MP Gorantla Madhav: సీఎం జగన్‌పై చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదు.. గుత్తిలో సభను అడ్డుకుంటాం..

ప్రజలను రెచ్చగొట్టడానికి తనను అరెస్ట్ చేస్తారంటూ చంద్రబాబు ముందే మాట్లాడుతున్నాడు. చట్టాన్ని రాజకీయం చేసిన ఘనత చంద్రబాబుది అంటూ మాధవ్ విమర్శించారు.

MP Gorantla Madhav: సీఎం జగన్‌పై చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదు.. గుత్తిలో సభను అడ్డుకుంటాం..

Gorantla Madhav

MP Gorantla Madhav Warning To Chandrababu : మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గుత్తిలో చంద్రబాబు సభను అడ్డుకుంటామని హెచ్చరించారు. గురువారం మాధవ్ మాట్లాడుతూ.. 75ఏళ్ల చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు..
ఎన్నో ఏళ్ళు ప్రతిపక్ష నేతగా పని చేశారు.. హోదాగా ఉండాల్సింది పోయి నీచమైన మాటలు ఎలా మాట్లాడావు అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పుట్టుకే తప్పుడు పుట్టుక అన్నావు.. అది నీకు తగునా చంద్రబాబు అంటూ నిలదీశారు. చంద్రబాబును ఏమైనా అంటే ముసలి కన్నీరు పెట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబు జగన్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి. ముక్కును నేలకు రాయాలి.. లేని పక్షంలో జిల్లా దాటి వెళ్లలేవు చంద్రబాబు అంటూ గోరంట్ల మాధవ్ హెచ్చరించారు.

Chandrababu: నన్ను అరెస్టు చేస్తారేమో..! టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

రైతులకు ఇచ్చే కరెంటుపై చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని వైసీపీ ఎంపీ మాధవ్ అన్నారు. గతంలో కరెంట్‌కోసం రైతులు ఆందోళనచేస్తే గుర్రాలతో తొక్కించి అరాచకం చేసిన ఘనత చంద్రబాబుది. బాబు వస్తే జాబు వస్తుంది అన్నావ్.. నిరుద్యోగులకు పంగనామం పెట్టావ్ అంటూ విమర్శించారు. దొంగఓట్ల వ్యవహారం చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉంది. అసలు.. దొంగ ఓట్ల సృష్టికర్త చంద్రబాబు కాదా? తెలంగాణలో ఓటుకు నోటు వ్యవహారంలో ఉన్నావ్ కదా.. దొంగే దొంగ అన్నట్లు ఉంది చంద్రబాబు తీరు అంటూ గోరంట్ల విమర్శించారు.

Chandrababu : ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నిస్తున్నాననే తప్పుడు ఆరోపణలు

చిత్తూరు జిల్లాలో కార్యకర్తలను రెచ్చగొట్టి లా అండ్ ఆర్డర్ లేదంటావా అంటూ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను రెచ్చగొట్టడానికి తనను అరెస్ట్ చేస్తారంటూ చంద్రబాబు ముందే మాట్లాడుతున్నాడు. చట్టాన్ని రాజకీయం చేసిన ఘనత చంద్రబాబుది అంటూ మాధవ్ విమర్శించారు. సీఎం జగన్ పై చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదు. నీ సభ దగ్గర నిరసన చేస్తాం.. గుత్తిలో సభను అడ్డుకొని తీరుతాం అంటూ గోరంట్ల మాధవ్ అన్నారు.