HDFC: ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్యాంకుల జాబితాలో 4వ స్థానంలో హెచ్‌డీఎఫ్‌సీ.. టాప్-5 బ్యాంకులు ఇవే..
ఈ బ్యాంకుకు దాదాపు 12 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. హెచ్‌డీఎఫ్‌సీకి మొత్తం 8,300 బ్రాంచులు ఉన్నాయి.

HDFC
HDFC – Bank: ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్యాంకుల జాబితాలో (Most Valuable Banks) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నాలుగో స్థానంలో నిలిచింది. హెచ్‌డీఎఫ్‌సీతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ను విలీనం చేయాలని గతంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2022, ఏప్రిల్ 4న విలీన ప్రతిపాదనలకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆమోదం తెలిపింది. నేటి నుంచి ఇది అమల్లోకి వచ్చింది.
దీంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రపంచ దిగ్గజ టాప్-5 బ్యాంకుల సరసన నిలిచింది. ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 100 శాతం వాటాదారుల అధీనంలో ఉన్నట్లయింది. విలీనం అనంతరం భారత్ లో అత్యంత విలువైన బ్యాంకుగా హెచ్‌డీఎఫ్‌సీ నిలిచింది.
ఈ బ్యాంకుకు దాదాపు 12 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. జర్మనీ మొత్తం జనాభా కంటే ఈ సంఖ్య ఎక్కువ. హెచ్‌డీఎఫ్‌సీకి మొత్తం 8,300 బ్రాంచులు ఉన్నాయి. 1,77,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇకపై హెచ్‌డీఎఫ్‌సీ షేర్లూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లుగా ట్రేడవుతాయి.
ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్యాంకుల జాబితాలో మొదటి స్థానంలో అమెరికాకు చెందిన జేపీ మోర్గాన్ చేజ్ (JPMorgan Chase- 416.5 బిలియన్ల డాలర్లు) ఉంది. రెండో స్థానంలో కెనడాకు చెందిన ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా (ICBC- 228.3 బిలియన్ డాలర్లు), మూడో స్థానంలో బ్యాంక్ ఆఫ్ అమెరికా (Bank of America- 227.7 బిలియన్లు), హెచ్‌డీఎఫ్‌సీ (14.1 లక్షల కోట్ల రూపాయల విలువ), అగ్రికల్చర్ బ్యాంక్ ఆఫ్ చైనా ఆ తర్వాతి స్థానంలో ఉంది.