FASTag Annual Pass
FASTag Annual Pass : ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులకు బిగ్ అప్‌డేట్.. టోల్ టాక్స్ తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రోజువారీ హైవే ప్రయాణికులకు FASTag వార్షిక పాస్‌ను (FASTag Annual Pass) ప్రకటించింది. ఈ ప్లాన్ ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానుంది.
భారత జాతీయ రహదారి అథారిటీ (NHAI) అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ పథకాన్ని క్యాంపెయిన్ చేస్తోంది. ‘Coming Soon’ ట్యాగ్‌తో ఇప్పుడు కొత్త బ్యానర్ లైవ్ చేసింది. రూ. 3వేల ధర గల వార్షిక పాస్ 200 టోల్ క్రాసింగ్‌లకు ఏడాది పాటు వ్యాలిడిటీ ఉంటుంది. వార్షిక FASTag పాస్ ధర, అర్హత, ఇతర విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ అర్హత :
ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ కార్లు, జీపులు, వ్యాన్లు వంటి ప్రైవేట్, వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. ట్రక్కులు లేదా బస్సులు వంటి వాణిజ్య రవాణాదారులు ఈ పథకానికి అర్హులు కారు. అదనంగా, అర్హత కలిగిన వినియోగదారులకు తమ ఫాస్ట్ ట్యాగ్ యాక్టివ్‌గా ఉండాలి. బ్లాక్‌లిస్ట్ లేని వెహికల్ రిజిస్ట్రేషన్‌కు లింక్ అయి ఉండాలి.
Read Also : Google Pixel 9 Price : ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ ఫోన్ ఆఫర్.. ఇలా కొన్నారంటే అతి తక్కువ ధరకే.. జస్ట్ ఎంతంటే?
ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ ధర, వ్యాలిడిటీ :
ఈ ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ ఒక ఏడాది వరకు గరిష్టంగా 200 ఫ్రీ టోల్ క్రాసింగ్‌లను అందిస్తుంది. ఏడాదికి ధర రూ. 3వేలు చెల్లించాల్సి ఉంటుంది.
ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ దరఖాస్తు ఎలా? :
ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ అందుబాటులోకి వచ్చాక ఇప్పటికే ఉన్న FASTag వినియోగదారులు వార్షిక FASTag పాస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం రాజ్‌మార్గ్ యాత్ర యాప్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారిక వెబ్‌సైట్ (www.nhai.gov.in) లేదా (www.morth.nic.in) ద్వారా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
FASTag వార్షిక పాస్ తప్పనిసరి కాదా? :
లేదు.. తప్పనిసరి కాదు. వార్షిక పాస్ ఇష్టపడని వారికి ప్రస్తుత FASTag యథాతథంగా పనిచేస్తుంది. టోల్ ప్లాజాలలో వర్తించే విధంగా వినియోగదారులు సాధారణ లావాదేవీల కోసం వినియోగించుకోవచ్చు. ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ నేషనల్ హైవే, నేషనల్ ఎక్స్‌ప్రెస్‌వేపై మాత్రమే వర్తిస్తుంది.