Google Pixel 9 Price : ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ ఫోన్ ఆఫర్.. ఇలా కొన్నారంటే అతి తక్కువ ధరకే.. జస్ట్ ఎంతంటే?
Google Pixel 9 Price : గూగుల్ పిక్సెల్ 9 ధర తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ అద్భుతమైన డీల్ అందిస్తోంది. కొనుగోలుదారులు ఈ డీల్ ఇలా పొందవచ్చు..

Google Pixel 9 Price
Google Pixel 9 Price : పిక్సెల్ అభిమానులకు గుడ్ న్యూ్స్.. లాస్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ గూగుల్ పిక్సెల్ 9 ధర భారీగా తగ్గింది. ఈ-కామర్స్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ హ్యాండ్‌సెట్ రూ.68వేల (Google Pixel 9 Price) లోపు ధరకే లభ్యమవుతుంది. వాస్తవానికి, భారత మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ రూ.79,999 ధరకు లాంచ్ అయింది.
ఇన్-హౌస్ గూగుల్ టెన్సర్ G4 చిప్‌సెట్, ఆకట్టుకునే కెమెరా సెటప్, ఏఐ ఫీచర్లతో ప్రీమియం లుక్‌ను కలిగి ఉంది. అద్భుతమైన పర్ఫార్మెన్స్, ఫీచర్లు అందించే కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే.. ఈ పిక్సెల్ 9 డీల్ బెస్ట్. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 12వేలు ఎలా సేవ్ చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 9 ధర ఎంతంటే? :
ప్రస్తుతం పిక్సెల్ 9 ఫోన్ (Google Pixel 9 Price ) 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ బేస్ మోడల్ రూ.74,999 ధరకు లిస్ట్ అయింది. అసలు ధర కన్నా రూ.5వేలు తగ్గింది. HDFC బ్యాంక్ కార్డుపై రూ.7వేలు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. దాంతో పిక్సెల్ 9 ఫోన్ ధర రూ.68వేల కన్నా తక్కువకు తగ్గుతుంది.
ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను కూడా పొందవచ్చు. మీ పాత ఫోన్ కొత్త పిక్సెల్ 9 కోసం ఎక్స్ఛేంజ్ చేసుకుంటే.. రూ. 50,150 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూను పొందవచ్చు. ఈ ధర డివైజ్ మోడల్, వర్కింగ్ కండిషన్ ఆధారంగా ఉంటుంది. ఈ పిక్సెల్ 9 ఫోన్ అబ్సిడియన్, పియోనీ, పోర్సెలియన్, వింటర్‌గ్రీన్‌తో సహా 4 వేర్వేరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
గూగుల్ పిక్సెల్ 9 స్పెసిఫికేషన్లు :
గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ (Google Pixel 9 Price ) 6.3-అంగుళాల LTPO OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్ టాప్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 OSపై రన్ అవుతుంది. 7 మెయిన్ ఆండ్రాయిడ్ వెర్షన్‌లకు అప్‌గ్రేడ్‌లకు సపోర్టు ఇస్తుంది. 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో గూగుల్ టెన్సర్ G4 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది.
ఆప్టిక్స్ విషయానికొస్తే.. గూగుల్ పిక్సెల్ 9 మోడల్ 50MP ప్రైమరీ సెన్సార్, 48MP అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10.5MP ఫ్రంట్ షూటర్‌ను కలిగి ఉంది. ఈ పిక్సెల్ ఫోన్ 4700mAh బ్యాటరీతో పాటు 27W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది.