Jio Offer : జియో ఆఫర్ అదిరింది.. ఈ రీఛార్జ్ ప్లాన్‌తో 72 రోజుల వ్యాలిడిటీ, 164GB హైస్పీడ్ డేటా, ఫ్రీగా హాట్‌స్టార్ చూడొచ్చు!

Jio Offers : జియో యూజర్ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. 72 రోజుల వ్యాలిడిటీతో పాటు 164GB హైస్పీడ్ డేటా, ఫ్రీ హాట్‌స్టార్ సబ్‌స్ర్కిప్షన్ కూడా పొందొచ్చు.

Jio Offer : జియో ఆఫర్ అదిరింది.. ఈ రీఛార్జ్ ప్లాన్‌తో 72 రోజుల వ్యాలిడిటీ, 164GB హైస్పీడ్ డేటా, ఫ్రీగా హాట్‌స్టార్ చూడొచ్చు!

Jio Recharge Plans

Updated On : April 27, 2025 / 1:02 PM IST

Jio Offer : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. జియో సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను ఆఫర్ చేస్తోంది. నెలవారీ రీఛార్జ్ ధరలు పెరిగిపోవడంతో యూజర్లు లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. జియో కూడా యూజర్లను దృష్టిలో పెట్టుకుని లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది.

Read Also : Samsung Galaxy Z Fold 6 : పండగ చేస్కోండి.. లక్ష ఖరీదైన శాంసంగ్ మడతబెట్టే ఫోన్.. అమెజాన్‌లో తక్కువ ధరకే.. ఫుల్ డిటెయిల్స్!

ఇప్పటికే జియో సర్వీస్ పోర్ట్‌ఫోలియోలో అనేక మార్పులను చేసింది. మీరు జియో సిమ్ యూజర్ అయితే ఈ సరికత్త రీఛార్జ్ ప్లాన్‌ మీకోసమే.. లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్‌లకు డిమాండ్ మేరకు యూజర్లకు తగినట్టుగా జియో లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్‌ల రేంజ్ విస్తరించింది. ఇప్పుడు జియో మరో సరికొత్త రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది.

72 రోజుల రీఛార్జ్ ప్లాన్‌ :
జియో కేవలం రూ.749 ధరకే 72 రోజుల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. 28 రోజుల ప్లాన్ బదులుగా 365 రోజుల ప్లాన్‌ అవసరయ్యే కస్టమర్లకు ఇది బెస్ట్ ఆప్షన్ ఈ 72 రోజుల ఆప్షన్‌తో వినియోగదారులు రెండు నెలలకు పైగా రీఛార్జ్‌ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ప్లాన్‌లో 72 రోజుల పాటు అన్ని లోకల్, STD నెట్‌వర్క్‌లలో అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ ఉంటుంది. అదనంగా, వినియోగదారులు మెసేజింగ్ కోసం ప్రతిరోజూ 100 ఫ్రీ ఎస్ఎంఎస్ పొందవచ్చు.

యూజర్లకు అదనపు డేటా :
తగినంత ఇంటర్నెట్ డేటాను అందించే ప్లాన్ కోసం చూస్తుంటే.. ఇదే బెస్ట్ ప్లాన్. జియో 72 రోజులలో మొత్తం 144GB రోజువారీ డేటాను అందిస్తుంది. కస్టమర్లు అదనంగా 20GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ మొత్తం వ్యవధికి మొత్తం 164GB డేటా అందిస్తుంది.

Read Also : Public Wi-Fi : ఫ్రీగా వస్తుందని పబ్లిక్ Wi-Fi తెగ వాడేస్తున్నారా? ఈ బిగ్ మిస్టేక్ అసలు చేయొద్దు.. ప్రభుత్వం హెచ్చరిక..!

అంతేకాకుండా, రూ.749 ప్లాన్ కొన్ని అద్భుతమైన బెనిఫిట్స్ అందిస్తుంది. జియో హాట్‌స్టార్‌కు 90 రోజుల ఫ్రీ సబ్‌స్క్రిప్షన్, 50GB ఏఐ క్లౌడ్ స్టోరేజ్ అందిస్తోంది. వినియోగదారులు మొత్తం వ్యాలిడిటీ వ్యవధిలో జియో టీవీకి ఫ్రీ యాక్సెస్‌ను కూడా పొందవచ్చు. అదనంగా, అర్హత కలిగిన యూజర్లు అన్‌లిమిటెడ్ 5G డేటా బెనిఫిట్స్ పొందవచ్చు.