Gautam Adani : భారత అత్యంత ధనవంతుడిగా గౌతమ్ అదానీ.. హురున్ జాబితాలో అగ్రస్థానం.. ముఖేష్ అంబానీకి రెండో స్థానం!

Gautam Adani : గత ఐదేళ్లలో భారత్‌లో బిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం భారత్‌లో బిలియనీర్ల సంఖ్య 334 మందికి చేరినట్టు నివేదిక పేర్కొంది. 2023లో ఏకంగా 29 శాతం మంది బిలియనీర్లుగా అవతరించారు.

Gautam Adani Replaces Mukesh Ambani ( Image Source : Google )

Gautam Adani : ప్రముఖ దేశీయ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ అత్యంత ధనవంతుడిగా అవతరించారు. భారతీయ సంపన్నుల జాబితాలో మరోసారి అదానీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. తద్వారా గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం ముఖేష్ అంబానీని అధిగమించి రూ. 11.6 లక్షల కోట్ల సంపదతో 2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో అగ్రస్థానంలో నిలిచారు. తాజాగా వెలువ‌డిన‌ ధ‌న‌వంతుల జాబితాలో రూ. 10.14 లక్షల కోట్ల సంపదతో అంబానీ కుటుంబం రెండో స్థానంలో నిలిచింది.

Read Also : Anil Ambani : అనగనగా ఇద్దరు అన్నదమ్ములు.. ఒకరేమో కుబేరుడు, ఇంకొకరు దివాలా!

2020 ఏడాదిలో అదానీ 4వ స్థానంలో ఉన్నారు. గత ఏడాది కాలంలో అదానీ సంపద 95 శాతం పెరిగింది. కేవలం ఒక్క ఏడాదిలోనే గౌతమ్ అదానీ సంపద రెట్టింపు స్థాయికి చేరుకుందని హురూన్ ఇండియా రిచ్ లిస్ట్‌ నివేదిక వెల్లడించింది. గత ఐదేళ్లలో భారత్‌లో బిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం భారత్‌లో బిలియనీర్ల సంఖ్య 334 మందికి చేరినట్టు నివేదిక పేర్కొంది. 2023లో ఏకంగా 29 శాతం మంది బిలియనీర్లుగా అవతరించారు.

అగ్రస్థానంలో ఆదానీ.. 95 శాతం సంపద పెరుగుదల :
“హిండెన్‌బర్గ్ నివేదిక ప్రకారం.. 62ఏళ్ల గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం ఈ ఏడాది ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే.. ఆయన సంపదలో 95శాతం పెరుగుదల కనిపించింది. వారి మొత్తం సంపద రూ. 1,161,800 కోట్లకు చేరుకుంది. అదానీ గత ఐదేళ్లలో టాప్ 10లోపు అత్యధిక సంపద వృద్ధిని నమోదు చేసింది. సవాళ్లు ఉన్నప్పటికీ రూ. 1,021,600 కోట్లకు చేరుకుంది” హురున్ రిచ్ లిస్ట్ పేర్కొంది.

గత ఏడాదిలో అన్ని అదానీ గ్రూప్ కంపెనీలు షేర్ల ధరలు గణనీయంగా పెరిగాయి. ఉదాహరణకు.. వినియోగ స్థాయిలు, కొత్త పోర్ట్‌లు, కంటైనర్ టెర్మినల్స్ ప్రతిపాదిత కొనుగోలు కారణంగా అదానీ పోర్ట్స్ 98శాతం పెరుగుదలను చవిచూసింది. ఇంతలో, కంపెనీలు-అదానీ ఎనర్జీ, అదానీ గ్యాస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ పవర్-షేరు ధరలో సగటున 76శాతం వృద్ధిని సాధించింది.

ఎమ్ఎస్‌సీఐ ఆగస్టు 2024 రివ్యూలో అదానీ గ్రూప్ సెక్యూరిటీలపై పరిమితులను ఎత్తివేయాలని నిర్ణయించింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్ వంటి కీలక స్టాక్‌లకుఈ ఏడాదిలో ప్రమోటర్ గ్రూప్‌లోని ఫ్యామిలీ ట్రస్ట్, అంతర్జాతీయ కంపెనీల సంపదను పెంచిందని నివేదిక తెలిపింది.

భారత్‌లో 334కు చేరిన బిలియనీర్లు :
జూలై 31, 2024న స్నాప్‌షాట్ ఆధారంగా నివేదిక జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 10.14 లక్షల కోట్ల సంపదతో అంబానీ రెండో స్థానానికి పరిమితమయ్యారు. దేశంలో బిలియనీర్ల సంఖ్య రికార్డు స్థాయిలో 334కు చేరుకుందని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. చైనా బిలియనీర్ల సంఖ్య 25శాతం క్షీణించినప్పటికీ, భారత్ 29శాతం పెరుగుదలను చవిచూస్తోందని హురున్ ఇండియా వ్యవస్థాపకుడు, ప్రధాన పరిశోధకుడు అనస్ రెహమాన్ జునైద్ పేర్కొన్నారు.

అదానీ, అంబానీ తర్వాత భారతీయ బిలియనీర్లు వీరే :
ఈ జాబితాలో అదానీ, అంబానీ తరువాత హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ శివ నాడార్, ఫ్యామిలీ 3వ స్థానంలో ఉన్నారు. వీరి మొత్తం సంపద రూ. 3.14 లక్షల కోట్లు. నాలుగు, ఐదో స్థానాల్లో సైరస్ ఎస్ పూనావల్లా, సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) ఫ్యామిలీ (రూ. 2.89 లక్షల కోట్లు), సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ దిలీప్ శాంఘ్వీ (రూ. 2.49 కోట్లు)తో తర్వాతి స్థానాలో నిలిచారు.

గత ఏడాది ప్రతి ఐదు రోజులకు ఒక బిలియనీర్‌ను భారత్‌లో తయారుచేసిందని నివేదిక వెల్లడించింది. 2023లో దేశంలో 259 మంది బిలియనీర్లు ఉన్నారు. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ గణనీయంగా విస్తరించింది. 1,500 కన్నా ఎక్కువ మంది వ్యక్తులు రూ. వెయ్యి కోట్లు లేదా అంతకంటే ఎక్కువ నికర విలువను కలిగి ఉన్నారు. ఏడేళ్ల క్రితంతో పోలిస్తే ఇది 150శాతం వృద్ధిని సూచిస్తుందని బిజినెస్ టుడే నివేదించింది.

అతి పిన్న వయస్సులో బిలియనీర్లు ఎవరంటే? :
ఈసారి జాబితాలో 1,539 అల్ట్రా-రిచ్ వ్యక్తులను గుర్తించింది. గత సంవత్సరంతో పోలిస్తే 220 మంది గణనీయంగా పెరిగారు. ముఖ్యంగా, రిచెస్ట్ జాబితాలో 1,500 మందిని అధిగమించడం ఇదే మొదటిసారి కాగా, గత ఐదేళ్లలో 86శాత పెరిగింది. కుటుంబం నిర్వహించే వ్యాపారాలు అలాగే స్టార్టప్ వ్యవస్థాపకుల నుంచి ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడిదారులు, ఏంజెల్ ఇన్వెస్టర్లు, నెక్స్ట్ జనరేషన్ నాయకుల నుంచి సినీ తారల వరకు ఈ జాబితాలో విభిన్న శ్రేణిలో బిలియనీర్లుగా నిలిచారు.

ఈ జాబితాలోని అతి పిన్న వయస్కురాలు కైవల్య వోహ్రా, 21 ఏళ్లు. వోహ్రా 5 బిలియన్ డాలర్ల స్టార్టప్ అయిన జెప్టో (Zepto) సహ వ్యవస్థాపకుడు. మరో జెప్టో సహ వ్యవస్థాపకుడు ఆదిత్ పాలిచా 22 ఏళ్ల వయస్సులో రెండవ అతి పిన్న వయస్కుడిగా జాబితాలో నిలిచారు.

Read Also : Reliance AGM Event : జియో యూజర్లకు గుడ్ న్యూస్.. ఏఐ-క్లౌడ్ స్టోరేజీ వెల్‌కమ్ ఆఫర్.. ఇకపై 100జీబీ వరకు స్టోరేజీ ఉచితం..!

ట్రెండింగ్ వార్తలు