Samsung Galaxy A26
Samsung Galaxy A26 5G : శాంసంగ్ అభిమానులకు అదిరే న్యూస్.. మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? అయితే, ఇది మీకోసమే. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్ కొనసాగుతోంది. ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ A26 5G ఫోన్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది.
ఈ సేల్ సమయంలో అనేక ఆఫర్లు, డిస్కౌంట్లను పొందవచ్చు. తద్వారా శాంసంగ్ ఫోన్ ఇంకా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ శాంసంగ్ ఫోన్ ధర, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శాంసంగ్ గెలాక్సీ A26 5G ధర, లభ్యత :
ఈ శాంసంగ్ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 27999కు ఆఫర్ చేస్తోంది. మీరు ఫ్లిప్‌కార్ట్‌లో 10శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఈ తగ్గింపు తర్వాత శాంసంగ్ 5జీ ధర రూ. 24,999 అవుతుంది. అయితే, ఈ 5జీ ఫోన్ ధరను మరింత తగ్గించవచ్చు. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ. 2వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
అలాగే, ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 5శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ కూడా ఉంది. రూ. 24వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. కండిషన్స్ కూడా అప్లయ్ అవుతాయి. అప్పుడే ఈ ఫోన్ తక్కువ ధరకు పొందవచ్చు. రూ. 2,778 నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ శాంసంగ్ 5జీ ఫోన్ మొత్తం 4 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ A26 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ శాంసంగ్ ఫోన్ FHD+ రిజల్యూషన్‌తో కూడిన 6.7-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. రిజల్యూషన్ 1080 x 2340 పిక్సెల్స్ కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఎక్సినోస్ 1380 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది.
స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ఉంది. కెమెరా ఫ్రంట్ సైడ్ ఎల్ఈడీ ఫ్లాష్‌తో పాటు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ప్రైమరీ కెమెరా OIS సపోర్ట్‌తో 50MP సెన్సార్. 8MP బ్యాక్ కెమెరా, 2MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
సెల్ఫీల కోసం 13MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. సెక్యూరిటీ విషయానికి వస్తే.. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, IP67 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.