FlixBus Services in India : భారత్‌లో ఫ్లిక్స్‌బస్ సర్వీసులు ప్రారంభం.. ప్రధాన నగరాల్లో ప్రయాణ ఆప్షన్లు.. ట్రావెల్ రూట్లు, టికెట్ల ధరలివే!

FlixBus Services : ఫ్లిక్స్‌బస్ కంపెనీ దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు, మార్గాలను కలుపుతూ అనేక ప్రయాణ ఆప్షన్లను అందిస్తోంది. ఈ సర్వీసుల్లో ట్రావెల్ రూట్లు, టికెట్ల ధరలకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

FlixBus Services in India : భారత్‌లో ఫ్లిక్స్‌బస్ సర్వీసులు ప్రారంభం.. ప్రధాన నగరాల్లో ప్రయాణ ఆప్షన్లు.. ట్రావెల్ రూట్లు, టికెట్ల ధరలివే!

FlixBus is now in India_ Check travel routes, ticket prices and more details

FlixBus Services in India : ట్రావెల్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్ ఫ్లిక్స్‌బస్ భారత మార్కెట్లో అధికారికంగా సర్వీసులను ప్రారంభించింది. 42 దేశాల నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న ఈ కంపెనీ భారత్‌లోకి ప్రవేశిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద బస్ మార్కెట్ కలిగిన ఫ్లిక్స్‌బస్.. అగ్రశ్రేణి భద్రతా ప్రమాణాలతో పాటు పోటీ ధరలకు అనుకూలమైన ప్రయాణ ఎంపికలను అందిస్తోంది. తద్వారా ఇంటర్‌సిటీ ప్రయాణీకుల రవాణాను మార్చాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also : Vivo V30 Launch : 50ఎంపీ సెల్ఫీ కెమెరాతో వివో V30 ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే..!

ఫ్లిక్స్‌ సీఈఓ ఆండ్రి మాట్లాడుతూ.. ‘ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద బస్ మార్కెట్‌లలో ఒకటైన మా ఉనికిని గుర్తించడం ద్వారా భారత మార్కెట్లోకి ఫ్లిక్స్‌బస్ సర్వీసులను విస్తరించడం పట్ల సంతోషంగా ఉంది. భారత్‌లో స్థిరమైన, సురక్షితమైన సరసమైన ధరలకే ప్రయాణ సదుపాయాలను అందించడమే మా లక్ష్యం’ అని పేర్కొన్నారు.

ఫ్లిక్స్‌బస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సూర్య ఖురానా మాట్లాడుతూ.. భద్రత, సౌకర్యం, తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణాలను అందించడం ద్వారా భారత మార్కెట్లో సేవలను పరిచయం చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ట్రాఫిక్ రద్దీ, ఉద్గారాలను తగ్గించడానికి వృద్ధి, సామర్థ్యంపై దృష్టి సారిస్తూ, స్థానిక ఆపరేటర్‌లతో సహకారంపై విజయం ఆధారపడి ఉంటుందని చెప్పారు.

FlixBus is now in India_ Check travel routes, ticket prices and more details

FlixBus is now in India

ఫ్లిక్స్‌బస్ ఏ నగరాలు లక్ష్యమంటే? :
కంపెనీ న్యూఢిల్లీ, హిమాచల్, జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ అంతటా ప్రధాన నగరాలు, అనేక మార్గాలను కలుపుతుంది.

ఫ్లిక్స్‌బస్ టిక్కెట్లు ధర ఎంత?, ఎలా పొందాలంటే? :
ఈ నెల (ఫిబ్రవరి 1) నుంచే ఫ్లిక్స్‌బస్ ఇండియా నుంచి టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ మార్గాలు కేవలం రూ. 99 ప్రత్యేక ధరతో ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభమవుతాయి. ఈ మార్గాలు ఢిల్లీని అయోధ్య, చండీగఢ్, జైపూర్, మనాలి, హరిద్వార్, రిషికేశ్, అజ్మీర్, కత్రా, డెహ్రాడూన్, గోరఖ్‌పూర్, వారణాసి వంటి కీలక ప్రాంతాలతో కలుపుతాయి. జోధ్‌పూర్, ధర్మశాల, లక్నో అమృత్‌సర్. నెట్‌వర్క్‌లో 59 స్టాప్‌లు, మొత్తం 200 కనెక్షన్‌లు ఉంటాయని కంపెనీ తెలిపింది.

ఢిల్లీని కీలకమైన గమ్యస్థానాలకు కలిపే మార్గాలివే :  

    • అయోధ్య
    • చండీగఢ్
    • జైపూర్
    • మనాలి
    • హరిద్వార్
    • రిషికేశ్
    • అజ్మీర్
    • కత్రా
    • డెహ్రాడూన్
    • గోరఖ్‌పూర్
    • వారణాసి
    • జోధ్‌పూర్
    • ధర్మశాల
    • లక్నో
    • అమృత్‌సర్

Read Also : Vi Business IoT Smart Central : అత్యంత అధునాతనమైన ఐఓటీ స్మార్ట్ సెంట్రల్ ప్రారంభించిన విఐ బిజినెస్