చమురు మంట : హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 80!

  • Publish Date - October 2, 2019 / 04:11 AM IST

చమురు ధరలు దిగిరావంటున్నాయి. ఇప్పటికే పెరుగుతున్న ధరలతో సతమతమౌతున్నారు ప్రజలు. వరుసగా గత పది రోజులుగా పెరుగుతున్న ధరలు అక్టోబర్ 02వ తేదీ మంగళవారం కూడా మరింత అధికమైంది. లీటర్ పెట్రోల్ రూ. 80కి చేరువైంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 19 పైసలు పెరిగి రూ. 74.61కి చేరుకోగా..డీజిల్ ధర మరో 16 పైసలు పెరిగి.. రూ. 67.49కి చేరుకుంది.

చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ. 77.50, డీజిల్ రూ. 71.30, కోల్ కతాలో పెట్రోల్ రూ. 77.23, డీజిల్ రూ. 69.85, ముంబైలో పెట్రోల్ రూ. 80.21, డీజిల్ రూ. 70.76గా ఉంది. అలాగే హైదరాబాద్ పెట్రోల్ ధర రూ. 80కి చేరువైంది. లీటర్ ధర 14 పైసలు అధికమై రూ. 79.25కి చేరుకుంది. డీజిల్ 12 పైసలు అధికమై రూ. 73.51గా ఉంది. గత పది రోజుల్లో పెట్రోల్ రూ. 1.58, డీజిల్ రూ. 1.25 అధికమయ్యాయి. 

నగరం పెట్రోల్ డీజిల్
చెన్నై రూ. 77.50 రూ. 71.30
ఢిల్లీ రూ. 74.61  రూ. 67.49
కోల్ కతా రూ. 77.23 రూ. 69.85
ముంబై రూ. 80.21 రూ. 70.76
హైదరాబాద్ రూ. 79.25 రూ. 73.51