Family Scooters : ఫ్యామిలీ కస్టమర్లు మెచ్చే టాప్ 5 స్కూటర్లు.. మంచి మైలేజ్ కూడా.. మీ బడ్జెట్ ధరలోనే.. ఏది కొంటారో మీ ఇష్టం..!
Family Scooters : ఫ్యామిలీ కస్టమర్లకు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లో 2025లో టాప్ 5 ఫ్యామిలీ స్కూటర్లు ఇవే.. ఏ స్కూటర్ తీసుకుంటారు?

Top 5 Family Scooters
Family Scooters : కొత్త స్కూటర్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లో ఫ్యామిలీ కస్టమర్ల కోసం అద్భుతమైన స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా సిటీలో ప్రయాణానికి (Family Scooters) స్కూటర్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందులో ఫ్యామిలీ కస్టమర్లే ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే.. స్కూటర్లు ప్రయాణం సౌలభ్యం, సౌకర్యం, రోజువారీ పనులకు చాలా ఈజీగా ఉంటుంది.
2025లో, స్టైలింగ్ లుక్స్, మైలేజ్, అడ్వాన్స్ ఫీచర్లు, వైడ్ స్టోరేజీ ఉన్న మోడళ్లు అనేకం ఉన్నాయి. ఇందులో ఎక్కువగా ఫ్యామిలీ స్కూటర్లు ఉన్నాయి. కిరాణా సామాగ్రి నుంచి ఆఫీసు ప్రయాణాల వరకు వారాంతపు విహారయాత్రల వరకు ఫ్యామిలీ స్కూటర్ అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. సౌకర్యం, పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు.. అద్భుతమైన రైడింగ్ అనుభవాన్ని కూడా పొందచ్చు. ఇప్పుడు, 2025లో భారత మార్కెట్లో టాప్ 5 ఫ్యామిలీ స్కూటర్లను ఓసారి పరిశీలిద్దాం..
1. హోండా యాక్టివా 7G :
భారత మార్కెట్లో హోండా యాక్టివా అత్యంత పాపులర్ స్కూటర్. 7G వెర్షన్ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. మీ ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుంది. ఇంధన సామర్థ్యంతో వస్తుంది. యాక్టివా 7Gలో ఎక్కువ సస్పెన్షన్, LED లైట్లు, బిగ్ అండర్-సీట్ స్టోరేజ్ కూడా ఉన్నాయి. రోజువారీ ప్రాతిపదికన ఏదైనా ఫ్యామిలీ అవసరాన్ని తీరుస్తుంది.
2. టీవీఎస్ జూపిటర్ 125 :
టీవీఎస్ జూపిటర్ 125 అనేది ఫ్యామిలీ ఆధారిత స్కూటర్. గొప్ప సీటింగ్ సౌకర్యం కలిగి ఉంది. వైడ్ ఫ్లోర్‌బోర్డ్, సీటు కింద 33-లీటర్ల స్టోరేజీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇంధన సామర్థ్యం కలిగి ఉంటుంది. డిజిటల్-అనలాగ్ కన్సోల్, ఎక్స్‌ట్రనల్ ఫ్యూయల్ ఆప్షన్ కూడా ఉంది. ఏవైనా అడ్డంకులను గుర్తించే సస్పెన్షన్ వంటి ఫీచర్లను కూడా కలిగి ఉంది.
Read Also : LIC Bima Sakhi : మహిళల కోసం LIC స్పెషల్ స్కీమ్.. నెలకు రూ.7వేల వరకు సంపాదించుకోవచ్చు.. ఎలా అప్లయ్ చేయాలంటే?
3. సుజుకి యాక్సెస్ 125 :
సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ ఫ్యామిలీ కస్టమర్లకు బెస్ట్. వేగవంతమైన పర్ఫార్మెన్స్ ప్రీమియం ఫీచర్లతో వస్తుంది. ఈ ఫ్యామిలీ స్కూటర్ పవర్‌ఫుల్ ఇంజిన్, సౌకర్యవంతమైన సీటు, తగినంత స్టోరేజీ స్పేస్, USB ఛార్జింగ్ పోర్ట్, టెలిస్కోపిక్ సస్పెన్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ ఆకర్షణీయమైన ఆప్షన్. రెట్రో-మోడ్రాన్ డిజైన్ కలిగి ఉంది.
4. యమహా ఫ్యాసినో 125 Fi హైబ్రిడ్ :
ఈ యమహా స్కూటర్ స్టయిల్, వినియోగం పరంగా అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. యమహా ఫ్యాసినో 125 Fi హైబ్రిడ్ నగర ఫ్యామిలీలకు అద్భుతంగా ఉంటుంది. తేలికైన బాడీతో ఈజీగా హ్యాండ్లింగ్ అందిస్తుంది. హైబ్రిడ్ పవర్ అసిస్ట్ పికప్ మాత్రమే కాదు మంచి మైలేజీని అందిస్తుంది. అన్ని వయసుల వారికి బాగుంటుంది. స్టైలిష్ మంచి లుక్స్‌తో మరింత ఆకట్టుకుంటుంది.
5. హీరో డెస్టినీ ప్రైమ్ :
హీరో డెస్టినీ ప్రైమ్ స్కూటర్ అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉంది. చౌకైన ఫ్యామిలీ స్కూటర్ కూడా. సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ స్కూటర్‌లో స్టోరేజీ స్పేస్ కూడా ఉంది. అంతేకాదు.. స్కూటర్ స్కూల్ నుంచి తీసుకొచ్చేందుకు తల్లిదండ్రులకు సరిపోతుంది. నగర ట్రాఫిక్‌లో సరిగ్గా సరిపోతుంది. ఇంజిన్ పరంగా బాగుటుంది. లో మెయింటైనెన్స్ అందిస్తుంది.