డెబిట్ కార్డుదారులకు శుభవార్త. డబ్బులు విత్ డ్రా చేసేందుకు ఏటీఎం సెంటర్లకు వెళ్తున్నారా? ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో మూడు కంటే ఎక్కువసార్లు విత్ డ్రా చేస్తే ఛార్జీలు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల బ్యాంకు ఖాతాల్లో కనీస నగదు ఉండాల్సిన అవసరం లేదని కేంద్రం వెల్లడించింది. ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో నగదు విత్ డ్రా చేసినా కూడా ఎలాంటి ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు వచ్చే 3 నెలల వరకు కొనసాగుతాయని కేంద్రం పేర్కొంది.
కరోనా ప్రభావంతో ప్రజల సౌకర్యార్థం అన్ని బ్యాంకుల ఏటీఎంల్లో విత్ డ్రా ఛార్జీలు ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. మీరు వాడే డెబిట్ కార్డు ఏ బ్యాంకు అకౌంట్ అయినా మరో 3 నెలల వరకు ఎలాంటి ఛార్జీలు ఉండవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
మంగళవారం మంత్రి నిర్మలా మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనా సంక్షోభం నుంచి దేశ ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎకనామిక్ ప్యాకేజీని ప్రకటించనున్నట్టు నిర్మల వెల్లడించారు. డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసుల్లో డెబిట్ కార్డుదారులు ఏదైనా బ్యాంకు ఏటీఎం నుంచి ఉచితంగా విత్ డ్రా చేసుకోవచ్చునని తెలిపారు.
వచ్చే మూడు నెలల వరకు ఉచితంగా వినియోగించుకోవచ్చునని చెప్పారు. అంతేకాదు.. ఎలాంటి కనీస నగదు నిల్వ ఫీజులు కూడా ఉండవన్నారు. అదేవిధంగా డిజిటల్ ట్రేడ్ ట్రాన్సాక్షన్లపై అన్ని ట్రేడ్ ఫైనాన్స్ కంజ్యూమర్లపై బ్యాంకు ఛార్జీలను కూడా తగ్గించినట్టు నిర్మలా స్పష్టం చేశారు.
See Also | ఆధార్-పాన్, GST, ITR గడువు తేదీలు జూన్ 30వరకు పొడిగింపు