Multiple Bank Accounts : ఒకరికి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండొచ్చు.. ఎక్కువ ఉంటే లాభమా? నష్టమా?

ఉద్యోగం మారిన ప్రతిసారి బ్యాంకు ఖాతాలు యాడ్ అవుతుంటాయి. ఒక్కొక్కరికి అలా చాలా అకౌంట్లు ఉండిపోతాయి. అన్ని అకౌంట్లు ఓపెన్ అయ్యి ఉండటం వల్ల ఎలాంటి లాభలున్నాయి? నష్టాలేంటి?

Multiple Bank Accounts

Multiple Bank Accounts : బ్యాంకు అకౌంట్ లేని వారు ఉండరు. అయితే ఒకరికి ఎన్ని బ్యాంకు అకౌంట్స్ ఉండొచ్చు. ఎక్కువ ఉంటే లాభమా? నష్టమా? అనే అనుమానాలు మాత్రం చాలామందిలో ఉంటాయి.

ఉద్యోగస్తులకి ఖచ్చితంగా బ్యాంకు అకౌంట్ ఉంటుంది. చేరిన ప్రతి సంస్థ ఉద్యోగస్తులకి ఒక్కో బ్యాంకులో ఖాతా తెరిచి ఇస్తుంది. అలా సంస్థ మారినప్పుడల్లా బ్యాంకు ఖాతాలు పెరిగిపోతూ ఉంటాయి. అవి ఉన్న సంగతే మర్చిపోతుంటారు. అలా మూడు నెలలకు పైగా వాడని ఖాతాలన్నీ సేవింగ్స్ అకౌంట్‌లోకి మారిపోతాయి. దాంతో మనకి తెలియకుండానే బ్యాంకులు ఛార్జీలు వేస్తుంటాయి. ఇది తెలియక చాలామంది చేసే తప్పు.

Trending: వారానికి ఐదు రోజులే బ్యాంకులు.. ట్రెండింగ్ లోకి #5DaysBanking

మల్టిపుల్ బ్యాంకు ఖాతాల గురించి తెలుసుకునే ముందు అసలు బ్యాంకులో ఎంత మొత్తం డిపాజిట్ చేసుకోవచ్చు అనే దానిపై కూడా అవగాహన ఉండాలి. బ్యాంకు ఖాతాలో మినిమమ్ రూ. 5 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేసుకోకూడదని రూల్ లేదు కానీ.. అనుకోకుండా ఆ బ్యాంకు దివాలా తీస్తే RBI రూల్స్ ప్రకారం ఆ ఖాతాలో ఎంత మొత్తం ఉన్నా రూ.5 లక్షలు మాత్రమే తిరిగి వస్తాయి. అలా కాకుండా మల్టిపుల్ అకౌంట్స్ ఉండటం ద్వారా మన దగ్గర అధికంగా ఉన్న మొత్తాన్ని అన్ని ఖాతాల్లో రూ.5 లక్షల చొప్పున డివైడ్ చేసి డిపాజిట్ చేస్తే ఎటువంటి సమస్యలు ఉండవు.

చాలామంది తెలియక చేసే పొరపాటు ఏంటంటే? సేవింగ్స్ ఖాతాలో రూ.10,000 మెయిన్ టెయిన్ చేయాలి. అలా చేయని పక్షంలో ఛార్జీలతో పాటు జీఎస్టీ కూడా యాడ్ అవుతుంది. కొందరు మినిమమ్ బ్యాలెన్స్ మెయిన్ టెయిన్ చేయరు. దానివల్ల అకౌంట్ మైనస్‌లోకి వెళ్లిపోతుంది. మైనస్‌లోకి వెళ్లిన అకౌంట్‌కి ఎవరైనా డబ్బులు డిపాజిట్ చేస్తే వెంటనే అవి కట్ అయిపోతుంటాయి. మినిమమ్ బ్యాలెన్స్ మెయిన్ టెయిన్ చేయలేనప్పుడు అవసరం లేని బ్యాంకు ఖాతాలను క్లోజ్ చేసుకోవడం బెటర్. లేదంటే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు సిబిల్ స్కోర్ కూడా తగ్గిపోతుంది. ఒకే ఒక బ్యాంకు ఖాతా ఉన్న వారికి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం ఈజీ అవుతుంది. అధిక బ్యాంకు ఖాతాలు ఉన్నవారికి కాస్త శ్రమ అవుతుంది.

HDFC: ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్యాంకుల జాబితాలో 4వ స్థానంలో హెచ్‌డీఎఫ్‌సీ.. టాప్-5 బ్యాంకులు ఇవే..

ఎక్కువ మొత్తంలో డబ్బులు రొటేషన్ చేసేవారికి మల్టిపుల్ బ్యాంకు ఖాతాలు అవసరమవుతాయి. అవసరం లేకుండా ఖాతాలను క్లోజ్ చేయకుండా ఉంచితే అదనపు ఛార్జీల మోతను భరించాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం మీకు తెలీకుండానే లేని పోనీ ఛార్జీలు ఇలాంటివి ఎన్ని కడుతున్నారో ఓసారి చెక్ చేసుకోండి.