ఇలా వీధికుక్కల దాడుల సమస్యలు దాదాపు ప్రతీ నగరంలోను ఉన్నాయి. కానీ వీటికి శాశ్వత పరిష్కారాలు మాత్రం కనిపించటంలేదు.

ఇదిలా ఉంటే వీధికుక్కల దాడులకు సంబంధించి పంజాబ్, హర్యానా రాష్ట్రాల హైకోర్టు ఆసక్తికర తీర్పు వెలువరించింది. మనుషులపై వీధి కుక్కలు దాడి చేస్తే..ఒక్కో పంటి గాటుకు రూ.10వేలు నష్టపరిహారం చెల్లించాలంటూ సంచలన తీర్పునిచ్చింది. కుక్కల దాడిలో బాధితులకు 0.2 సెం.మీ మేర మాంసం పోయిన గాయానికైతే కనిష్టంగా రూ.20వేలు అందించాలని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలను ఆదేశాలు జారీ చేసింది.

Lion Between Houses : నగరవాసులకు హెచ్చరిక,సర్కస్ నుంచి తప్పించుకున్న సింహం మీ ఇళ్లముందే తిరుగుతోంది ..

పంజాబ్,హర్యానా, చండీగఢ్ లలో వీధికుక్కలు, ఇతర జంతువుల దాడులకు సంబంధించి మొత్తం 193 పిటిషన్లు హైకోర్టులో దాఖలు కాగా వాటన్నింటిపై ఒకేసారి విచారణ చేపట్టిన హైకోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కలతో పాటు ఇతర జంతువుల దాడుల్లో ప్రజలకు హాని జరిగితే ఈ దాడుల్లో నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది. అంతేకాదు దీని కోసం ఓ ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని జస్టిస్ వినోద్ ఎస్. భరద్వాజ్ లతో కూడిన ధర్మాసనం పంజాబ్, హర్యానా ప్రభుత్వాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

కాగా..వీధి కుక్కల దాడుల విషయంలో ఆందోళన నెలకొన్న పరిస్థితుల్లో హైకోర్టు ఇటువంటి ఆదేశాలు ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది. వీధి కుక్కలతో పాటు వీధుల్లో తిరిగే జంతువుల వల్ల అంటే ఆవులు, గేదెలు,గాడిదలు, ఎద్దులు, పందులు వంటి వాటివల్ల ప్రజలకు గాయాలు అయితే పరిహారం ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాలని ఆదేశించింది. అలాగే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అడవి జంతువుల వల్ల గాయాపడినా ఆ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని ఆదేశించింది. ఈ దాడుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

Rajasthan : 350 ఏళ్లుగా దోపిడీకి గురవుతున్న ఆ దేవుడి ప్రసాదం .. దీని వెనుక ఆసక్తికర కారణం..