డబ్బు వస్తుంది.. పోతుంది.. రూపాయి సేవింగ్స్ లేవ్ అని ఫీలయ్యే వారికి 5 బెస్ట్ ఫైనాన్షియల్ టిప్స్..

Financial Tips : మీ డబ్బును ఇలా తెలివిగా ఆదా చేశారంటే.. భవిష్యత్తులో అద్భుతమైన రాబడిని పొందవచ్చు. మీరు కొత్తవారు అయినా సరే.. పెట్టుబడి చాలా సులభంగా పెట్టవచ్చు. మీరు చేయాల్సిందిల్లా.. ఇది పాటించడమే..

How to Save money with easy simple investment

Financial Tips : మీరు డబ్బును ఆదా చేయలేకపోతున్నారా? ఎంతగా డబ్బును ఆదా చేయాలన్నా ఏదో ఒక కారణంతో ఖర్చు పోతుందని ఆందోళన చెందుతున్నారా? అయితే, మీరు మీ డబ్బును సులభంగా ఆదా చేసుకునేందుకు అనేక అద్భుతమైన మార్గాలు ఉన్నాయి.

అందులో మ్యూచువల్ ఫండ్ల సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ ఒకటి. ఈ మార్గాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు పెట్టుబడి పెట్టే అలవాటును క్రమంగా పెంచుకోవచ్చు. ఎందుకంటే.. ఇందులో పెట్టుబడిని నిర్ణీత వ్యవధిలో చేయాల్సి ఉంటుందని గమనించాలి. తద్వారా డబ్బులు ఎక్కువ మొత్తంలో ఆదా చేసుకోవచ్చు.

Read Also : Valentines Week 2025 : చాక్లెట్ డే గురించి తెలుసా? ఎన్ని రకాల చాక్లెట్లు ఉన్నాయి? మీకు గర్ల్ ఫ్రెండ్‌కు గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేయొచ్చు!

సాధారణంగా, చాలా మంది ఎంత ప్రయత్నించినా కూడా తమ డబ్బును ఆదా చేసుకోలేకపోతున్నామని చెబుతుంటారు. మీ విషయంలో కూడా అదే జరిగితే.. ఈ రోజు మీ కోసం కొన్ని సులభమైన మార్గాలను అందిస్తున్నాం. ఈ మార్గాలను అవలంబించడం ద్వారా మీరు డబ్బు చాలా ఈజీగా ఆదా చేసుకోగలుగుతారు. మీ డబ్బులను సేవింగ్ కోసం పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు భవిష్యత్తులో మంచి రాబడిని కూడా పొందవచ్చు.

ఇన్వెస్ట్‌మెంట్ మార్కెట్లో అనేక ఆప్షన్లు ఉన్నాయి. మీకు భవిష్యత్తులో పెద్ద మొత్తంలో డబ్బును ఆదా చేసేందుకు వీలుంటుంది. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే.. డబ్బు ఆదా చేయడం. మీ జీతం ఎంత ఉన్నా, అందులో కనీసం ఇరవై శాతం ఆదా చేయడానికి ప్రయత్నించండి. తక్కువ మొత్తం ఉన్నప్పటికీ, పొదుపు చేయడం చాలా ముఖ్యం.

సిప్(SIP)లో ఇన్వెస్ట్ చేయడం :
మ్యూచువల్ ఫండ్ల సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లలో పెట్టుబడి పెట్టాలి. మీరు పెట్టుబడి పెట్టడాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. ఎందుకంటే ఇందులో పెట్టుబడిని నిర్ణీత వ్యవధిలో చేయాలి. ఇలా చేయడం ద్వారా మీ డబ్బు ఎక్కువ మొత్తంలో సేవింగ్ అవుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడి ద్వారా భవిష్యత్తులో పెద్ద మొత్తంలో డబ్బును ఆదా చేసుకోవచ్చు అనమాట.

అయితే, పెట్టుబడి పెట్టే ముందు, ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ గురించి పూర్తి సమాచారం పొందండి. మీ లక్ష్యాన్ని బట్టి ప్లాన్ ఎంచుకోండి. మీరు కోరుకుంటే.. ఆర్థిక సలహాదారుడి సాయం కూడా తీసుకోవచ్చు. తద్వారా పెట్టుబడి పెట్టే సమయంలో జరిగే పొరపాట్లను నివారించవచ్చు.

వివిధ పథకాల్లో పెట్టుబడి పెట్టండి :
మీరు పొదుపు చేసిన తర్వాత, ఆ డబ్బును వేర్వేరు మార్గాల్లో పెట్టుబడి పెట్టాలి. ఇందులో బీమా పాలసీ, ఎమర్జెన్సీ ఫండ్, PPF, దీర్ఘకాలిక పెట్టుబడి వంటి ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు తప్పనిసరిగా ఉండాలి.

దీర్ఘకాలిక పెట్టుబడితో అధిక ప్రయోజనాలు :
మీరు దీర్ఘకాలికంగా కొనసాగే చక్రవడ్డీ ప్రయోజనాన్ని అందించే పథకాలను ఎంచుకోవచ్చు. ఇలా పెట్టుబడి పెట్టుకుంటూ పోవడం ద్వారా దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో డబ్బును ఆదా చేసుకోవచ్చు. అంతేకాదు.. భవిష్యత్తులో మీకు ఆర్థికపరమైన భరోసా అందిస్తుంది. ఇందుకోసం మీరు SIP లేదా PPF వంటి పెట్టబడి ఆప్షన్లను ఎంచుకోవచ్చు.

Read Also : Whatsapp Spyware Attack : వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్.. డేంజరస్ ‘జీరో క్లిక్ హ్యాక్’తో జాగ్రత్త.. మీ డేటా ఇలా ప్రొటెక్ట్ చేసుకోండి!

రిస్క్ మేనేజ్‌మెంట్ తప్పనిసరి :
మీరు పెట్టుబడి పెడుతున్నారా? అయితే, రిస్క్‌ను తెలుసుకోవడం చాలా ముఖ్యం. పెట్టుబడి పెట్టడానికి ముందు మీ ఆర్థికపరమైన లక్ష్యాల గురించి పూర్తిగా తెలుసుకోండి. క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టండి. దీర్ఘకాలిక ప్లాన్ కూడా ఉండాలి. మీకు కావాలంటే.. మీరు ఆటోమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. మీరు మీ జీతం అందుకున్న వెంటనే పెట్టుబడి మొత్తాన్ని పక్కన పెట్టండి. ఇలా చేయడం వల్ల మనీ సేవింగ్ చేయడంలో కూడా సాయపడుతుంది.