Amazon Sale Offers : అమెజాన్‌లో అద్భుతమైన సేల్ ఆఫర్లు.. అతి చౌకైన ధరకే AC, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్‌ ఇంటికి తెచ్చుకోవచ్చు..!

Amazon Sale Offers : అమెజాన్ అద్భుతమైన సేల్.. అతి తక్కువ ధరలో ఏసీలు, ఫ్రిజ్, వాషింగ్ మిషన్లను కొనుగోలు చేయొచ్చు. ఈ డీల్స్ ఎలా పొందాలంటే?

Amazon Sale Offers : అమెజాన్‌లో అద్భుతమైన సేల్ ఆఫర్లు.. అతి చౌకైన ధరకే AC, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్‌ ఇంటికి తెచ్చుకోవచ్చు..!

Amazon Sale Offers

Updated On : August 10, 2025 / 12:23 PM IST

Amazon Sale Offers : కొత్త ఫ్రిజ్ లేదా వాషింగ్ మిషన్, ఏసీ కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఇదే బెస్ట్ టైమ్.. అమెజాన్‌లో అద్భుతమైన సేల్ అందుబాటులో (Amazon Sale Offers) ఉంది. అతి తక్కువ ధరకే ఏసీలు, రిఫ్రిజేటర్లు, వాషింగ్ మిషన్లను కొనేసుకోవచ్చు. అమెజాన్ అప్లియన్సెస్ అప్ గ్రేడ్ డేస్ 2025 (Amazon Appliances Upgrade Days 2025) పేరుతో మరో కొత్త సేల్ ప్రారంభించింది.

మీరు ఎక్కువ సేవింగ్స్‌తో షాపింగ్ చేయాలనుకుంటే ఈ డీల్స్ అసలు వదులుకోవద్దు. టాప్-బ్రాండెడ్, లేటెస్ట్ అప్‌డేట్స్‌‌తో చౌకైన ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ అప్లియన్స్‌లో ఫ్రంట్-లోడ్ వాషింగ్ మెషీన్, రిఫ్రిజిరేటర్, స్ప్లిట్ ఏసీ, అనేక ఇతర అప్లియన్సెస్ కొనుగోలు చేస్తున్నారు. ఈ టాప్ అప్లియన్సెస్‌పై అమెజాన్ సేల్‌లో మాత్రమే ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు. మీరు ఈ లిస్టును ఎలా చెక్ చేయాలి? బ్యాంక్ ఆఫర్లు, అనేక డీల్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Read Also : ICICI Minimum Balance : కస్టమర్లకు బిగ్ షాక్.. ICICI బ్యాంక్ కొత్త రూల్.. ఇక సేవింగ్స్ ఖాతాలో రూ. 50,000 మినిమం బ్యాలెన్స్ మస్ట్..!

క్యారియర్ 1.5 టన్ స్ప్లిట్ AC :
1.5 టన్నుల సామర్థ్యం కలిగిన క్యారియర్ టాప్ స్ప్లిట్ ఏసీ. కాపర్ కండెన్సర్, పవర్ సేవింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇల్లు మొత్తం క్షణాల్లో కూలింగ్ అవుతుంది. ఈ ఏసీ స్మార్ట్ ఎనర్జీ డిస్‌ప్లేతో వస్తుంది. HD, PM 2.5 ఫిల్టర్ కూడా ఉన్నాయి. అదే సమయంలో, WiFi కనెక్టివిటీతో మీడియం-సైజ్ గదికి బెస్ట్ ఏసీ అని చెప్పొచ్చు. అమెజాన్ నుంచి ఈ క్యారియర్ ఏసీని రూ. 35998కి కొనేసుకోవచ్చు.

హైయర్ రిఫ్రిజిరేటర్ :
మీరు అత్యాధునిక లేటెస్ట్ ఫ్రిజ్ కోసం చూస్తున్నారా? అమెజాన్ సేల్ సమయంలో సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్‌ను కొనుగోలు చేయొచ్చు. హైయర్ బ్రాండ్ ఫ్రిజ్ 598 లీటర్ల సామర్థ్యంతో వస్తుంది. ఇన్వర్టర్ టెక్నాలజీతో జంబో ఐస్ మేకర్‌తో వస్తుంది. డియో ఫ్రెష్ టెక్నాలజీతో కూడిన ఈ రిఫ్రిజిరేటర్ డిజిటల్ డిస్‌ప్లే ప్యానెల్‌తో కన్వర్టిబుల్ స్టోరేజ్ స్పేస్‌తో వస్తుంది. మీరు ఈ ఫ్రిజ్‌ను అమెజాన్ నుంచి రూ. 79,990కి కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్ వాషింగ్ మెషిన్ :
సూపర్ స్పీడ్, క్లీనింగ్‌తో లేటెస్ట్ శాంసంగ్ వాషింగ్ మెషిన్. కాంపాక్ట్ డిజైన్‌తో వస్తుంది. మీ ఇంట్లో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించదు. ఇందులో AI ఫీచర్లు, డిజిటల్ ఇన్వర్టర్‌ కూడా ఉంది. 5-స్టార్ ఎనర్జీ-సేవింగ్ రేటింగ్‌ కలిగిన ఫుల్ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్. అమెజాన్ నుంచి శాంసంగ్ వాషింగ్ మిషన్ రూ. 37,990కి కొనుగోలు చేయొచ్చు.