Lion Between Houses : నగరవాసులకు హెచ్చరిక.. సర్కస్ నుంచి తప్పించుకున్న సింహం మీ ఇళ్లముందే తిరుగుతోంది..

నగర పౌరులకు విజ్ఞప్తి..ఓ సింహం మీ వీధుల్లోనే మీ ఇళ్లముందే తిరుగుతోంది...ఇళ్లనుంచి ఎవ్వరు బయటకు రావద్దు అంటూ అధికారులు ఎనౌన్స్ చేశారు.

Lion Between Houses : నగరవాసులకు హెచ్చరిక.. సర్కస్ నుంచి తప్పించుకున్న సింహం మీ ఇళ్లముందే తిరుగుతోంది..

Lion prowling streets

Lion prowling streets: నగర పౌరులకు విజ్ఞప్తి..ఓ సింహం మీ వీధుల్లోనే మీ ఇళ్లముందే తిరుగుతోంది…ఇళ్లనుంచి ఎవ్వరు బయటకు రావద్దు అంటూ అధికారులు ఎనౌన్స్ చేశారు. ఆ ప్రకటన విన్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి..వెన్నులోంచి వణుకు పుట్టుకొస్తుంది కదూ..నిజమే మరి సింహం జనాలు నివసించే చోటికి వస్తే ఎవరిని గుటకాయస్వాహా చేసేస్తుందనే అనే భయం భయంగా ఉంటుంది. వీధుల్లోనే ఎందుకు తిరుగుతుంది గోడ దూకి లోపలికి వచ్చేసిందేమే..ఏ గోడ పక్కన ఉందో ఏమో..కాలు బటయపెడితే అమాంతం మీద దూకి పంజా విసిరిందంటే ప్రాణం కాస్తా హరీ మంటుంది అనే భయంతో ఇంటినుంచి కాలు కూడా బయటపెట్టేందుకు హడలిపోతాం…

నిజమే పాపం అదే పరిస్థితి గురయ్యారు ఇటలీలోని లాడిస్పోలి అనే నగరవాసులు. సర్కస్ నుంచి తప్పించుకున్న ఓ సింహం లాడిస్పోలి నగరంలో స్వేచ్చగా తిరుగుతున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అది కాస్తా వైరలు అవుతోంది.

మేయర్ అలెశాండ్రో గ్రాండో తన ఫేస్ బుక్ లో ఒక ప్రకటన విడుదల చేస్తు..వియాల్ మెడిటరేనియోలో సర్కస్ నుంచి ఓ సింహం తప్పించుకుంది. దాని కోసం సర్కస్ సిబ్బందితో పాటు నగర అధికారులు కూడా గాలిస్తున్నారు..ఈ సింహం లాడిస్పోలీ నగరంలోని నివాస ప్రాంతాల్లో తిరుగుతోంది అంటూ ఓ వీడియో విడుదల చేశారు. ఏరోజు ఏం జరుగుతుందో అనే ఆందోళన నెలకొందని ప్రజలు ఎవ్వరు ఇళ్లలోంచి బయటకు రావద్దు అని ప్రకటించారు. ఈ వీడియోను మిచెల్ గాల్వానీ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ వీడియోలో సింహం దర్జాగా ఇళ్లముందే తిరుగుతున్నట్లుగా చక్కగా కనిపిస్తోంది. సర్కస్ నుంచి తప్పించుకుందీ అంటే అది మాంచి ఆకలిమీదుంటుంది. ఎవరైనా కంటికి కనిపిస్తే వారి పని అంతే..