Flipkart GOAT Sale : కొత్త AC కొంటున్నారా? ఈ బ్రాండ్ ఏసీలపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. చౌకైన ధరకే ఇలా ఇంటికి తెచ్చుకోండి..!

Flipkart GOAT Sale : కొత్త ఏసీ కొనేవారికి గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో GOAT సేల్‌లో భారీ తగ్గింపు ధరకే లభిస్తున్నాయి..

Flipkart GOAT Sale : కొత్త AC కొంటున్నారా? ఈ బ్రాండ్ ఏసీలపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. చౌకైన ధరకే ఇలా ఇంటికి తెచ్చుకోండి..!

Flipkart GOAT Sale

Updated On : July 14, 2025 / 2:08 PM IST

Flipkart GOAT Sale : కొత్త ఏసీ కోసం చూస్తున్నారా? వర్షాకాలమైనా ఉక్కపోతలు పోలేదు. తక్కువ ధరలో ఏసీ కొనాలనుకునే వారికి ఇదే బెస్ట్ టైమ్.. ఫ్లిప్‌కార్ట్‌లో GOAT సేల్ (Flipkart GOAT Sale) సమయంలో అతి తక్కువ ధరకే కొత్త ఏసీని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఈ సేల్ వివిధ రకాల ఎలక్ట్రానిక్స్‌పై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది.

ఎలక్ట్రానిక్స్‌తో పాటు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లు వంటి హోం అప్లియన్సెస్ కూడా భారీగా తగ్గాయి. ఈ సేల్ జూలై 12 నుంచి జూలై 17 వరకు అందుబాటులో ఉంటుంది. LG, Samsung, Voltas, Daikin వంటి బ్రాండ్‌ల నుంచి 1.5 టన్ ఎయిర్ కండిషనర్‌లపై అద్భుతమైన డీల్స్ అందిస్తోంది. ఏకంగా 50 శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. కొత్త ఏసీ సరసమైన ధరకే ఎలా కొనుగోలు చేయాలంటే?

LG 1.5 టన్ స్ప్లిట్ AC :
LG 1.5 టన్ స్ప్లిట్ ఏసీ ధర రూ. 36,490కు పొందవచ్చు. 3-స్టార్ ఎనర్జీ రేటింగ్‌ను కలిగి ఉంది. 6-ఇన్-1 కన్వర్టిబుల్ టెక్నాలజీని కలిగి ఉంది. ఈ ఏసీ డ్యూయల్ ఏఐ ఇన్వర్టర్‌పై పనిచేస్తుంది. అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. అదనంగా, ఈ మోడల్‌లో ఇన్-బిల్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంది. 53 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

Read Also : Samsung Galaxy S24 FE : వారెవ్వా.. బిగ్ డిస్కౌంట్.. ఈ శాంసంగ్ గెలాక్సీ ఫోన్ అతి తక్కువ ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

శాంసంగ్ 1.5 టన్ స్ప్లిట్ AC :
శాంసంగ్ స్ప్లిట్ ఏసీ రూ. 35,490 ధరకు అందిస్తుంది. ఈ మోడల్‌లో 3-స్టార్ ఎనర్జీ రేటింగ్, ఇన్వర్టర్ టెక్నాలజీ కూడా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఏసీ కొనుగోలుకు 37 శాతం వరకు తగ్గింపు కూడా పొందవచ్చు.

వోల్టాస్ 1.5 టన్ స్ప్లిట్ AC :
ఈ AC కేవలం రూ.34,990కే (Flipkart GOAT Sale) లభిస్తుంది. 46 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. 3-స్టార్ ఎనర్జీ రేటింగ్ ఉంది. ఆకర్షణీయమైన బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

డైకిన్ 1.5 టన్ AC :
డైకిన్ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ రూ. 37,490 ప్రారంభ ధరకు లభిస్తుంది. 35 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. 3-స్టార్ ఎనర్జీ రేటింగ్ కలిగి ఉంది. 48 డిగ్రీల వరకు టెంపరేచర్ వద్ద పనిచేసేలా రూపొందించింది.

మిడియా 1.5 టన్ స్ప్లిట్ AC :
మిడియా 1.5 టన్ స్ప్లిట్ ఏసీ కేవలం రూ. 32,490కే సొంతం చేసుకోవచ్చు. 47 శాతం వరకు భారీ డిస్కౌంట్ అందిస్తోంది. బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో వస్తుంది. ఈ మోడల్ 3-స్టార్ ఎనర్జీ రేటింగ్‌ను కలిగి ఉంది. 4-ఇన్-1 కన్వర్టిబుల్ కూలింగ్ AI టెక్నాలజీతో వస్తుంది.