Samsung Galaxy Z Fold 6 : పండగ చేస్కోండి.. లక్ష ఖరీదైన శాంసంగ్ మడతబెట్టే ఫోన్.. అమెజాన్‌లో తక్కువ ధరకే.. ఫుల్ డిటెయిల్స్!
Samsung Galaxy Z Fold 6 : శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫోల్డబుల్ ఫోన్ ధర భారీగా తగ్గింది. అమెజాన్‌లో ఈ మడతబెట్టే ఫోన్ ధర రూ.25,853కు తగ్గింది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Samsung Galaxy Z Fold 6
Samsung Galaxy Z Fold 6 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 లాంచ్‌కు ముందే శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 5G ప్రస్తుతం అమెజాన్‌లో అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్లతో కస్టమర్లు రూ.25,853 కన్నా ఎక్కువ తగ్గింపు పొందవచ్చు.
ఈ మడతబెట్టే ఫోన్ గత ఏడాది భారత మార్కెట్లో రూ.1,64,999 భారీ ధరతో లాంచ్ అయింది. డ్యూయల్ అమోల్డ్ ప్యానెల్, ట్రిపుల్ కెమెరా సెటప్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, గెలాక్సీ ఏఐ ఫీచర్లు మరిన్నింటిని అందిస్తుంది. మీ కోసం సరైన ఫోల్డబుల్ ఫోన్ కొనేందుకు ఇదే సరైన సమయం. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ధర డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ధర :
ప్రస్తుతం అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ధర రూ.1,27,896గా ఉంది. రూ.22వేలు భారీ తగ్గింపు తర్వాత HDFC వంటి ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో రూ.3,750 తగ్గించుకోవచ్చు. మీరు ఈ ఫోన్ ఈఎంఐలో కూడా కొనుగోలు చేయొచ్చు.
కస్టమర్లు నెలకు రూ.6,201 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లతో పొందవచ్చు. కొనుగోలుదారులు అమెజాన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా పాత ఫోన్ కూడా ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. ఈ డీల్‌పై రూ.71,300 వరకు వాల్యూ పొందవచ్చు. కచ్చితమైన విలువ మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్, వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.3-అంగుళాల హెచ్‌డీ ప్లస్ అమోల్డ్ కవర్ ప్యానెల్‌ను అందిస్తుంది. ఫోల్డ్ ఓపెన్ చేస్తే.. ఈ ఫోన్ 2,600 నిట్స్ గరిష్ట ప్రకాశంతో 7.6-అంగుళాల అమోల్డ్ ప్యానెల్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ 12GB ర్యామ్, 1TB వరకు స్టోరేజీతో స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 పవర్ పొందుతుంది.
ఈ శాంసంగ్ ఫోన్ 4,400mAh బ్యాటరీని కలిగి ఉంది. కొత్త డిజైన్‌తో పాటు కొత్త ఏఐ ఫీచర్లను వన్ యూఐ 7 అప్‌డేట్ అందుకుంటోంది. ఈ శాంసంగ్ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 12MP అల్ట్రా-వైడ్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 10MP టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఈ ఫోన్ 10MP, 4MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది.