Gold Price: వరసగా మూడోరోజు తగ్గిన బంగారం ధరలు.. ఇప్పుడే కొనేస్తే?

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,09,800గా ఉంది.

Gold Price: వరసగా మూడోరోజు తగ్గిన బంగారం ధరలు.. ఇప్పుడే కొనేస్తే?

Gold

Updated On : April 15, 2025 / 11:05 AM IST

దేశంలో బంగారం ధరలు వరసగా మూడో రోజు తగ్గాయి. ఇవాళ ఉదయం బంగారం ధరలు రూ.350 తగ్గాయి. అలాగే, భారత్‌లో వెండి ధర రూ.100 తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో పసిడి ధరలు ఇవాళ ఉదయం 11 గంటల సమయానికి తగ్గాయి. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.350 తగ్గి రూ.87,200గా ఉంది.

ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.330 తగ్గి రూ.95,180గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.290 తగ్గి రూ.71,350గా ఉంది.

Gold

Gold

ఢిల్లీ, ముంబైలో..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 తగ్గి రూ.87,350గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.330 తగ్గి రూ.95,330గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.290 తగ్గి 71,470గా ఉంది.

ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.600 తగ్గి రూ.82,250గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.650 తగ్గి రూ.89,730గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.490 తగ్గి రూ.67,300గా ఉంది.

Also Read: 70 ఏళ్ల వృద్ధురాలిని చంపి మృతదేహంపై డాన్సు చేసిన యువకుడు

వెండి ధరలు
దేశంలో వెండి ధరల్లో ఇవాళ ఉదయం నాటికి రూ.100 తగ్గుదల కనపడింది. వివిధ నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,09,800గా ఉంది
విజయవాడలో కిలో వెండి ధర రూ.1,09,800గా ఉంది
విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.1,09,800గా ఉంది
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.99,800గా ఉంది
ముంబైలో కిలో వెండి రూ.99,800గా ఉంది

NOTE: పసిడి ధరల్లో గంటల వ్యవధిలో మార్పులు చోటుచేసుకుంటాయి. కస్టమర్లు బంగారం కొనే సమయం నాటికి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి.