Apple iPhone 14 : ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. చౌకైన ధరకే ఆపిల్ ఐఫోన్ 14 కొనేసుకోండి.. ఈ డిస్కౌంట్ మళ్లీ జన్మలో రాదు!

Apple iPhone 14 : ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్ అందిస్తోంది. ఆపిల్ ఐఫోన్ 14 భారీ తగ్గింపు ధరకే అందిస్తోంది. ఐఫోన్ 17 సిరీస్ రాకముందే పాత ఐఫోన్లపై తగ్గింపు ధరకే ఆఫర్ చేస్తోంది.

Apple iPhone 14 : ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. చౌకైన ధరకే ఆపిల్ ఐఫోన్ 14 కొనేసుకోండి.. ఈ డిస్కౌంట్ మళ్లీ జన్మలో రాదు!

Apple iPhone 14

Updated On : April 26, 2025 / 5:09 PM IST

Apple iPhone 14 : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? అయితే మీకోసం అతి తక్కువ ధరకే ఐఫోన్ 14 లభ్యమవుతోంది. ఫ్లిప్‌కార్ట్ ఈ అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. ఆపిల్ కంపెనీ ఈ ఏడాదిలో కొత్త ఐఫోన్ 17 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ ఐఫోన్ లాంచ్ కాకముందే కంపెనీ పాత మోడళ్ల ధరలను భారీగా తగ్గించింది. మీరు కూడా ఐఫోన్‌ను కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఇది బెస్ట్ టైమ్.

Read Also : Samsung Galaxy S25 Edge : పిచ్చెక్కించే ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ వస్తోంది.. లాంచ్‌‌కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్..!

మీరు ఐఫోన్ 14ను ఎక్కడ కొనుగోలు చేయాలంటే.. ఈ ఫోన్‌ను ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. 256GB స్టోరేజ్ వేరియంట్‌ను సరసమైన ధరకే సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు.. అనేక రకాల ఆఫర్లు, డిస్కౌంట్లతో కూడా కొనుగోలు చేయవచ్చు. తద్వారా ఐఫోన్ ధర మరింత తగ్గుతుంది. అసలు ధర కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలో వివరంగా చూద్దాం..

ఐఫోన్ 14 డిస్కౌంట్ ఆఫర్ :
ఐఫోన్ 14 మోడల్ 256GB వేరియంట్ ధర రూ. 59,900కు లభిస్తోంది. మీరు ఫ్లిప్‌కార్ట్ నుంచి 8శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ తగ్గింపు తర్వాత ఐఫోన్ 14 ధర రూ. 54999గానే ఉంటుంది. ఈ ఫోన్ ధరను మరింత తగ్గించవచ్చు.

బ్యాంక్ ఆఫర్ ద్వారా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా రూ. 52030 తగ్గింపును పొందవచ్చు. కండిషన్స్ అప్లయ్ అవుతాయని గమనించాలి. అప్పుడే మీరు ఈ పూర్తి వాల్యూను పొందగలరు. మీకు కావాలంటే రూ. 2637 ఈఎంఐ ఆప్షన్‌తో కూడా కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్ 14 ప్రత్యేక ఫీచర్లు :
ఈ మొబైల్ ఫోన్ 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేతో వస్తుంది. రిఫ్రెష్ రేట్ 60 Hz సపోర్ట్ కలిగి ఉంది. ఈ ఫోన్ రిజల్యూషన్ 2532×1170 పిక్సెల్స్ కలిగి ఉంది. అదే సమయంలో ఈ ఐఫోన్ iOS 16 ఆధారంగా పనిచేస్తుంది. అంతేకాదు.. ఈ ఐఫోన్ 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, A15 బయోనిక్ చిప్‌సెట్‌తో వస్తుంది.

Read Also : Airtel Recharge : ఎయిర్‌టెల్ యూజర్లకు పండగే.. కొత్త ‘ఆల్ ఇన్ వన్’ రీఛార్జ్ ప్లాన్.. భారత్ సహా 189 దేశాల్లో వాడొచ్చు.. 365 రోజులు అన్నీ ఫ్రీ..!

కెమెరా క్వాలిటీ, బ్యాటరీ బ్యాకప్ :
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో 12MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. మీరు సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ 12MP కెమెరా ఉంటుంది. మీరు అద్భుతమైన ఫొటోలను క్లిక్ చేయవచ్చు. అదే సమయంలో ఈ ఫోన్ పవర్ కోసం 3279mAh బ్యాటరీ సపోర్టును అందిస్తుంది. 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. IP68 నిరోధకతను కలిగి ఉంది.