Reliance Industries AGM 2025
AGM 2025: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎం 2025లో జియో బ్రాండ్ కింద కొత్త టెక్నాలజీ ప్రొడక్ట్‌లను ఆవిష్కరించారు. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (ఆర్జేఐఎల్) చైర్మన్ ఆకాశ్ అంబానీ ఏజీఎంలో మాట్లాడుతూ.. “జియో నా ప్రొఫెషనల్ ప్రయాణం ప్రారంభమైన ప్లేస్.
ఇక్కడే సవాళ్లు ఎదుర్కొన్నాను, పాఠాలు నేర్చుకున్నాను, నా లక్ష్యాన్ని కనుగొన్నాను. ఇది స్వతంత్ర కంపెనీగా ఎదగడం నాకు ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఇప్పుడు జియో 500 మిలియన్‌ల కస్టమర్లకు సేవలందిస్తోంది. ఇది అమెరికా, యూకే, ఫ్రాన్స్ జనాభా కంటే ఎక్కువ” అని అన్నారు.
ఏజీఎంలో ఆకాశ్ అంబానీ జియోఫ్రేమ్స్‌ను పరిచయం చేశారు. దీన్ని ఏఐ బేస్డ్ వేరబుల్ ప్లాట్‌ఫాం, ఎకోసిస్టమ్ అని, “మేడ్ ఫర్ ఇండియా” అని చెప్పారు. ఈ డివైస్ ప్రారంభంలోనే పలు భారతీయ భాషలకు సపోర్టు చేస్తోంది. జియో మల్టీలింగ్వల్ ఏఐ వాయిస్ అసిస్టెంట్‌తో నడుస్తుంది. “ఇది హ్యాండ్స్-ఫ్రీ ఏఐ అసిస్టెంట్, భారత విధానాలకు సరిపడేలా రూపొందించాం” అని అంబానీ అన్నారు. జియోఫ్రేమ్స్‌తో వినియోగదారులు హెచ్‌డీ ఫొటోలు తీయొచ్చు, వీడియోలు రికార్డ్ చేయొచ్చు, లైవ్ చేసుకోవచ్చు, వెంటనే జియో ఏఐ క్లౌడ్‌లో స్టోర్ చేయొచ్చు” అని తెలిపారు.
ఆకాశ్ అంబానీ జియో పీసీని కూడా ప్రకటించారు. ఇది టీవీ లేదా స్క్రీన్‌ను పూర్తి ఫీచర్లున్న ఏఐ-రెడీ కంప్యూటర్‌గా మార్చేస్తుందని చెప్పారు. కీబోర్డ్‌ను జియో సెట్-టాప్ బాక్స్‌కు కనెక్ట్ చేస్తే వినియోగదారులు జియో క్లౌడ్ బేస్డ్ వర్చువల్ కంప్యూటర్‌ను వాడొచ్చన్నారు. జియోపీసీ క్లౌడ్‌లో ఉన్నందువల్ల ఎప్పుడూ అప్‌డేట్‌గా ఉంటుంది, సెక్యూర్‌గా ఉంటుంది, అవసరాల ప్రకారం మెమరీ, స్టోరేజ్, కంప్యూటింగ్ పవర్‌ను రిమోట్‌గా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు” అని అంబానీ అన్నారు
రిలయన్స్ రియాను కూడా పరిచయం చేసింది. ఇది జియోస్టార్ కోసం కొత్త వాయిస్-ఎనేబుల్‌డ్ సెర్చ్ అసిస్టెంట్. కంటెంట్ డిస్కవరీని సులభతరం చేయడానికి రియా షోలు, మూవీస్, సీజన్లు, ఎపిసోడ్‌లను వాయిస్ కమాండ్ల ఆధారంగా కరెక్ట్‌గా అందిస్తుంది. “వేల గంటల కంటెంట్ ఉన్న ప్రపంచంలో ఏమి చూడాలో కనుగొనడం కష్టతరంగా ఉంటుంది. అందుకే రియాను తీసుకొచ్చాం. ఇది మీ కొత్త వాయిస్-ఎనేబుల్‌డ్ సెర్చ్ అసిస్టెంట్. స్క్రోలింగ్ లేదు. సెర్చింగ్ లేదు. నోటితో అడగండి చాలు” అని అంబానీ అన్నారు. (AGM 2025)
మరో ముఖ్యమైన ప్రకటన వాయిస్ ప్రింట్. దీన్ని ఇమర్శివ్ స్టోరీటెల్లింగ్‌లో నెక్స్ట్ స్టెప్‌గా వర్ణించారు. “మొదటిసారి జియోహాట్‌స్టార్ యాప్‌లో మీరు క్రీడలు, ఎంటర్‌టైన్‌మెంట్‌ను మీ ఇష్టమైన భారతీయ భాషలో ఆస్వాదించొచ్చు. ఏఐ వాయిస్ క్లోనింగ్, లిప్-సింక్ టెక్నాలజీ శక్తితో మీ ఇష్టమైన తారలు కేవలం డబ్బింగ్ కాకుండా, తమ సొంత స్వరంతో, మీ భాషలో, పర్ఫెక్ట్ లిప్-సింక్‌తో స్క్రీన్‌పై మాట్లాడతారు. అది క్రికెట్ మ్యాచ్ కావచ్చు లేదా బ్లాక్‌బస్టర్ మూవీ కావచ్చు” అని అంబానీ అన్నారు.