Today Gold Rate: మూడోరోజూ అదేతీరు.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10గ్రాముల గోల్డ్ రేటు ఎంతో తెలుసా..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర ...

Gold
Gold and Silver Prices Today: భారతీయ మార్కెట్‌లో బంగారం ధరలు రోజురోజుకూ కొత్త శిఖరాలను తాకుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలే ఇందుకు కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ. 91వేల మార్కును తాకింది. అయితే, ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే కొద్దిరోజుల్లోనే గోల్డ్ రేటు రూ.95వేల మార్కును దాటే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
భారతదేశంలో బంగారం ధర వరుసగా మూడోరోజు పెరిగింది. ఇవాళ (గురువారం) ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ పై రూ. 220 పెరిగింది. దీంతో గడిచిన మూడు రోజుల్లో రూ.1180 పెరిగింది. మరోవైపు వెండి రేటు కూడా వరుసగా మూడోరోజు పెరిగింది. మూడు రోజుల్లో కిలో వెండిపై రూ. 2,200 పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటు వివరాలను తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో బంగారం ధర పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.83,100 కాగా.. 24 క్యారట్ల ధర రూ.90,660 వద్ద కొనసాగుతుంది.
దేశవ్యాప్తంగా ఇవాళ్టి బంగారం ధరలను పరిశీలిస్తే..
♦ ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 83,250 కాగా.. 24 క్యారట్ల ధర రూ.90,810.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 83,100 కాగా.. 24క్యారెట్ల ధర రూ.90,660 వద్ద కొనసాగుతుంది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,14,100గా నమోదైంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,05,100.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,14,100గా నమోదైంది.