Samsung Galaxy A35 5G
Samsung Galaxy A35 5G : శాంసంగ్ అభిమానుల కోసం అద్భుతమైన ఆఫర్.. సౌత్ కొరియా దిగ్గజం శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో తక్కువ ధరకే (Samsung Galaxy A35 5G) లభిస్తున్నాయి. మీరు కూడా ఈ బ్రాండ్ ఫోన్ కొనేందుకు చూస్తుంటే ఇదే సరైన సమయం. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సూపర్ వాల్యూ వీక్ డీల్ అందిస్తోంది.
ఈ సేల్ సందర్భంగా శాంసంగ్ గెలాక్సీ A35 5Gపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ శాంసంగ్ ఫోన్‌ను రూ.10 వేల తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. 50MP మెయిన్ కెమెరా కలిగి ఉంది. శాంసంగ్ గెలాక్సీ A35 5G ఫోన్ డీల్స్, ఆఫర్ల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
శాంసంగ్ గెలాక్సీ A35 5G ధర, డిస్కౌంట్ ఆఫర్ :
ఈ శాంసంగ్ 5G ఫోన్ (8GB/256GB) వేరియంట్ ధర రూ. 33,999కు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ సేల్ నుంచి 35శాతం తగ్గింపుతో పొందవచ్చు. ఆపై శాంసంగ్ ఫోన్ రూ. 21,999కే సొంతం చేసుకోవచ్చు.
బ్యాంక్ ఆఫర్ల కింద ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 1100 తగ్గింపు అందిస్తోంది. రూ. 21వేలు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. ఇందులో, మీకు ఎలాంటి ఈఎంఐ లేదా నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో లేదు.
ఈ శాంసంగ్ మొబైల్ ఫోన్ 6.6-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. రిఫ్రెష్ రేట్ 120Hzతో సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో ఎక్సినోస్ 1380 చిప్‌సెట్ ప్రాసెసర్ కలిగి ఉంది. డిస్‌ప్లే సెక్యూరిటీ కోసం గొరిల్లా గ్లాస్ విక్టస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా రన్ అవుతుంది. ఈ శాంసంగ్ ఫోన్ 8GB ర్యామ్, 256GB స్టోరేజీని కలిగి ఉంది.
కెమెరా సెటప్, బ్యాటరీ లైఫ్ :
కెమెరా, వీడియో క్వాలిటీ విషయానికి వస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 50MP, సెకండరీ కెమెరా 8MP, థర్డ్ కెమెరా 5MP ఉండగా, ఫ్రంట్ సైడ్ సెల్ఫీల కోసం 13MP కెమెరా కూడా ఉంది. పవర్ విషయానికి వస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో వస్తుంది.