Financial Tips
Financial Tips : అందరూ డబ్బు సంపాదిస్తారు. కానీ, కొంతమంది మాత్రమే ఆ డబ్బును కూడబెడతారు. సరైన చోట పెట్టుబడి పెడతారు. ఆర్థిక క్రమశిక్షణ (Financial Tips) అనేది చాలా ముఖ్యం. డబ్బు చేతిలో ఉందని అవసరం ఉన్నా లేకున్నా ఖర్చు చేయకూడదు. ఏదైనా అనుకోని అత్యవసర సమయాల్లో మీరు దాచిన డబ్బే ఆదుకుంటుంది. సరైన పెట్టుబడి ప్రణాళికతో ముందుకు సాగేవారు చాలా ఈజీగా కోట్లు సంపాదించుకోవచ్చు.
ఇది సాధ్యమేనా అంటే సాధ్యమే అంటున్నారు చార్టర్ట్ అకౌంటెంట్ (CA Nitin Kaushik) నితిన్ కౌశిక్. అసలు ఏం లేని స్థాయి జీరో నుంచి రూ. కోటికిపైగా సంపాదించాలంటే ఎలాంటి పెట్టుబడి ప్రణాళికలు ఉండాలి? ఏం చేస్తే ఈ ఆర్థిక లక్ష్యంగా సులభంగా చేరుకోవచ్చు అనేది సీఏ కౌశిక్ చక్కగా వివరించారు. ఎక్స్ వేదికగా ఆయన ఆర్థిక సూత్రాలను చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వచ్చిన ఆదాయాన్ని సరైన సమయంలో సరైన చోట పెట్టుబడిగా మార్చడం ద్వారా సంపద దృష్టి సాధ్యమేనని ఆయన చెబుతున్నారు. కోట్ల సంపద సృష్టించే నిర్దిష్ట ఆర్థిక స్వేచ్ఛ బ్లూప్రింట్ గురించి కూడా సీఏ నితిన్ వివరించారు.
చేతిలో చిల్లిగవ్వ లేకుండా కూడా జీరో స్థాయి నుంచి మొదలుపెట్టి రూ. కోటికి పైగా సంపాదించవచ్చునని సీఏ నితిన్ కౌశిక్ అంటున్నారు. దీనికి వారసత్వంగా లేదా ఉద్యోగం ద్వారా సంపాదన ఒక్కటే ఉండాల్సిన పనిలేదంటున్నారు. సంపద సృష్టి అనేది అదృష్టంతో ఉండదు. అది క్రమశిక్షణ, స్థిరత్వంతో ముడిపడి ఉంటుందని చార్టర్డ్ అకౌంటెంట్ కౌశిక్ అన్నారు.
జీరో సేవింగ్ నుంచి రూ. 1 కోటి వరకు :
సీఏ నితిన్ ప్రకారం.. నిర్దిష్టమైన ఫైనాన్షియల్ బ్లూప్రింట్‌ను ఫాలో అవ్వాలి. ఎలాంటి వారసత్వం లేదా ఉద్యోగం ఉండాల్సిన అవసరం లేదు. జీరో నుంచి ప్రారంభించి రూ. 1 కోటి లేదా అంతకంటే ఎక్కువ కూడా సంపాదించగలరు. దీనికి రోడ్ మ్యాప్ సరైనదిగా ఉండాలి. ఫ్రీడమ్ ఫండ్ బ్లూప్రింట్ చాలా మంది విస్మరిస్తున్నారు.
ఈ రోడ్‌మ్యాప్ మిమ్మల్ని రూ. 1 కోటికిపైగా సంపాదించిపెడుతుంది’’ అని ఆయన షేర్ చేశారు. సంపదను సృష్టించుకోవడానికి అదృష్టం కన్నా క్రమశిక్షణ, స్థిరత్వమే అత్యవసరమని నితిన్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సూత్రాలను అనుసరిస్తే ప్రతిఒక్కరూ తమ జీవితాతం సంపద సృష్టిస్తూనే ఉంటారు.
1. సేవింగ్స్ అకౌంట్ :
పెట్టుబడికి ముందే పక్కా ప్లానింగ్ తప్పక ఉండాలి. ఆర్థిక భద్రతకు ఇది మొదటిమెట్టు. పెట్టుబడి ద్వారా సంపాదించడానికి మొదటి అడుగు. ఉద్యోగ కోల్పోవడం, వైద్య అత్యవసర పరిస్థితులు, ఆకస్మిక ఖర్చులు ఎదురైతే ఈ సేవింగ్స్ అకౌంట్ లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో రూ. 1 లక్ష పక్కన పెట్టి ఉంచాలి. ఇలాంటి సందర్భాల్లో మాత్రమే ఈ డబ్బును ముట్టుకోవాలి.
2. SIPలో పెట్టుబడి పెట్టండి :
SIPలో పెట్టుబడిపై ఫోకస్ పెట్టండి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో SIP ద్వారా నెలకు రూ. 10వేలు పెట్టుబడి పెట్టండి. ఈ ఫండ్ 20 ఏళ్లలో రూ. 1 కోటి వరకు పెరుగుతుంది. మార్కెట్ సమయం కన్నా స్థిరత్వం చాలా ముఖ్యం.
💥 From ₹0 Savings to ₹1 Cr: A Financial Freedom Blueprint Most People Ignore
If you’re starting from scratch — no inheritance, no fancy job — this roadmap can still take you to ₹1 Cr and beyond.
It’s not about luck. It’s about systems and consistency.
Here’s a realistic… pic.twitter.com/4NW2XFvdoV— CA Nitin Kaushik (@Finance_Bareek) August 2, 2025
3. సైడ్ ఇన్‌కమ్ :
ఫ్రీలాన్సింగ్, కంటెంట్ క్రియేషన్, ట్యూటరింగ్ లేదా ఇలాంటివి ద్వారా నెలకు రూ. 30వేలు సంపాదించి ఆస్తులను పెంచుకోవాలి. ఇలా చేస్తే 10 ఏళ్లలో మీ నికర విలువకు రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షలకు చేరుకుంటుంది.
4. టర్మ్, హెల్త్ ఇన్యూరెన్స్ తీసుకోండి :
మీ వార్షిక ఆదాయానికి 10 నుంచి 15 రెట్లు సమానమైన టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల కవర్‌తో ఆరోగ్య బీమాను కలిగి ఉండాలి. అధిక వడ్డీ రుణాల జోలికి వెళ్లొద్దు. అనవసరమైన ఈఎంఐలను కూడా చెల్లించవద్దని సీఏ సలహా ఇస్తున్నారు.
5. ఫ్రీడమ్ ఫండ్ :
ప్రతిఒక్కరూ ఫ్రీడమ్ ఫండ్ క్రియేట్ చేయాలి. మీ వార్షిక ఖర్చులను 25 రెట్లు లక్ష్యంగా పెట్టుకోవాలి. ఏడాదికి రూ. 6 లక్షలు ఖర్చు చేస్తే.. అప్పుడు మీ ఫ్రీడమ్ ఫండ్ రూ. 1.5 కోట్లు అవుతుందని సీఏ చెబుతున్నారు. మీ ఆదాయాన్ని పెంచుకునేందుకు కోడింగ్, రైటింగ్, మార్కెటింగ్ లేదా ఫైనాన్స్ వంటి స్కిల్స్ నేర్చుకోవాలని నితిన్ సిఫార్సు చేస్తున్నారు.
స్కిల్స్ ఆధారిత ఆదాయాలు స్టాక్ మార్కెట్లు ఎప్పుడూ ఒకేలా ఉండవు. సీఏ నితిన్ ప్రకారం.. 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లలో కోటి సంపాదన అంటే చాలామందికి నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు. సరైన ప్లానింగ్‌తో రూ. 1 కోటి కన్నా ఎక్కువగానే సంపాదించవచ్చునని చెబుతున్నారు. మీరు కూడా మీ జీవితంలో అప్లయ్ చేసి ఉండండి.. ఎంతవరకు సాధ్యమో తెలుసుకోవచ్చు.