Gold
Gold And Silver Price: బంగారం కొనుగోలుదారులకు షాకింగ్ న్యూస్. శనివారం భారీగా తగ్గి ఊరటనిచ్చిన గోల్డ్ ధరలు.. సోమవారం మళ్లీ పెరిగాయి. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ పై రూ. 550 పెరగ్గా.. 22 క్యారట్ల గోల్డ్ పై రూ. 500 పెరిగింది. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది.
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇవాళ బంగారం ధర పెరగడానికి రెండు కారణాలను పేర్కొంటున్నారు. యూఎస్ డాలర్ రేటు రెండు నెలల కనిష్ట స్థాయికి చేరుకోవటం, అమెరికా వాణిజ్య విధానం చుట్టూ ఉన్న అనిశ్చితి కారణంగా గోల్డ్ రేటు పెరిగినట్లు పేర్కొంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విధానం వల్ల ఏర్పడిన ఆర్థిక అనిశ్చితికి త్వరలో తెరపడకపోతే ఔన్సుకు 3,000 డాలర్లు నుంచి 3,080 డాలర్లకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఇవాళ ఉదయం 10గంటలకు స్పాట్ బంగారం ధర ఔన్సుకు 2,904 డాలర్ల మార్కు వద్ద కొనసాగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర భారీగా పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.79,400 కాగా.. 24 క్యారట్ల ధర రూ.86,620 వద్ద కొనసాగుతుంది.
దేశవ్యాప్తంగా ఇవాళ్టి బంగారం ధరలను పరిశీలిస్తే..
♦ ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల ధర రూ.79,550 కాగా.. 24 క్యారట్ల ధర రూ.86,770.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో బంగారం ధర ఒకేలా ఉంది.. 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.79,400 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.86,620.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దీంతో కిలో వెండి ధర రూ.1,08,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,00,500.
♦ చెన్నైలో కిలో వెండి ధ రూ. 1,08,000గా నమోదైంది.