Aadhaar Card : ఆధార్ కార్డ్ వినియోగదారులకు పెద్ద ఉపశమనం.. మరోసారి గడువు పెంపు

ఉచిత సేవలు మై ఆధార్ (My Aadhaar) పోర్టల్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. పేరు, పెట్టిన తేదీ, చిరునామా, ఇతర వివరాల్లో

Aadhaar

Aadhaar Free Update Deadline Extend : ఆధార్ కార్డ్ హోల్డర్స్ కు భారత విశిష్ట గుర్తింపు ప్రాదికార సంస్థ (UIDAI) మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు నేటితో ముగియనుండగా.. ఉడాయ్ ఆ గడువును మరోసారి పెంచుతూ ప్రకటించింది. ఈ మేరకు ఉడాయ్ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. 2024 డిసెంబర్ 14వ తేదీ వరకు ఉచితంగా ఆధార్ అప్ డేట్ చేసుకునేందుకు గడువును పెంచింది. దీంతో ఆధార్ కార్డులో చిరునామా మార్పులు చేసుకోవాలనుకునే వారు డిసెంబర్ 14వ తేదీ వరకు ఆన్ లైన్ లో ఉచితంగా అప్ డేట్ చేసుకోవచ్చు.

Also Read : Gold Price Today : బంగారం ధర పైపైకి.. హైదరాబాద్, విజయవాడలో ఇవాళ్టి ధరలు ఇలా..

ఉచిత సేవలు మై ఆధార్ (My Aadhaar) పోర్టల్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. పేరు, పెట్టిన తేదీ, చిరునామా, ఇతర వివరాల్లో తప్పులు నమోదైనా, మార్పులు చేయాలన్నా ఉచితంగా చేసుకోవచ్చు. ఉచిత గడువు ముగిశాక మునుపటిలాగే ఆధార్ కేంద్రాల్లో రూ.50 చెల్లించి అప్ డేట్ చేసుకోవచ్చు.