Mumbai : లోన్ తీసుకున్న వారికి SBI చాక్లెట్లు పంపుతోంది. అదేంటి? అని ఆశ్చర్యపోతున్నారా? నెలవారి EMI సకాలంలో చెల్లించని వారికి గుర్తు చేయడం కోసం ఈ కొత్త విధానం అమలు చేయబోతోందట.
SBI PO Recruitment : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పీఓ పోస్టుల భర్తీ
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తులు EMI సకాలంలో చెల్లించలేని సందర్భంలో ఇటీవలకాలంలో రిమైండర్ కాల్‌కు సమాధానం ఇవ్వట్లేదని తేలిందట. ఇలాంటి నేపథ్యంలో వారికి చెప్పకుండా ఇంటికి వెళ్లి కలవడమే ఉత్తమమైన మార్గంగా SBI కొత్త మార్గాన్ని చేపట్టబోతోంది. రుణం తీసుకున్న వారికి తిరిగి చెల్లించే బాధ్యతను గుర్తు చేసే వినూత్న విధానాన్ని ప్రయోగాత్మకంగా రూపొందిస్తున్నామని మేనేజింగ్ డైరెక్టర్ అశ్విని కుమార్ తివారీ చెప్పారు. ఎవరైతే సకాలంలో రుణాన్ని చెల్లించరో వారి ఇంటికి చాక్లెట్ల ప్యాక్ తీసుకుని ప్రతినిధులు సందర్శిస్తారని EMI ల గురించి వారికి గుర్తు చేస్తారని ఆయన చెప్పారు.
SBI : ఏటీఎం కార్డు లేకుండా అన్ని ఏటీఎంల నుంచి డబ్బు తీసుకోవచ్చు .. ఎలాగంటే..
ఈ చర్య కేవలం పైలట్ దశలోనే ఉందని 15 రోజుల క్రితమే దీనిని అమలు చేసామని విజయవంతమైతే అధికారికంగా ప్రకటిస్తామని అశ్విని కుమార్ తివారీ చెప్పారు. SBI రిటైల్ బుక్‌లో రూ.12 లక్షల కోట్ల వ్యక్తిగత, ఆటో, గృహ, విద్యా రుణాలు ఉన్నాయి. జూన్ నాటికి రూ. 6.3 లక్షల కోట్లకు పైగా గృహ రుణాలు ఉన్నాయి. తనఖాలపై రుణాలను ఇచ్చే అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.