Gold Price: వామ్మో.. గోల్డ్ రేటు లక్ష దాటేస్తుందా..! హైదరాబాద్, విజయవాడలో ఇవాళ్టి ధరలు ఇలా..

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర..

Gold Price: వామ్మో.. గోల్డ్ రేటు లక్ష దాటేస్తుందా..! హైదరాబాద్, విజయవాడలో ఇవాళ్టి ధరలు ఇలా..

Gold

Updated On : March 14, 2025 / 10:57 AM IST

Gold and Silver Price: బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో బంగారం ధర ఒక్కసారిగా భారీగా పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు ఆల్ టైం గరిష్ఠ స్థాయిలకు చేరింది. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఏప్రిల్ నెలాఖరు నాటికి 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ రేటు రూ. లక్ష దాటుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Gold

శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ పై రూ. 1200 పెరిగింది. 22 క్యారట్ల గోల్డ్ పై రూ. 1,100 పెరిగింది. మరోవైపు వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండిపై రూ. 2వేలు పెరిగింది. దీంతో వెండి రేటు సరికొత్త రికార్డులను నమోదు చేసింది.

Gold

అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్సు (31.10గ్రాముల) బంగారం ధర 2,985 డాలర్ల కు చేరింది. దీంతో దేశీయ బలియన్ విపణిలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.89,780 వద్దకు చేరింది. మరోవైపు వెండి ధర ఆల్ టైం గరిష్టాన్ని తాకింది. కిలో వెండి రేటు రూ.1,12,000కు చేరింది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న దూకుడైన నిర్ణయాల కారణంగా వచ్చే వారం రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Gold

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర భారీగా పెరిగింది.
♦ 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ పై రూ.1200 పెరగ్గా.. 22 క్యారట్ల గోల్డ్ పై రూ.1100 పెరిగింది.
♦ ప్రస్తుతం హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.82,300 కాగా.. 24 క్యారట్ల ధర రూ.89,780కు చేరింది.

Gold

దేశవ్యాప్తంగా ఇవాళ్టి బంగారం ధరలను పరిశీలిస్తే..
♦ ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,450 కాగా.. 24 క్యారట్ల ధర రూ.89,930.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ. 82,300 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.89,780 వద్ద కొనసాగుతుంది.

Gold

వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో వెండి ధర ఇవాళ స్వల్పంగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,12,000 వద్దకు చేరింది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,03,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,12,000గా నమోదైంది.