Flipkart Sale Offer
Flipkart Sale Offer : ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో మీకు ఇష్టమైన స్మార్ట్‌ఫోన్‌ల నుంచి భారీ హోం అప్లియన్సెస్ వరకు సరసమైన ధరకు కొనుగోలు చేయొచ్చు.
ఫ్లిప్‌కార్ట్ కోట్లాది మంది కస్టమర్ల కోసం SASA LELE సేల్‌ను ప్రారంభించనుంది. ఈ సేల్ మే 2, 2025 నుంచి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో ప్రారంభమవుతుంది. అయితే, మీరు ఫ్లిప్‌కార్ట్‌లో ప్లస్ సభ్యులైతే.. ఒక రోజు ముందుగానే మే 1, 2025 నుంచి సేల్ అందుబాటులో ఉంటుంది.
SBIతో ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం :
ఈ సేల్ కోసం ఫ్లిప్‌కార్ట్ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. SBI క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్లపై కస్టమర్లు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఈ డిస్కౌంట్ ఫుల్ పేమెంట్ లేదా ఈఎంఐ కొనుగోలుపై రెండింటికీ అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ ఆఫర్‌లో కస్టమర్లు ఎక్స్ఛేంజ్ ఆఫర్, నో కాస్ట్ ఈఎంఐ రెండింటి సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లు 50 శాతం వరకు భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.
ఈ సేల్‌లో అనేక స్పెషల్ డీల్స్ :
చౌకైన ధరకే ఐఫోన్ కొనే ఛాన్స్ :
ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఫ్లిప్‌కార్ట్ (SASA LELE) సేల్ అద్భుతమైన ఛాన్స్ అందిస్తోంది. ఈ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. తద్వారా మీ డబ్బును చాలా ఆదా చేసుకోవచ్చు. ఈ సేల్‌లో ఐఫోన్ 14 సిరీస్, ఐఫోన్ 15 సిరీస్‌లలో భారీ ధర తగ్గింపులను పొందవచ్చు. ఐఫోన్ 16, ఐఫోన్ 16e మోడళ్లపై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లను పొందవచ్చు.
ఏసీలపై భారీ డిస్కౌంట్ ఆఫర్ :
వేసవిలో వేడి పెరిగేకొద్దీ ఏసీలకు డిమాండ్ కూడా పెరిగింది. మీరు కొత్త ఏసీ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. కొన్ని రోజులు వేచి ఉండండి. ఫ్లిప్‌కార్ట్ (SASA LELE) సేల్‌లో LG, Voltas, Blue Star, Samsung, Daikin వంటి బ్రాండెడ్ ఏసీలను చౌకగా ధరకే కొనుగోలు చేయొచ్చు. ఈ సేల్ ఆఫర్ ద్వారా మీరు 50 శాతం వరకు తగ్గింపుతో స్ప్లిట్ ఏసీ కొనుగోలు చేయొచ్చు.