CPI Narayana : రాజకీయాల్లో అన్ని అర్థరాత్రే జరుగుతుంటాయి ఇది కూడా అంతే : సీపీఐ నారాయణ

రాజకీయాల్లో అన్నీ అర్థరాత్రి సమయంలోనే జరుగుతాయి.ఇది కూడా అటువంటిదేనని..అప్పట్లో ఇందిరా గాంధీ కూడా ఎమర్జన్సీని అర్థరాత్రే ప్రకటించారని గుర్తు చేశారు సీపీఐ నారాయణ.

CPI Narayana : రాజకీయాల్లో అన్ని అర్థరాత్రే జరుగుతుంటాయి ఇది కూడా అంతే : సీపీఐ నారాయణ

CPI Narayana

Telangana Elections : తెలంగాణలో త్వరలో జరుగబోతున్న ఎన్నికల్లో పొత్తుల గురించి చర్చ జరుగుతోంది. దీంట్లో భాగంగా కాంగ్రస్ తో సీపీఐ పార్టీ పొత్తు పెట్టుకుంటుంది అనే వార్తలు వస్తున్న క్రమంలో సీపీఐ సీనియర్ నేత నారాయణ కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ తో బుధవారం రాత్రి సమయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో తనదైన శైలిలో మాట్లాడారు. రాజకీయాల్లో అన్నీ అర్థరాత్రి సమయంలోనే జరుగుతాయని..ఇది కూడా అటువంటిదేనని..అప్పట్లో ఇందిరా గాంధీ కూడా ఎమర్జన్సీని అర్థరాత్రే ప్రకటించారని గుర్తు చేశారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తారా..? అని మీడియా అడిగిన ప్రశ్నలకు నారాయణ సమాధానమిస్తు..జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నాం అంటూ ఇండియా కూటమిలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో కలిసి పనిచేస్తున్నాం కాబట్టి తెలంగాణలో కూడా కలిసి పనిచేయాలని అనుకుంటున్నామని వెల్లడించారు.

Telangana : కాంగ్రెస్‌లో భారీ చేరికల ప్లాన్.. ఇంతకీ చేరుతున్నది ఎవరెవరు? ముహూర్తం ఎప్పుడు?

కాగా.. తెలంగాణలో కాంగ్రెస్ తో కలిసి పనిచేయటానికి సీపీఐ సంసిద్ధతగా ఉన్నట్లుగా తెలుస్తోంది. సీపీఐ నేత నారాయణ కేసీ వేణుగోపాల్ తో జరిపిన చర్చల సారాంశం కూడా అదేనని అర్థమవుతోంది. తాజ్ కృష్ణలో నారాయణ వేణుగోపాల్ తో జరిపిన చర్చల్లో తమకు ఎన్ని సీట్లు ఇస్తారు అనేదానిపై జరిగినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో పొత్తులతో పాటు, గెలుపు వంటి ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చాయని సమాచారం. అలాగే 2024లో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ కార్చారణ సైతం హైదరాబాద్ వేదికగానే సిద్ధం కానున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న సమావేశాలే ఇందుకు కారణమనిపిస్తోంది. తెలంగాణలో గెలుపు కోసం కాంగ్రెస్ అధినేతలు రాష్ట్రంలో పర్యటనలు, సభలు, సమావేశాలు అన్నీ ఇక షురు కానున్నట్లుగా తెలుస్తోంది.

Telangana Congress: కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన వాయిదా.. కారణమేంటి?