Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. పిక్సెల్ 9, ఐఫోన్ 16 ప్రో, పిక్సెల్ 9 ప్రో XL ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లు..!

Flipkart Big Billion Days Sale 2025 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా పిక్సెల్ 9, ఐఫోన్ 16 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.

Flipkart Big Billion Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. పిక్సెల్ 9, ఐఫోన్ 16 ప్రో, పిక్సెల్ 9 ప్రో XL ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లు..!

Flipkart Big Billion Days Sale 2025

Updated On : September 12, 2025 / 4:29 PM IST

Flipkart Big Billion Days Sale 2025 : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అతి త్వరలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్‌కు కొన్ని రోజుల ముందు నుంచే అనేక ఆఫర్లు, డిస్కౌంట్లు ఊరిస్తున్నాయి.

ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డీల్స్ (Flipkart Big Billion Days Sale 2025) అందిస్తోంది. ఆసక్తిగల కొనుగోలుదారులు తమకు నచ్చిన ఏదైనా స్మార్ట్ ఫోన్ ఎంచుకోవచ్చు. ఐఫోన్ 16 ప్రో నుంచి పిక్సెల్ 9 ప్రో XL వరకు హై-ఎండ్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్లు ప్రారంభ ధరపై రూ. 54వేల వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్ సమయంలో గూగుల్ పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో XL, ఐఫోన్ 16 ప్రో సహా ఇతర ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లను పొందవచ్చు.

గూగుల్ పిక్సెల్ 9 :

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 9 ఫోన్ రూ.64,999 ధరకు లభ్యమవుతుంది. లాంచ్ ధర రూ.79,999 నుంచి రూ.15వేలు తగ్గింపు ధరకు లభిస్తుంది. అయితే, ఈ హ్యాండ్‌సెట్ ఆఫర్లతో రూ.34,999 ధరకే కొనుగోలుకు చేయొచ్చు. ఇందులో ICICI, Axis బ్యాంక్ కార్డులపై రూ.2వేలు బ్యాంక్ డిస్కౌంట్, పాత ఫోన్ ట్రేడ్-ఇన్‌పై రూ.1,000 ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు. లాంచ్ ధరలో సగం కన్నా తక్కువ ధరకే ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.

Read Also : Apple MacBook Air : కొత్త ల్యాప్‌టాప్ కావాలా? ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్‌‌పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

ఆపిల్ ఐఫోన్ 16 ప్రో :
గత ఏడాదిలో రూ.1,19,900 ప్రారంభ ధరకు వచ్చిన ఐఫోన్ 16 ప్రో ఫోన్ రూ.69,999 తగ్గింపు ధరకు లభ్యం కానుంది. ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ.5వేలు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చ. ఆసక్తిగల కొనుగోలుదారులు రూ.49,901 భారీ తగ్గింపు ధరతో పొందవచ్చు.

గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL :
లాస్ట్ జనరేషన్ పిక్సెల్ 9 ప్రో XL లాంచ్ ధర రూ.1,24,999 నుంచి రూ.84,999కు అందుబాటులో ఉంటుంది. కొనుగోలుదారులు తమ ఫోన్ ఎక్స్ఛేంజ్ వాల్యూను మినహాయించి రూ.40వేల వరకు ఆదా చేయొచ్చు.

​​శాంసంగ్ గెలాక్సీ S24 సేల్ ఆఫర్లు :
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా ​​శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ రూ.40వేల లోపు అమ్మకానికి రానుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3తో ముఖ్యంగా ఈ హ్యాండ్‌సెట్ 8GB ర్యామ్ + 128GB వేరియంట్ రూ.74,999కు లాంచ్ అయింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.64,999కు లభ్యమవుతోంది.

ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ డీల్ :
2024లో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ రూ.1,44,900 ప్రారంభ ధరకు లాంచ్ కాగా, రాబోయే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో రూ.89,999 తగ్గింపు ధరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌లో ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ.5వేలు బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తోంది. తద్వారా రూ.54,901 భారీ తగ్గింపుతో పొందవచ్చు.