బంగారం పండుగ వచ్చింది : పాత బంగారం తెస్తే కొత్త ఆభరణాలు

  • Publish Date - October 25, 2019 / 01:21 AM IST

దీపావళి పండుగకు ముందు వచ్చేది ధన త్రయోదశి. బంగారం..వెండి వంటి విలువైన వాటిని కొనుగోలు చేసి..లక్ష్మీదేవిని పూజించే ఉత్తరాది సంప్రాదాయం..తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంది. కానీ బంగారం భారీగా ధర పెరుగుతోంది. దీంతో ఎవరూ ఆభరణాలు కొనుగోలు చేయరని, కేవలం లక్ష్మీదేవి పూజలకు పరిమతమవుతారని వివిధ బంగారు వ్యాపార సంస్థలు భావించాయి. దీంతో అమ్మకాలను పెంచుకొనేందుకు కొత్త కొత్త ప్లాన్స్ వేస్తున్నారు. మంజూరీ ఛార్జీలలో రాయితీలు, పాత ఆభరణాల మార్పిడికి ప్రోత్సాహకాలతో పాటు ఉచిత బహుమతులను ఆఫర్ చేస్తున్నాయి. 

గత సంవత్సరం దీపావళి పండుగ సమయానికి గ్రాము మేలిమి బంగారం ధర రూ. 3 వేల 200 నుంచి రూ. 3 వేల 300 వరకు ఉంది. ఇప్పుడు రూ. 3 వేల 900గా ఉంది. ధర మరీ ఎక్కువగా ఉండడం, ఆర్థిక మందగమనంతో బంగారం వ్యాపారం అంతగా కళకళలాడదని విశ్లేషకులు అంటున్నారు. పాత బంగారం తెచ్చి..అదే బరువుకు సమానమైన కొత్త ఆభరణాలు తీసుకెళ్లండి అంటూ విక్రయసంస్థలు ప్రకటనలు గుప్పిస్తున్నాయి. అయితే..పాత బంగారం ఇస్తే..వారికి ఏం లాభం అనే చిన్న డౌట్ కూడా వస్తుంది. తరుగు, మజూరీ ఛార్జీల రూపంలో వారికి ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

ఆభరణాన్ని ముందుగా పరీక్ష చేస్తారు. ఆ బంగారం ఖచ్చితంగా 22 క్యారెట్లుతో ఉండడం..ఇతర వాటిని పరిగణలోకి తీసుకుని విలువ లెక్క కడుతారు. తరుగు కింద ఆభరణం డిజైన్‌కు అనుగుణంగా 4 నుంచి 30 శాతం వరకు ఉండనున్నట్లు, అత్యధిక ఆభరణాలకు 18 నుంచి 28 శాతం కింత తరుగు వేస్తారని తెలుస్తోంది. ఇది రూ. 26 వేల నుంచి రూ. 40 వేల దాక ఉంటుందని అంచనా. ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుని ఆభరణాలు కొనుగోలు చేస్తే మేలు. 
Read More : Gold Prices : బంగారం కిందకు..వెండి పైకి

ట్రెండింగ్ వార్తలు