SBI PO Recruitment : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పీఓ పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అర్హతల విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు చేసుకునే వారి కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్టంగా 30 ఏళ్లు ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీలో ఉన్న వారికి గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

SBI PO Recruitment
SBI PO Recruitment : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దేశంలోనే అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2000 పీఓ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Sanatana remark : ఉదయనిధి స్టాలిన్‌ను చెప్పుతో కొడితే రూ.10 లక్షల బహుమానం : హిందూ సంస్థ పోస్టర్
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అర్హతల విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు చేసుకునే వారి కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్టంగా 30 ఏళ్లు ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీలో ఉన్న వారికి గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి దరఖాస్తు రుసుముగా రూ. 300. చెల్లించాల్సి ఉంటుంది. SC/ST/PwBD కేటగిరీల అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
కేటగిరీల వారీగా పోస్టుల ఖాళీలను పరిశీలిస్తే ఎస్సీ- 300, ఎస్టీ- 150, ఓబీసీ- 540, ఈడబ్ల్యూఎస్- 200, యూఆర్- 810 చొప్పున ఖాళీలు ఉన్నాయి. ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో చేపడతారు. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
READ ALSO : CPI Narayana : రాజకీయాల్లో అన్ని అర్థరాత్రే జరుగుతుంటాయి ఇది కూడా అంతే : సీపీఐ నారాయణ
ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లోని చీరాల, చిత్తూరు ,ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ లో ఏర్పాటు చేశారు. మెయిన్స్ పరీక్ష కేంద్రాలు గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ లో ఉన్నాయి.
అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 21, 2023న దరఖాస్తు గడువు ముగుస్తుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; అధికారిక వెబ్‌సైట్ sbi.co.in పరిశీలించగలరు.
READ ALSO : MP Gorantla Madhav: సీఎం జగన్‌పై చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదు.. గుత్తిలో సభను అడ్డుకుంటాం..
దరఖాస్తు చేసే విధానం ;
స్టెప్ 1: ముందుగా SBI అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
స్టెప్ 2: అనంతరం రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేయాలి. SBI అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2023 అనే ఆప్షన్ కు వెళ్ళాలి.
స్టెప్ 3: అక్కడ ఉన్న లింక్‌ని ఎంచుకోవాలి.
స్టెప్ 4: అక్కడ మీ యొక్క వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి.
స్టెప్ 5: ఫీజు చెల్లించిన తరువాత దరఖాస్తు ఫారమ్ ను సమర్పించాలి.
స్టెప్ 6: అనంతరం అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకొని.. ప్రింట్ అవుట్ తీసుకోండి.