LIC Bima Sakhi : మహిళల కోసం LIC స్పెషల్ స్కీమ్.. నెలకు రూ.7వేల వరకు సంపాదించుకోవచ్చు.. ఎలా అప్లయ్ చేయాలంటే?

LIC Bima Sakhi : మహిళల కోసం ఎల్ఐసీ కొత్త స్కీమ్ అందిస్తోంది. MCA స్కీమ్ ద్వారా మహిళలు నెలకు రూ. 7వేల వరకు సంపాదించుకోవచ్చు.

LIC Bima Sakhi : మహిళల కోసం LIC స్పెషల్ స్కీమ్.. నెలకు రూ.7వేల వరకు సంపాదించుకోవచ్చు.. ఎలా అప్లయ్ చేయాలంటే?

LIC Bima Sakhi

Updated On : August 10, 2025 / 12:44 PM IST

LIC Bima Sakhi : మహిళలకు గుడ్ న్యూస్.. ఎల్ఐసీలో అద్భుతమైన స్కీమ్.. ఈ కొత్త పథకం ద్వారా నెలకు రూ. 7వేల వరకు సంపాదించుకోవచ్చు. జీవిత బీమా సంస్థ (LIC) మహిళల కోసం (LIC Bima Sakhi ) ఈ ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. మహిళా కెరీర్ ఏజెంట్ (MCA) పథకం కింద మహిళలు ఇప్పుడు ‘బీమా సఖి’గా మారవచ్చు.

ఈ రంగంలో మహిళలు తమ కెరీర్‌ను ప్రారంభించవచ్చు. ఇందులో చేరిన తర్వాత నుంచి ప్రారంభంలో నెలకు రూ. 7వేల వరకు సంపాదించవచ్చు. మహిళలను మంచి ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ఎల్ఐసీ పథకాన్ని అందిస్తోంది. ఇంతకీ ఈ పథకంలో చేరాలంటే అర్హతలేంటి? ఎలా అప్లయ్ చేసుకోవాలి? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఎవరు ‘బీమా సఖి’ అవుతారంటే? :
ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే మహిళ వయస్సు కనీసం 18 ఏళ్లు, గరిష్టంగా 70 సంవత్సరాలు ఉండాలి. కనీస విద్యార్హత 10వ తరగతి ఉత్తీర్ణత. LICలో శాశ్వత ఉద్యోగం కాదు. స్టైపెండ్ ఆధారిత ఏజెన్సీ అవకాశం మాత్రమే.

Read Also : Amazon Sale Offers : అమెజాన్‌లో అద్భుతమైన సేల్ ఆఫర్లు.. అతి చౌకైన ధరకే AC, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్‌ ఇంటికి తెచ్చుకోవచ్చు..!

నెలకు సంపాదన ఎంతంటే? :

  • MCA పథకం కింద ఎంపికైన మహిళలకు స్టైఫండ్ లభిస్తుంది.
  • మొదటి సంవత్సరం : నెలకు రూ. 7,000
  • రెండో సంవత్సరం : నెలకు రూ. 6,000 (మొదటి సంవత్సరంలో 65శాతం పాలసీలు యాక్టివ్‌గా ఉంటే)
  • మూడో సంవత్సరం : నెలకు రూ. 5,000 (రెండో సంవత్సరం మాదిరిగానే షరతులు వర్తిస్తాయి)
  • ప్రతి సంవత్సరం స్టైఫండ్ పొందాలంటే.. మహిళా ఏజెంట్ కనీసం 24 కొత్త పాలసీలను చేయించాలి.
  • మొదటి సంవత్సరంలో రూ. 48వేల వరకు (బోనస్ మినహా) కమీషన్ పొందాలి.

ఎవరు అప్లయ్ చేయలేరంటే? :

  • ప్రస్తుత LIC ఏజెంట్లు
  • LIC ఉద్యోగులు, వారి దగ్గరి బంధువులు (జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, అత్తమామలు)
  • రిటైర్డ్ LIC సిబ్బంది
  • రీఅపాయింట్ కోరే మాజీ ఏజెంట్లు.

ఎలా అప్లయ్ చేయాలి? :
ఆసక్తిగల మహిళలు అప్లయ్ చేసే సమయంలో ఈ కింది డాక్యుమెంట్లలో ఆటో వెరిఫైడ్ కాపీలు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోను అప్‌లోడ్ చేయాలి.

  • ఏజ్ ప్రూఫ్
  • అడ్రస్ ప్రూఫ్
  • అకడమిక్ సర్టిఫికేట్
  • అప్లికేషన్ అసంపూర్తిగా ఉంటే రిజక్ట్ అవుతుంది.